E-Paper
Advertisement

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!
Advertisement

Lingverse iKairos: మన దైనందిన జీవితంలో ఏఐ పాత్ర రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పుడు మనం ఉపయోగించే డివైజెస్ కూడా మరింత స్మార్ట్‌గా మారుతున్నాయి. తాజాగా IFA 2026 ఈవెంట్‌లో ‘లింగ్‌వర్స్’ అనే సంస్థ ‘ఐకైరోస్’ పేరుతో ఒక వినూత్న ఏఐ పరికరాన్ని పరిచయం చేసింది. ఇది కేవలం ఒకే రకంగా కాకుండా.. మన అవసరానికి తగ్గట్టుగా రూపాంతరం చెందేలా రూపొందించడం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఎలా పనిచేస్తుంది?

ఈ ఐకైరోస్ డివైజ్‌లో ఒక చిన్న గుండ్రటి పెండెంట్ ప్రధాన సీపీయూలా పనిచేస్తుంది. దీనిని ఒక చిన్న డెస్క్‌టాప్ రోబోట్‌లో అమర్చుకోవచ్చు. లేదా బయటకు వెళ్లేటప్పుడు తీసి మెడలో పెండెంట్‌లా తొడుక్కోవచ్చు. దీనివల్ల మనం ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్నా లేదా బయట తిరుగుతున్నా.. ఇది మన దైనందిన అలవాట్లను, చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిరంతరం గమనిస్తూ సమాచారాన్ని సేకరిస్తుంది.

Advertisement

Also Read: తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

లైఫ్‌ఓఎస్ మ్యాజిక్:

ఈ పరికరం LifeOS అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. ఇది మనం రోజూ చేసే పనులు, మన ఇష్టాయిష్టాలు, మాట్లాడే విషయాలను గుర్తుపెట్టుకుంటుంది. ఉదా: మనం తరచూ స్విమ్మింగ్ లేదా కొత్త హాబీ గురించి మాట్లాడుతున్నా దాంట్లో ముందడుగు వేయకపోతే.. ఇది గుర్తించి మనకు తగిన సలహాలు ఇస్తుంది. మనం చూసే ప్రదేశాలు, నచ్చిన వస్తువుల వివరాలను కూడా ఇది దాచి ఉంచి, అవసరమైనప్పుడు గుర్తుచేస్తుంది.

మన డేటా సేఫేనా?

Advertisement

ఎల్లప్పుడూ మనల్ని గమనించే పరికరం అనగానే ప్రైవసీ గురించి అనుమానాలు రావడం సహజం. అందుకే దీనికి కెమెరా షట్టర్, మైక్ మ్యూట్ బటన్, లైట్ ఇండికేటర్ ఇచ్చారు. వాయిస్ ప్రాసెసింగ్ మన పరికరంలోనే జరుగుతుంది. డేటా క్లౌడ్‌కు వెళ్లాలో వద్దో మనమే నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా, మన సమాచారాన్ని ఏఐ మోడల్స్ శిక్షణ కోసం వాడమని, ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాను డిలీట్ చేసుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది.

లాంచ్ ఎప్పుడంటే?

ఈ సరికొత్త ఏఐ డివైజ్ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది? దీని ధర ఎంత? అనేది కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. ఆసక్తి ఉన్న వినియోగదారుల కోసం ప్రస్తుతం వెయిట్‌లిస్ట్ నమోదును ప్రారంభించింది. భవిష్యత్తులో ఈ కోర్ పెండెంట్‌ను మరిన్ని రకాల హోమ్ రోబోట్స్‌లో కూడా వాడేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×