Acer Aspire 14 laptop: ప్రస్తుత రోజుల్లో ల్యాప్‌టాప్ అనేది అందరి జీవితంలో ఒక అత్యవసర గాడ్జెట్‌గా మారిపోయింది. ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగుల వరకు ..ప్రతి ఒక్కరికీ ల్యాప్‌టాప్ తప్పనిసరి. అయితే ఎక్కువ ధర పెట్టి కొనలేక, బడ్జెట్ ధరలో.. మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్ కోసం వెతికే వారికి ప్రముఖ బ్రాండ్ ‘ఏసర్’ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. మార్కెట్లో ఎంతో ట్రెండ్ అవుతున్న Acer Aspire 14 Notebook ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. కేవలం రూ.34,990 ధరకే లభిస్తున్న ఈ ల్యాప్‌టాప్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ ల్యాప్‌టాప్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, స్లీక్‌గా, చాలా మోడర్న్‌గా ఉంటుంది. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ లేదా ఆఫీస్‌కి ట్రావెల్ చేసే ఉద్యోగులు తమ బ్యాగ్‌లో చాలా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఏసర్ బ్రాండ్ బిల్డ్ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతే కాకుండా ఇది చూడటానికి కూడా చాలా క్లాసీ లుక్ ఇస్తుంది.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో బెస్ట్ ప్రాసెసర్‌ను వాడారు.మీరు ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డాక్యుమెంట్లు తయారు చేయడం, ఆన్ లైన్ వీడియో కాల్స్ మాట్లాడటం, యూట్యూబ్ వీడియోలు చూడటం వంటి సాధారణ పనులన్నింటినీ ఇది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. స్టూడెంట్స్‌కి , బేసిక్ వర్క్ చేసే వారికి ఈ ప్రాసెసర్ బెస్ట్ అని చెప్పొచ్చు.
సాధారణంగా ఈ బడ్జెట్ ల్యాప్‌టాప్‌లలో తక్కువ స్పెసిఫికేషన్స్ ఇస్తుంటారు. కానీ ఏసర్ ఇందులో.. 8 GB RAM, 256 GB SSD స్టోరేజ్‌ను అందించింది. దీనిలో ఎస్‌ఎస్‌డీ ఉండటం వల్ల ల్యాప్‌టాప్ ఆన్ అవ్వడానికి కేవలం సెకన్లు మాత్రమే పడుతుంది. అలాగే.. దీనిలో యాప్స్ కూడా క్షణాల్లో ఓపెన్ అవుతాయి. 8GB ర్యామ్ కారణంగా మీరు ఒకే సారి అనేక టాస్క్‌లు చేసినా సిస్టమ్ హ్యాంగ్ అవ్వకుండా ఎంతో స్మూత్‌గా పని చేస్తుంది. స్పీడ్ విషయంలో.. ఎలాంటి రాజీ లేదు.
ఇందులో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేను ఇచ్చారు. దీని పిక్చర్ క్లారిటీ చాలా స్పష్టంగా, కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది ఆన్‌లైన్ క్లాసులు వినేటప్పుడు లేదా సినిమాలు చూసేటప్పుడు కంటికి ఎలాంటి ఒత్తిడి కలగకుండా అద్భుతమైన ఫీల్ ఇస్తుంది. అంతేకాకుండా.. ఇది లేటెస్ట్ విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీని వల్ల సరి కొత్త ఫీచర్లు, మెరుగైన సెక్యూరిటీ , యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ లభిస్తాయి.
ఈ నోట్‌బుక్‌లో అవసరమైన అన్ని రకాల పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. యూఎస్‌బీ పోర్టులు, హెచ్‌డీఎంఐ పోర్ట్, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా దీనిలో ఉన్నాయి. అలాగే దీని బ్యాటరీ బ్యాకప్ కూడా సాధారణ పనులకు సరిపడా ఎక్కువ టైం ఇస్తుంది. స్లీక్ డిజైన్, లైట్ వెయిట్ కారణంగా దీన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీ అని చెప్పొచ్చు.
Also Read: కొత్త ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ సేల్‌లో ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లపై భారీ తగ్గింపు
ఇక ఈ ల్యాప్‌టాప్ అసలు ధర మార్కెట్లో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 56% భారీ డిస్కౌంట్ ఆఫర్ కారణంగా ఇది కేవలం రూ.34,990 ధరకే మార్కెట్లో లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా నంబర్ వన్ ఆప్షన్.
మీరు తక్కువ బడ్జెట్‌లో.. కాలేజీ ప్రాజెక్ట్‌ల కోసం, ఆన్‌లైన్ క్లాసుల కోసం లేదా డైలీ ఆఫీస్ వర్క్ కోసం నమ్మకమైన ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నట్లయితే.. ఈ మోడల్ ల్యాప్ ట్యాప్ నిరభ్యంతరంగా కొనొచ్చు. ఈ సూపర్ డీల్ మిస్ కాకుండా వెంటనే మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి!