E-Paper
Advertisement

కూలర్ ఆన్‌లో ఉన్నా ఉక్కపోతగా అనిపిస్తుందా? అయితే ఈ 4 విషయాల్లో తప్పు చేస్తున్నట్టే!

కూలర్ ఆన్‌లో ఉన్నా ఉక్కపోతగా అనిపిస్తుందా? అయితే ఈ 4 విషయాల్లో తప్పు చేస్తున్నట్టే!
Advertisement

Best air coolers 2026: ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మంచి ఎయిర్ కూలర్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ చిన్న చిన్న విషయాలు తెలుసుకోకపోతే మీ డబ్బులు వృథా అవ్వడమే కాకుండా.. కూలర్ సరిగ్గా చల్లదనాన్ని ఇవ్వదు. అందుకే కొత్త కూలర్ కొనేటప్పుడు లేదా ఇంట్లో ఉన్న కూలర్‌ను సమర్థవంతంగా వాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి. అవేంటంటే..

గది సైజుకు తగ్గ కూలర్:

చాలామంది చేసే మొదటి తప్పు గది సైజును పట్టించుకోకపోవడం. చిన్న రూమ్ కోసం 30 నుండి 50 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉన్న కూలర్ సరిపోతుంది. అదే పెద్ద హాల్ లేదా గది అయితే 70 నుండి 80 లీటర్ల కెపాసిటీ ఉన్న కూలర్ అవసరమవుతుంది. చిన్న కూలర్‌ను పెద్ద రూమ్‌లో పెడితే గది అస్సలు చల్లబడదు. పైగా పదే పదే నీళ్లు పోయాల్సి వస్తుంది.

ఎయిర్‌ఫ్లో.. సిఎఫ్ఎమ్:

Advertisement

కూలర్ డిజైన్‌ను చూసి కొనుగోలు చేయకుండా.. అది ఎంత గాలిని అందిస్తుందో తెలిపే CFM (క్యూబిక్ ఫీట్ పర్ మినిట్) రేటింగ్‌ను గమనించాలి. CFM ఎక్కువగా ఉంటేనే గది అంతటా చల్లటి గాలి వేగంగా విస్తరిస్తుంది. తక్కువ ధరలో వస్తున్నాయి కదా అని బలహీనమైన ఫ్యాన్ ఉన్న కూలర్లను కొంటే ఆశించిన చల్లదనం రాదు.

Also Read: ఇక థియేటర్‌కు వెళ్లక్కర్లేదు.. 4 స్పీకర్లు, మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చేస్తోన్న షావోమి కొత్త సిరీస్!

హనీకోంబ్ ప్యాడ్స్ ఉత్తమం:

Advertisement

పాతకాలపు గడ్డి ప్యాడ్ల కంటే ఇప్పుడు వస్తున్న హనీకోంబ్ (తేనెతుట్టె ఆకారపు) కూలింగ్ ప్యాడ్స్ చాలా బెటర్. ఇవి ఎక్కువ కాలం మన్నడమే కాకుండా.. గాలిని బాగా పీల్చుకుని గదిని త్వరగా చల్లబరుస్తాయి. వీటితో మెయింటెనెన్స్ తలనొప్పి కూడా ఉండదు. గడ్డి ప్యాడ్లు అయితే త్వరగా పాడైపోయి గాలిని అడ్డుకుంటాయి.

గాలి వెలుతురు ముఖ్యం:

ఎయిర్ కూలర్లు ఏసీల లాగా మూసి ఉన్న గదిలో పనిచేయవు. కూలర్ వాడేటప్పుడు గది కిటికీ లేదా తలుపు కొద్దిగా తెరిచి ఉంచాలి. అప్పుడే లోపల ఉక్కపోత లేకుండా చల్లటి గాలి సర్క్యులేట్ అవుతుంది. అలాగే, క్లీన్ చేయడం సులువుగా ఉండేలా, కరెంట్ తక్కువగా వాడుకునే మోడల్స్ ఎంచుకుంటే వేసవి హాయిగా గడిచిపోతుంది.

Also Read: సౌండ్‌బార్ కొనాలో.. హోమ్ థియేటర్ కొనాలో అర్థం కావట్లేదా? ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే ఈజీగా డిసైడవుతారు!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×