E-Paper
Advertisement

ఒకే ఒక్క రీఛార్జ్.. ఏడాది పొడవునా ఫ్రీ కాల్స్, డేటా.. Airtel చౌకైన వార్షిక ప్లాన్స్ ఇవే!

ఒకే ఒక్క రీఛార్జ్.. ఏడాది పొడవునా ఫ్రీ కాల్స్, డేటా.. Airtel చౌకైన వార్షిక ప్లాన్స్ ఇవే!
Advertisement

Airtel Recharge: ఫోన్‌ను పదే పదే రీఛార్జ్ చేయలేక విసిగిపోయే మొబైల్ యూజర్లకు ఎయిర్‌టెల్ (Airtel) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే ఎక్కువ కాలం వ్యాలిడిటీ ఉండే అద్భుతమైన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 2,249 ధరతో వస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ఏకంగా 365 రోజుల (ఏడాది) పాటు టెలికాలం సేవలు పొందొచ్చు. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

రూ. 2,249 ప్లాన్ ప్రత్యేకతలు

రూ. 2,249 ధరతో లభించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ ద్వారా యూజర్లు ఏడాది మొత్తం అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్లాన్ మెుత్తానికి 30GB హై-స్పీడ్ డేటా, 3,600 ఎస్ఎంఎస్‌లు (SMS) లభిస్తాయి. మరోవైపు అదనపు ప్రయోజనాల కింద రూ. 4,000 వరకు విలువ చేసే ‘అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం’ (Adobe Express Premium) సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు ఫ్రీగా పొందొచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే

Advertisement

ఈ ప్లాన్‌లో ఫ్రీగా ‘ఎయిర్‌టెల్ సేఫ్ నెట్‌వర్క్’ (Airtel Safe Network) యాడ్-ఆన్ సైతం లభించనుంది. అటు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియుల కోసం ‘ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే’ (Airtel Xstream Play) యాక్సెస్ ను కూడా అందిస్తున్నారు. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన డిజిటల్ కంటెంట్‌ను ఫ్రీగా చూడొచ్చు.

Also Read: టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

మరో ఆప్షన్‌గా రూ.1849 ప్లాన్

Advertisement

ఏడాది పొడవునా డేటా అక్కర్లేని వారి కోసం జియో మరో చౌకైన రూ.1849 వార్షిక ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. 365 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ లో ఎలాంటి డేటా యూజర్లకు లభించదు. అయితే అన్ లిమిటెడ్ కాల్స్, 3,600 ఎస్ఎంఎస్ లు పైన పేర్కొన్న ప్లాన్ తరహాలోనే యథావిధిగా లభిస్తాయి. దీంతో 12 నెలల ఉచిత ‘అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం’ సబ్‌స్క్రిప్షన్, ‘ఎయిర్‌టెల్ సేఫ్’ యాక్సెస్, ‘హలో ట్యూన్స్’ (Caller tunes) ఫ్రీగా పొందొచ్చు. తక్కువ ఖర్చుతో ఏడాది పాటు సిమ్ ను యాక్టివ్‌గా ఉంచాలని భావించే వారికి రూ. 2,249, రూ.1849 ప్లాన్లు బెస్ట్ ఆప్షన్ ఎయిర్ టెల్ వర్గాలు సూచిస్తున్నాయి.

Also Read: నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

Tags

Related News

ఆఫీస్,స్టడీస్ కోసం బెస్ట్ డెల్ ల్యాప్‌టాప్..120Hz డిస్‌ప్లేతో అదుర్స్!

రూ.937లకే పోర్టబుల్ స్పీకర్! డిస్కౌంట్‌లో కొనేయండి

ఈ సౌండ్ బార్ ఉంటే..ఇల్లు డిస్కో టెక్ అవడం గ్యారంటీ!

రూ.499లకే అదిరిపోయే ఇయర్‌బడ్స్! తక్కువ ధరలో 48 గంటల బ్యాటరీ బ్యాకప్

రూ.750కే అద్భుతమైన బ్లూటూత్..ఇయర్ బడ్స్! అస్సలు మిస్సవ్వొద్దు!

బిగ్ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..ఏసర్‌ప్యూర్ నైట్రో 85 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్

మీ ఇంటికి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇదే..మిజియా 6 ఫీచర్లు అదుర్స్!

Big Stories

Advertisement
×