E-Paper
Advertisement

రూ.736కే ట్రెండీ ఇయర్‌బడ్స్..ఫీచర్లు చూస్తే ఫిదా అవడం గ్యారంటీ

రూ.736కే ట్రెండీ ఇయర్‌బడ్స్..ఫీచర్లు చూస్తే ఫిదా అవడం గ్యారంటీ
Advertisement

ROAR wireless earbuds: ప్రస్తుత రోజుల్లో వైర్లతో ఉండే.. ఇయర్‌ఫోన్ల ట్రెండ్ ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఎటు వెళ్లాలన్నా,జిమ్‌లో వర్కవుట్ చేయాలన్నా, లేదా ప్రశాంతంగా పాటలు వినాలన్నా ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్‌ ఉండాల్సిందే. అయితే.. మంచి బ్రాండ్ ఇయర్‌ బడ్స్ కొనాలంటే.. వేల రూపాయలు ఖర్చు పెట్టాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తూ.. కేవలం రూ. 736 ధరకే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది ‘ROAR పోర్టబుల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్’. ఈ బడ్జెట్‌లో ఇది ఇస్తున్న ఫీచర్లు నిజంగా అద్భుతమనే చెప్పాలి.ఇంతకీ ఈ ఫీచర్లకు సంబంధించిన పూర్తి ఫీచర్ల గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1.ట్రెండీ ఆరెంజ్ డిజైన్,లుక్:

ఈ ఇయర్‌ బడ్స్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడర్న్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా.. దీనికి కేటాయించిన ఆరెంజ్ కలర్ చాలా వైబ్రెంట్‌గా ఉండి యూజర్లను వెంటనే ఆకర్షిస్తుంది. దీని ఛార్జింగ్ కేస్.. చాలా కాంపాక్ట్‌గా ఉండటంతో.. పాకెట్‌లో లేదా చిన్న హ్యాండ్‌ బ్యాగ్‌లో ఈజీగా సర్దుకోవచ్చు.అంతే కాకుండా ఇది తక్కువ బరువు ఉండటం వల్ల చెవులకు పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు.

2. స్మార్ట్ బ్యాటరీ లెవెల్ పవర్ మీటర్:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకత ఏమిటంటే.. దీని ఛార్జింగ్ కేస్‌పై ప్రత్యేకమైన ‘స్మార్ట్ బ్యాటరీ లెవెల్ పవర్ మీటర్’ఉంటుంది. దీని ద్వారా కేస్‌లో , ఇయర్‌బడ్స్‌లో ఎంత బ్యాటరీ మిగిలి ఉందనేది డిజిటల్ రూపంలో.. స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా బ్యాటరీ ఎప్పుడు అయి పోతుందనే టెన్షన్ లేకుండా ముందే అలర్ట్ అయి ఛార్జ్ చేసుకోవచ్చు.

3.ట్రూ వైర్‌లెస్ కనెక్టివిటీ ,సౌండ్ క్వాలిటీ:

బ్లూటూత్ కనెక్షన్: ఇది లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీతో.. పనిచే స్తుంది కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌కు క్షణాల్లో.. కనెక్ట్ అవుతుంది.ఇది సిగ్నల్స్ ఎక్కడ కూడా కట్ అవ్వకుండా స్టేబుల్ కనెక్షన్‌ను ఇస్తుంది.

Advertisement

ఆడియో ఫీల్: ఈ బడ్జెట్‌లో చిన్న సైజులో ఉన్నప్పటికీ మంచి బేస్ ,క్లియర్ వాయిస్ అవుట్‌ పుట్‌ను అందిస్తుంది. పాటలు వినేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు.. లేదా ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు సౌండ్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

4. బ్యాటరీ బ్యాకప్, పోర్టబిలిటీ:

రోజువారీ వాడకానికి ఈ ఇయర్‌ బడ్స్ చక్కటి బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. దీనికి ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. గంటల కొద్ది మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు లేదా వ్యాయామం చేసే సమయంలో ఈ వైర్‌లెస్ హెడ్‌ సెట్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. టచ్ కంట్రోల్స్ ద్వారా కాల్స్ లిఫ్ట్ చేయడం, మ్యూజిక్ ప్లే/పాజ్ చేయడం వంటి పనులను దీంతో ఈజీగా చేయెచ్చు.

Also Read: మ్యూజిక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..రూ.949కే జెబ్రోనిక్స్ 20W స్పీకర్

5.ధర:

మార్కెట్లో అనేక బడ్జెట్ ఇయర్‌బడ్స్ ఉన్నప్పటికీ..ఈ  పోర్టబుల్ వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ కేవలం రూ. 736 ధరకే లభించడం విశేషం. ఈ ధరలో ఇలాంటి స్మార్ట్ పవర్ మీటర్ ఫీచర్ రావడం నిజంగా గొప్ప విషయమే.

మీరు తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్ , మంచి ఫీచర్లు ఉన్న వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ కొనాలని ఆలోచిస్తుంటే.. పోర్టబుల్ వైర్‌లెస్ ఇయ ర్‌బడ్స్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది.రూ.1000లోపు ధరలో ఇది ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్!

Related News

సినిమా థియేటర్‌ను ఇంటికే తెచ్చుకోండి..రూ.5వేలలోపే బెస్ట్ ప్రొజెక్టర్లు

ఆన్‌లైన్ క్లాసులు,ఆఫీస్ వర్క్ కోసం ఏసర్ క్రోమ్‌బుక్ లాంచ్- ధర ఎంతంటే?

రూ.999కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఈ ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..రూ.949కే జెబ్రోనిక్స్ 20W స్పీకర్

రూ.1000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్..కొంటే ఇలాంటి వాచ్ కొనాలి!

అమెజాన్ సేల్..రూ.50వేలలోపు టాప్ 5 స్మార్ట్ టీవీలు ఇవే!

టెక్ వరల్డ్‌లో సెన్సేషన్..‘కింగ్ద్రా’ కోడ్‌తో నథింగ్ ఇయర్ 3 ప్రో గ్రాండ్ ఎంట్రీ

Big Stories

Advertisement
×