E-Paper
Advertisement

ఏసీలో పసిపిల్లల్ని పడుకోబెడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే చాలా ప్రమాదం!

ఏసీలో పసిపిల్లల్ని పడుకోబెడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే చాలా ప్రమాదం!
Advertisement

AC safety for Babies: వేసవిలో ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఏసీ గదుల్లో ఎక్కువసేపు గడుపుతుంటారు. పసిపిల్లలను సైతం ఎక్కువ సమయం ఏసీ గదుల్లో ఉంచుతుంటారు. ఇలా చిన్నారులను ఏసీ గదుల్లో ఉంచడం సురక్షితమే అయినప్పటికీ వారి విషయంలో 8 జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చని హెచ్చరిస్తున్నారు. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సరైన ఉష్ణోగ్రత

పసిపిల్లల్ని ఏసీ గదిలో ఉంచినప్పుడు ఉష్ణోగ్రతను మరీ తక్కువగా పెట్టకూడదు. గది ఉష్ణోగ్రతను 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం ఉత్తమం. ఈ ఉష్ణోగ్రత శిశువు శరీరానికి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు చలి వల్ల కలిగే ఇబ్బందులను తగ్గిస్తుంది.

చల్లగాలి నేరుగా తగలనివ్వొద్దు..

Advertisement

ఏసీ నుంచి వచ్చే చల్లని గాలి నేరుగా బిడ్డపై పడకుండా చూసుకోవాలి. గాలి తగలడం వల్ల శిశువు త్వరగా చల్లబడి జలుబు లేదా ముక్కు దిబ్బడ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏసీ వింగ్స్‌ను పైకి లేదా మరొక వైపుకు తిప్పి ఉంచడం ద్వారా ఈ సమస్య నుంచి చిన్నారిని బయటపడేయచ్చు.

మృదువైన దుస్తులు

ఏసీలో ఉంచాల్సి వచ్చినప్పుడు చిన్నారికి మందపాటి బట్టలు ధరించకూడదు. తేలికగా, గాలి బాగా ఆడే కాటన్ దుస్తులు వేయడం మంచిది. అయితే బిడ్డ చేతులు, కాళ్లు పూర్తిగా వస్త్రంతో కప్పబడి ఉండేలా చూసుకోండి. అవసరమైతే పలుచని కాటన్ దుప్పటిని బిడ్డకు కప్పవచ్చు.

తేమను కాపాడటం

Advertisement

సాధారణంగా ఏసీలు.. గదిలోని తేమను పూర్తిగా తగ్గించేస్తాయి. దీనివల్ల శిశువు చర్మం, ముక్కు పొడిబారిపోయే ప్రమాదముంది. కాబట్టి గదిలో ఒక చిన్న గిన్నెలో నీరు ఉంచడం ద్వారా గాలిలో తేమ (Humidity) తగ్గకుండా చూసుకోవచ్చు.

ఏసీ సర్వీసింగ్

ఏసీ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం మర్చిపోకూడదు. దుమ్ము, ధూళి ఉన్న ఫిల్టర్ల వల్ల గాలి కలుషితమై బిడ్డకు శ్వాసకోశ సమస్యలు లేదా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

గది ఉష్ణోగ్రతలో మార్పులు

చల్లని ఏసీ గది నుండి ఒక్కసారిగా బిడ్డను వేడి వాతావరణంలోకి తీసుకెళ్లకండి. బయటకు వెళ్లే ముందు ఏసీ ఆపేసి.. గది ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చే వరకు వేచి ఉంచితే చిన్నారి శరీరం ఉష్ణోగ్రతకు అలవాటు పడిపోతుంది. అప్పుడు బయటకు తీసుకెళ్లడం ఉత్తమం.

మాయిశ్చరైజర్ రాయడం

ఏసీ వల్ల చర్మం పొడిబారకుండా ఉండటానికి బిడ్డకు మంచి బేబీ లోషన్, మాయిశ్చరైజర్ రాయడం మంచిది. దీనివల్ల చర్మం మృదువుగా ఉండి.. చిన్నారికి స్కిన్ సమస్యలు రాకుండా ఉంటాయి.

Also Read: Jio Plan: రోజుకు రూ.10 మాత్రమే.. 98 రోజుల పాటు.. అపరిమిత 5G డేటా, ఉచిత ఓటీటీలు!

బిడ్డను ఒంటరిగా ఉంచొద్దు

ఏసీ గదిలో బిడ్డను ఒంటరిగా ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. చిన్నారికి చలి వేస్తుందా? వేడిగా ఉందా? అని పక్కనే ఉండి గమనిస్తూ ఉండాలి. చేతులు, కాళ్లు కాస్త చల్లగా ఉన్న పర్లేదు గానీ.. ఛాతీ భాగం చల్లబడితే ఏసీ టెంపరేచర్ ను వెంటనే పెంచాలి.

Also Read: అధునాతన స్మార్ట్ కూలర్లు.. ఏసీలకు ప్రత్యామ్నాయం కాగలవా? నిపుణులు ఏమంటున్నారు!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×