Jio Plan: ప్రముఖ టెలికాం సంస్థ జియో.. విస్తృతమైన నెట్ వర్క్, వేగవంతమైన డేటా, నాణ్యమైన కాల్స్ కు బాగా పాపులర్ అయ్యింది. జియో తన యూజర్ల కోసం ఎన్నో రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో రూ.999 ప్లాన్ ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్ద ఎత్తున యూజర్లు ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటున్నట్లు జియో వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రూ.999 ప్లాన్ ప్రయోజనాలు, దీనిని చేసుకోవడం వల్ల ఎవరికి లాభం? వంటి విశేషాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.
జియో ఈ ఆల్ రౌండ్ ప్రీపెయిడ్ ప్లాన్ ను 98 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ప్రతీరోజు 2 GB హై-స్పీడ్ డేటా ఈ ప్లాన్ ద్వారా యూజర్ కు లభిస్తుంది. ప్లాన్ పరిమితి పూర్తయ్యే సరికి యూజర్ కు 196 GB లభిస్తుంది. ఒక వేళ మీ ప్రాంతంలో జియో 5G నెట్‌వర్క్ ఉండి మీ వద్ద 5G స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అపరిమిత 5G డేటా (Unlimited 5G Data) వాడుకోవచ్చు. దీంతో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100SMSలు యూజర్ చేసుకోవచ్చు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో.. జియో ఈ రూ.999 ప్లాన్ కింద 3 నెలలపాటు హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది. అలాగే జియో టీవీ (JioTV), జియో సినిమా (JioCinema), జియో క్లౌడ్ (JioCloud) వంటి యాప్స్‌కు ఉచిత యాక్సెస్ ను యూజర్ పొందవచ్చు. అదే విధంగా గూగుల్ జెమిని ప్రో ఏఐ (Google Gemini Pro AI) వంటి డిజిటల్ సర్వీసులను కూడా జియో ఆఫర్ చేస్తోంది.
Also Read: అధునాతన స్మార్ట్ కూలర్లు.. ఏసీలకు ప్రత్యామ్నాయం కాగలవా? నిపుణులు ఏమంటున్నారు!
ప్రతీ నెలా రీఛార్జ్ చేసుకునే తలనొప్పి వద్దని భావించేవారికి రూ.999 ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే 3 నెలల 8 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. అధిక డేటా వినియోగం అవసరముండే విద్యార్థులు, ఉద్యోగులకు ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. బడ్జెట్ లో మంచి ఆల్ రౌండ్ ప్యాక్ కోరుకునేవారు సైతం నిరభ్యంతరంగా దీనిని చేసుకోవచ్చు. 98 రోజులకు రూ.999 అంటే రోజుకు సుమారు రూ.10 మాత్రమే యూజర్ కు ఖర్చు అవుతుంది.
Also Read: అమెజాన్ సమ్మర్ బొనాంజా.. అత్యంత చౌకగా ఏసీలు.. వామ్మో ధరలు ఇలా తగ్గించేశారేంటి!