E-Paper
Advertisement

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!
Advertisement

AC Outdoor Cover: శీతాకాలం వస్తుండటంతో రాత్రివేళ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సహజంగానే చాలా ఇళ్లల్లో ఏసీల వినియోగం గణనీయంగా తగ్గుతోంది. అయితే ఏసీకి సంబంధించిన ఇండోర్ యూనిట్ ఇంట్లోనే సురక్షితంగా ఉన్నప్పటికీ అవుట్‌డోర్ యూనిట్ వచ్చే వేసవి వరకూ అంటే దాదాపు 5 నెలల పాటు బయటే ఉండిపోతాయి. దీని వల్ల అవుట్ డోర్ యూనిట్ పై దుమ్ము, కాలుష్య కణాలు (స్మాగ్), ఆకులు, పక్షుల రెట్టలు, దట్టమైన పొగమంచు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇది ఒక్కోసారి ఏసీ పనితీరును దెబ్బతీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి రూ.200కే లభించే అవుడ్ డోర్ యూనిట్ కవర్ తో చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

కవర్ ఏ విధంగా సాయపడుతుంది?

అవుట్‌డోర్ యూనిట్‌కు, బయటి వాతావరణానికి మధ్య రక్షణ కవచంలా ఈ కవర్ పనిచేస్తుంది. అవుట్ డోర్ యూనిట్ కు కవర్ తొడగటం వల్ల కండెన్సర్ ఫిన్స్‌పై దుమ్ము, కాలుష్య కణాలు చేరకుండా ఉంటుంది. అలాగే పక్షుల రెట్టలు, ఆకులు, చెత్తాచెదారం లోపలికి వెళ్లకుండా కవర్ నిరోధిస్తుంది. పక్షులు, ఎలుకలు గూళ్లు కట్టే అవకాశాలను తగ్గిస్తుంది. అవుట్‌డోర్ బాడీ, స్క్రూలపై తుప్పు పట్టడాన్ని నియంత్రిస్తుంది. వేసవి కాలానికి ముందు సహజంగా చేసే సర్వీసింగ్ ఖర్చును ఇది చాలా వరకూ తగ్గిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.150 నుంచి రూ.300 ధరలో లభిస్తున్న ఈ కవర్లు.. సాధారణంగా పీవీసీ (PVC) లేదా వాటర్‌ప్రూఫ్ పాలిస్టర్‌తో రూపొందాయి. వీటిని 1 టన్, 1.5 టన్, 2 టన్ వంటి కెపాసిటీలను బట్టి కొనుగోలు చేయవచ్చు.

నిర్లక్ష్యం చేస్తే ఎంత ఖర్చవుతుంది?

Advertisement

ఒకవేళ ఏసీ అవుట్ డోర్ యూనిట్ కు కవర్ తొడగకుండా ఉంటే భారీ మెుత్తంలో ఖర్చయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీలో కంప్రెసరే అత్యంత ఖరీదైన భాగం. ఒక అంచనా ప్రకారం.. 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ కంప్రెసర్ మార్చాలంటే లేబర్, గ్యాస్, ఇవాక్యుయేషన్ ఛార్జీలతో కలిపి రూ.16,000 నుంచి రూ.23,000 వరకు ఖర్చవుతుంది. అదే 1.5 టన్ నాన్-ఇన్వెర్టర్ మోడల్ అయితే రూ.12,000 నుంచి రూ.19,000 వరకు పడుతుంది. ఇక 2 టన్ ఇన్వెర్టర్ యూనిట్ అయితే రూ.28,500 వరకు ఖర్చు కావచ్చు. కంప్రెసర్‌తో పాటు గ్యాస్ రీఫిల్లింగ్, తుప్పు పట్టిన వైరింగ్, దెబ్బతిన్న ఫ్యాన్ మోటార్ వంటివి రిపేర్ బిల్లును మరింత పెంచుతాయి. వీటన్నింటితో పోలిస్తే రూ.200 పెట్టి కొనే కవర్ చాలా చిన్న ఖర్చే అయినా ఇది ఏసీని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

కొనేముందు ఇవి గుర్తుపెట్టుకోండి

Advertisement

ఏసీ అవుట్‌డోర్ యూనిట్ పొడవు, వెడల్పులను కొలిచిన తర్వాతే కవర్ ను ఆర్డర్ చేస్తే బెటర్. ఎందుకంటే బ్రాండ్‌లను బట్టి సైజులు మారుతుంటాయి. కవర్ మరీ లూజుగా ఉంటే బలమైన గాలికి ఊడిపోవచ్చు. మరీ బిగుతుగా ఉంటే చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటర్‌ప్రూఫ్, గాలి ఆడే మెటీరియల్‌తో రూపొందిన కవర్ ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తిగా మూసుకుపోయిన ప్లాస్టిక్ కవర్ అయితే పొగమంచు సమయంలో తేమ లోపలికి వెళ్లి తుప్పు పట్టే ప్రమాదం ఉందని హితవు పలుకుతున్నారు.

Also Read: ఒకే ఒక్క రీఛార్జ్.. ఏడాది పొడవునా ఫ్రీ కాల్స్, డేటా.. Airtel చౌకైన వార్షిక ప్లాన్స్ ఇవే!

Tags

Related News

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

ఆకట్టుకునే లుక్, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్స్‌తో Samsung Galaxy F70 5G వచ్చేస్తోంది!

ఒకే ఒక్క రీఛార్జ్.. ఏడాది పొడవునా ఫ్రీ కాల్స్, డేటా.. Airtel చౌకైన వార్షిక ప్లాన్స్ ఇవే!

ఆఫీస్,స్టడీస్ కోసం బెస్ట్ డెల్ ల్యాప్‌టాప్..120Hz డిస్‌ప్లేతో అదుర్స్!

రూ.937లకే పోర్టబుల్ స్పీకర్! డిస్కౌంట్‌లో కొనేయండి

ఈ సౌండ్ బార్ ఉంటే..ఇల్లు డిస్కో టెక్ అవడం గ్యారంటీ!

రూ.499లకే అదిరిపోయే ఇయర్‌బడ్స్! తక్కువ ధరలో 48 గంటల బ్యాటరీ బ్యాకప్

Big Stories

Advertisement
×