E-Paper
Advertisement

తుది అంకానికి డీలిమిటేషన్.. రాత్రి 7 గంటలకు ఓటింగ్, బిల్లు గట్టెక్కుతుందా?

తుది అంకానికి డీలిమిటేషన్.. రాత్రి 7 గంటలకు ఓటింగ్, బిల్లు గట్టెక్కుతుందా?

ఢిల్లీ వేదికగా దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. లోక్‌సభలో ఈ కీలక బిల్లుపై చర్చ తుది అంకానికి చేరుకోవడంతో అటు పాలక పక్షం ఇటు విపక్షాల్లో తీవ్ర ఉత్సుకత నెలకొంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు చట్టబద్ధత కల్పించే ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా ఆమోదం పొందేలా వ్యూహాలు రచిస్తోంది. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సభలో ప్రసంగించనున్నారు. అనంతరం 7 గంటలకు సభ్యుల మధ్య ఓటింగ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.

ప్రస్తుత లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 540 కాగా ఎన్డీయే కూటమి బలం 297 వద్ద ఉంది. మరోవైపు ఇండియా కూటమి 234 మంది సభ్యులతో గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఈ రాజ్యాంగపరమైన మార్పులకు సంబంధించిన బిల్లు నెగ్గాలంటే ప్రభుత్వానికి కనీసం 360 మంది సభ్యుల మద్దతు అవసరం. తమకున్న బలానికి తోడు మరో 63 మంది సభ్యుల ఓట్లు అదనంగా రాబట్టడంపైనే కేంద్రం దృష్టి సారించింది. సొంత బలం సరిపోని పక్షంలో ప్రతిపక్షాల మద్దతు కూడగట్టడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తెరవెనుక జరిపిన రాయబారాలు ఫలిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ (SP), తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) మద్దతును కేంద్రం కూడగట్టినట్లు తెలుస్తోంది. ఈ మూడు కీలక పార్టీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం లేదా ఓటింగ్ సమయంలో సభకు గైర్హాజరు కావడం ద్వారా పరోక్షంగా సహకరించే అవకాశం ఉంది. ఈ పార్టీలు ఒకవేళ ఓటింగ్‌లో పాల్గొనకుండా తప్పుకుంటే సభలోని మొత్తం సభ్యుల సంఖ్య (ప్రెజెంట్ అండ్ ఓటింగ్) గణనీయంగా తగ్గుతుంది. అప్పుడు కేంద్రం వద్ద ఉన్న 297 సంఖ్యా బలం బిల్లు ఆమోదానికి సరిపోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య సీట్ల కేటాయింపులో సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళనలు విపక్షాల్లో బలంగా ఉన్నాయి. వీటిని నివృత్తి చేసేందుకు అమిత్ షా తన ప్రసంగంలో స్పష్టమైన హామీలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. బిల్లు ఆమోదం పొందితే దేశంలోని లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు రాష్ట్రాల ప్రాతినిధ్యంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. గత కొన్ని రోజులుగా సభలో జరుగుతున్న వాదోపవాదాలు ముగిసి ఈ రోజు రాత్రికి ఒక స్పష్టత రానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ గండం నుంచి గట్టెక్కితే అది మోదీ ప్రభుత్వానికి అతిపెద్ద విజయం అవుతుంది. ఓటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఢిల్లీలోని పార్లమెంట్ పరిసరాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది.

Also Read: Delimitation : తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలించారా?

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×