Realme TechLife 84L refrigerator: ఇంటికి లేదా ఆఫీస్‌కు ఒక చిన్న సైజు ఫ్రిజ్ అవసరం అయినప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. తక్కువ స్థలంలో పట్టేయాలి, తక్కువ కరెంట్ కాల్చాలి, బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగా ఉండాలి అనుకునేవారికి సింగిల్ డోర్ ఫ్రిజ్‌లు ఎప్పుడూ బెస్ట్ అని చెప్పొచ్చు. మార్కెట్లో చాలా బ్రాండ్లు ఉన్నప్పటికీ.. టెక్నాలజీ పరంగా ఎప్పుడూ ముందుండే ‘రియల్‌మీ’ సంస్థ ఇప్పుడు టెక్‌లైఫ్ సిరీస్‌లో అద్భుతమైన ఫ్రిజ్ తీసుకువచ్చింది. అదే ఈ మోడల్. దీని ధర సుమారు రూ. 9,490 ఉండటంతో మార్కెట్లో దీనికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ ఫ్రిజ్ డిజైన్ చాలా కాంపాక్ట్‌గా , స్టైలిష్‌గా ఉంటుంది.’సిల్వర్ గ్రే’ కలర్ ఫినిషింగ్‌తో .. వస్తున్న ఈ డివైస్ మీ కిచెన్, బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్ లుక్‌ను ఇన్‌స్టంట్‌గా మార్చేస్తుంది. తక్కువ స్థలం ఉన్న ఇళ్లలో.. దీన్ని సర్దుకోవడం చాలా ఈజీ. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా క్వాలిటీతో ఉండి, ఎక్కువ కాలం పనిచేసేలా డిజైన్ చేయబడింది.
ఇది 84 లీటర్ల కెపాసిటీతో.. వస్తుంది. సింగిల్ పర్సన్స్, బ్యాచిలర్స్, స్టూడెంట్స్ లేదా చిన్న ఫ్యామిలీలు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇందులో.. పాలు, కూరగాయలు, పండ్లు, వాటర్ బాటిల్స్, ఇతర నిత్యవసర వస్తువులను ఈజీగా సర్దుకోవడానికి తగినంత స్థలం ఉంటుంది. చిన్న ఫ్రీజర్ కంపార్ట్‌మెంట్ కూడా ఉండటం వల్ల ఐస్‌క్రీమ్‌లు లేదా ఐస్ క్యూబ్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు.
ఈ రిఫ్రిజిరేటర్ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీతో పని చేస్తుంది. దీని వల్ల ఫ్రిజ్ లోపల చాలా త్వరగా.. కూలింగ్ అందుతుంది. అంతే కాకుండా ఆహారం కూడా తాజాగా ఉంటుంది. సమ్మర్ లో కాలంలో కూడా కూలింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది పర్ఫెక్ట్‌గా పని చేస్తుంది.
కరెంట్ బిల్లుల గురించి టెన్షన్ పడేవారికి.. ఇది గుడ్ న్యూస్. ఇది 2 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. తక్కువ కరెంట్ తో పనిచేసేలా దీన్ని రూపొందించారు. దీని వల్ల నెలవారీ కరెంట్ బిల్లు మీద పెద్దగా భారం పడదు. అలాగే.. స్టేబిలైజర్ లేకుండానే పనిచేసే సామర్థ్యం దీని సొంతం, కాబట్టి వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల.. ఫ్రిజ్ పాడైపోతుందనే టెన్షన్ ఉండదు.
Also Read: పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మోడల్ ఫ్రిజ్ ధర సుమారు రూ. 9,490 వరకు ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలాగే.. ఇతర ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డ్ ఆఫర్లు.. లేదా ఎక్స్ఛేంజ్ ఆప్షన్లను ఉపయోగిస్తే.. ఇది ఇంకా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.
పది వేల రూపాయల కంటే.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, మంచి కూలింగ్ కెపాసిటీ, నమ్మకమైన బ్రాండ్ కోరుకునే.. వారికి ఈ రియల్‌మీ ఫ్రిజ్ ఒక అద్భుతమైన ఛాయిస్. మీ చిన్న అవసరాలను తీర్చడానికి.. ఇది పర్ఫెక్ట్‌గా సరి పోతుంది.