Acer CB315-8H Chromebook: ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికీ ల్యాప్‌టాప్ అనేది నిత్య జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ముఖ్యంగా ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్, డాక్యుమెంట్ ఎడిటింగ్ , ఎంటర్‌టైన్‌మెంట్ కోసం విండోస్ ల్యాప్‌టాప్‌లు ఖరీదైనవిగా మారుతున్న తరుణంలో.. గూగుల్ క్రోమ్ ఓఎస్ ఆధారిత క్రోమ్‌బుక్‌లు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఈ కోవకే చెందిన ‘ఏసర్ క్రోమ్‌బుక్ CB315-8H’ ఇప్పుడు మార్కెట్లో రూ.26,990 ధరతో అందుబాటులో ఉంది. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది చాలాబాగా ఉపయోగపడుతుంది. ఈ గాడ్జెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏసర్ క్రోమ్‌బుక్ చూడటానికి చాలా స్లీక్‌గా , ట్రెండీగా కనిపిస్తుంది. ఇందులో.. 15.6 ఇంచుల డిస్‌ప్లేను అందించారు. పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు వినేటప్పుడు లేదా సినిమాలు చూసేటప్పుడు.. ఎలాంటి కంటి ఒత్తిడి లేకుండా స్పష్టంగా చూడొచ్చు. అంతే కాకుండా ల్యాప్‌టాప్ బరువు కూడా చాలా తక్కువగా ఉండటంతో స్కూల్ బ్యాగ్‌లో వేసుకొని ఎక్కడికైనా దీనిని ఈజీగా తీసుకెళ్లొచ్చు.
ఈ లాప్‌టాప్‌లో పవర్ ఫుల్ మీడియాటెక్ కొంపానియో 540 ప్రాసెసర్‌ను వాడారు. ఇది మల్టీటాస్కింగ్‌ను చాలా సాఫీగా నిర్వహిస్తుంది. క్రోమ్ బ్రౌజర్‌లో అనేక ట్యాబ్‌లు ఓపెన్ చేసి పని చేసినప్పటికీ లాప్టాప్ హ్యాంగ్ అవ్వకుండా వేగంగా పని చేస్తుంది. విద్యార్థులకు రీసెర్చ్ చేసుకోవడానికి.. ప్రాజెక్టులు చేసుకోవడానికి ఈ ప్రాసెసర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇందులో 4 జీబీ ర్యామ్ (4 GB RAM), 128 జీబీ ఈఎంఎంసీ (128 GB EMMC) స్టోరేజ్ ఉంటుంది. ఈ స్టోరేజ్ సహాయంతో మీరు మీ ప్రాజెక్ట్ ఫైల్స్, ఫోటోలు, వీడియోలు మరియు ముఖ్యమైన డాక్యుమెంట్లను దాచుకోవచ్చు. క్లౌడ్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉండటంతో డేటా సేఫ్టీ గురించి ఎలాంటి టెన్షన్ ఉండదు.
ఈ ల్యాప్‌టాప్ గూగుల్ ప్రత్యేకమైన ‘క్రోమ్ ఓఎస్’పై రన్ అవుతుంది. ఇది వైరస్ బారిన పడకుండా .. అత్యంత సురక్షితంగా ఉంటుంది. అంతే కాకుండా దీనిని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉండటం వల్ల ఆండ్రాయిడ్ యాప్‌లను కూడా నేరుగా డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. రోజంతా ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు పూర్తి చేసుకోవచ్చు.
Also Read: రూ.999కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఈ ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు!
మార్కెట్లో విద్యార్థుల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ ఏసర్ క్రోమ్‌బుక్ మీడియాటెక్ కొంపానియో 540 ధర కేవలం రూ. 26,990 గా ఉంది. ఆన్‌లైన్ ఈకామర్స్ సేల్స్‌లో బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా దీనిని మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
మీ పిల్లల చదువుల కోసం లేదా మీ ప్రాథమిక.. ఆఫీస్ అవసరాల కోసం తక్కువ ధరలో..ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఏసర్ క్రోమ్‌బుక్ CB315-8H చాలా మంచి ఆప్షన్ అవుతుంది. రూ.30,000 లోపు బడ్జెట్‌లో ఇది ఖచ్చితంగా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్.