E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్‌తో 19 గంటల బ్యాటరీ.. ఏసర్ నుంచి అద్భుతమైన AI ల్యాప్‌టాప్ లాంచ్!

సింగిల్ ఛార్జ్‌తో 19 గంటల బ్యాటరీ.. ఏసర్ నుంచి అద్భుతమైన AI ల్యాప్‌టాప్ లాంచ్!
Advertisement

Acer Swift Air 14: ప్రముఖ టెక్ బ్రాండ్ ఏసర్ సరికొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Swift Air 14 పేరుతో వచ్చిన ఈ నోట్‌బుక్ ముఖ్యంగా స్టూడెంట్స్, ఆఫీస్ ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ డిజైన్ చేశారు. బరువు తక్కువగా ఉంటూనే.. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేలా దీనిని రూపొందించారు.

లైట్ వెయిట్ డిజైన్:

ఈ ల్యాప్‌టాప్ చూడ్డానికే కాదు.. పట్టుకోవడానికి కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. దీని బరువు కేవలం 1.25 కేజీలు మాత్రమే. అలాగే ఇది 12.9 మి.మీ. మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. దీని బాడీని అల్యూమినియంతో తయారు చేయడం వల్ల గట్టిదనంతో పాటు మంచి లుక్ వస్తుంది. సేజ్ గ్రీన్, ఫ్రాస్ట్ బ్లూ, బ్లోసమ్ పింక్, లైలాక్ పర్పుల్ లాంటి నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది.

4 స్టీరియో స్పీకర్లు..

Advertisement

ఈ Acer Swift Air 14లో 14 ఇంచుల స్క్రీన్‌ను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. దీంతో స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. దీని బ్రైట్‌నెస్ 350 నిట్స్ వరకు ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వినోదం విషయానికొస్తే.. దీనిలో నాలుగు స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. దీనివల్ల సినిమా చూస్తున్నప్పుడు లేదా పాటలు వింటున్నప్పుడు థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది.

Also Read: కూలర్ ఆన్‌లో ఉన్నా ఉక్కపోతగా అనిపిస్తుందా? అయితే ఈ 4 విషయాల్లో తప్పు చేస్తున్నట్టే!

ఏఐ స్మార్ట్ ఫీచర్లు:

Advertisement

ఇంటెల్ కోర్ సిరీస్ 3 లేటెస్ట్ ప్రాసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టాస్క్‌ల కోసం ప్రత్యేక చిప్‌ను అమర్చారు. దీనివల్ల ఆఫీస్ పనులు, వీడియో ఎడిటింగ్ చాలా వేగంగా సాగుతాయి. అలాగే ఇందులో ఫేస్ లాక్ ఫీచర్ ఉంది. మన ప్రైవసీ కోసం కెమెరాకు ఫిజికల్ షట్టర్ కూడా ఇచ్చారు. ఆన్‌లైన్ క్లాసులు లేదా మీటింగ్స్ మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల వచ్చే గోల వినిపించకుండా ఉండేందుకు ప్రత్యేక AI టెక్నాలజీని వాడారు.

19 గంటల బ్యాటరీ లైఫ్:

ఈ ల్యాప్‌టాప్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 19 గంటల పాటు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. దీంతో ఆఫీస్‌కు లేదా కాలేజీకి వెళ్లేటప్పుడు ఛార్జర్ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం దాదాపు ఉండదు. అలాగు ఇందులో 16GB RAM, 512GB స్టోరేజ్ ఇచ్చారు. అవసరమైతే స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. వైఫై 6E, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సి పోర్టులు వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది జులై లేదా ఆగస్టు నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

Also Read: ప్రయాణాల్లో 5G నెట్‌వర్క్‌ను ఆన్‌లో ఉంచుతున్నారా? జరిగే నష్టం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×