Samsung Galaxy F70 5G: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో అడుగు పెట్టనుంది. అదే Samsung Galaxy F70 5G. ఈ ఫోన్‌ను అక్టోబర్ 18న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక పేజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఫోన్ డిజైన్, కెమెరాలు, డిస్ప్లే, బ్యాటరీ వంటి ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి. బోల్డ్ బ్లాక్, వివిడ్ వైలెట్ అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.
Samsung Galaxy F70 5G ఫోన్‌ను అక్టోబర్ 18న భారత్‌లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో Galaxy F70 Pro 5G, Galaxy F70e 5G మోడళ్లు ఉన్నాయి. కొత్త ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే ఫోన్ ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లాంచ్ సమయంలో ధర, అమ్మకాలు ప్రారంభమయ్యే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఈ ఫోన్ డిస్ప్లే రిపేర్ ఖర్చుతో iPhone 18 Pro కొనేయొచ్చు.. యాపిల్ కొత్త ఫోల్డబుల్ రేట్లు తెలుసా?
ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనికి తోడుగా 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరాను అందిస్తున్నారు.
ఇందులో ఫుల్ HD+ రిజల్యూషన్‌తో కూడిన ఫ్లాట్ sAMOLED డిస్ప్లే ఉంటుంది. స్క్రీన్కు Corning Gorilla Glass Victus రక్షణ కూడా ఉంది. ఈ ఫోన్లో శాంసంగ్ సొంత Exynos 1330 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు. ఫోన్ మందం కేవలం 7.5 మిల్లీమీటర్లు ఉండటం మరో ప్రత్యేకత.
ఈ ఫోన్లో 5,000mAh బ్యాటరీని అందిస్తున్నారు. దీనికి 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. Circle to Search వంటి AI ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే Samsung Knox Security రక్షణను అందిస్తున్నారు. ఫోన్లో ఏ వెర్షన్ One UI ఉంటుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఇక డిజైన్ విషయానికి వస్తే.. వెనుక భాగంలో నిలువుగా అమర్చిన కెమెరా మాడ్యూల్, ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ కనిపిస్తున్నాయి. కుడివైపు పవర్ బటన్, కింద USB Type-C పోర్ట్ ఉన్నాయి. మొత్తంగా, మంచి డిస్ప్లే, OIS కెమెరా, పెద్ద బ్యాటరీ కోరుకునే వారికి ఈ ఫోన్ ఆసక్తికరమైన ఎంపిక కావచ్చు. అయితే దీని ధరే కొనుగోలుదారుల నిర్ణయంలో కీలకంగా మారనుంది.
Also Read: ఎండ తగలగానే కలర్ మారే లెన్స్.. నథింగ్ AI గ్లాసెస్ ఫీచర్లు చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది!