E-Paper
Advertisement

బిగ్ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..ఏసర్‌ప్యూర్ నైట్రో 85 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్

బిగ్ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..ఏసర్‌ప్యూర్ నైట్రో 85 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్
Advertisement

Acerpure NITRO 85 review: పెద్ద స్క్రీన్‌పై సినిమాలు చూడాలన్నా, లేదా పీసీ గేమింగ్ ఆస్వాదించాలన్నా పెద్ద సైజు స్మార్ట్ టీవీ ఉండాల్సిందే. అయితే.. 85 ఇంచ్‌ల భారీ డిస్‌ప్లే అంటే వేలల్లో కాదు, లక్షల్లో ఖర్చు అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ ఆలోచనను తల కిందులు చేస్తూ.. ప్రముఖ బ్రాండ్ ఏసర్‌ప్యూర్ తన సరి కొత్త ‘ఏసర్‌ప్యూర్ నైట్రో 215 సెంటీమీటర్లు (85 ఇంచుల) క్యూలెడ్ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ’ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఈ టీవీ మార్కెట్లో ఎందుకు హాట్ టాపిక్‌గా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిస్‌ప్లే, పిక్చర్ క్వాలిటీ:

ఈ టీవీకి మెయిన్ అట్రాక్షన్ దీని భారీ 85 ఇంచుల క్యూలెడ్ డిస్‌ప్లే. క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కారణంగా కలర్స్ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. 4కే అల్ట్రా హెచ్‌డీ రెసల్యూషన్ సపోర్ట్ ఉండటం వల్ల చిన్న వివరాలు.. కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంతే కాకుండా దీనిలో డీఆర్ సపోర్ట్ కూడా ఉండటంతో సినిమాలోని.. డార్క్, బ్రైట్ సీన్స్ చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. మీరు ఓటీటీలో సినిమాలు లేదా స్పోర్ట్స్ చూసేటప్పుడు.. థియేటర్ ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది.

ఆడియో, సౌండ్ ఫీల్:

Advertisement

మంచి విజువల్స్ ఉన్నప్పుడు.. దానికి తగినంత పవర్‌ ఫుల్ సౌండ్ కూడా ఉండాలి. ఏసర్‌ప్యూర్ నైట్రో టీవీలో పవర్ ఫుల్ బిల్ట్-ఇన్ స్పీకర్లను అందించారు. డాల్బీ ఆడియో ,డాల్బీ అట్మాస్ సపోర్ట్.. ఉండటం వల్ల సరౌండ్ బెస్ట్ సౌండ్ ఫీల్ కలుగుతుంది. ప్రత్యేకించి హోమ్ థియేటర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే.. రూమ్ మొత్తం హోరెత్తే మ్యూజిక్ లేదా డైలాగ్ క్లారిటీని ఇది అందిస్తుంది.

స్మార్ట్ ఫీచర్లు,గూగుల్ టీవీ ఓఎస్:

ఇది లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్ అన్నీ ఇన్‌బిల్ట్‌గా లభిస్తాయి. గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ కూడా దీనిలో ఉండటం వల్ల కేవలం మీ గొంతు తోనే.. టీవీని ఆపరేట్ చేయెచ్చు. అలాగే క్రోమ్‌కాస్ట్ ఇన్‌బిల్ట్ ఉండటం వల్ల మీ స్మార్ట్‌ ఫోన్ లేదా ట్యాబ్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్..మీ ఇంటి అవసరాలకు ఏది బెస్ట్?

గేమింగ్,కనెక్టివిటీ:

గేమర్స్ కోసం ఈ టీవీలో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. పెద్ద స్క్రీన్‌పై ప్లేస్టేషన్ లేదా ఎక్స్‌బాక్స్ కనెక్ట్ చేసి ఆడుతున్నప్పుడు లేటెస్ట్ గేమింగ్ ఫీల్ దొరుకుతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, యూఎస్‌బీ పోర్ట్‌లు, వై-ఫై, బ్లూటూత్ సపోర్ట్ లభిస్తాయి. దీని స్లీక్ బెజెల్ లెస్ డిజైన్ లివింగ్ రూమ్ లుక్‌ను పూర్తిగా మార్చేస్తుంది.

ధర:

అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న.. ఈ ‘ఏసర్‌ప్యూర్ నైట్రో 85 ఇంచ్ క్యూలెడ్ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ'(2026 ఎడిషన్) అధికారిక ధర ఇండియన్ మార్కెట్లో రూ.85,499 గా ఉంది. 85 ఇంచుల క్యూలెడ్ కేటగిరీలో ఈ ధర నిజంగా అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు.

తక్కువ బడ్జెట్‌లో భారీ స్క్రీన్, అద్భుతమైన క్యూలెడ్ పిక్చర్ క్వాలిటీ , స్మార్ట్ ఫీచర్లు కోరుకునే.. వారికి ‘ఏసర్‌ప్యూర్ నైట్రో 85 ఇంచ్’ టీవీ ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్. మీ ఇల్లు లేదా ఆఫీస్ లౌంజ్‌ను అప్‌గ్రేడ్ చేసు కోవాలనుకుంటే.. ఇది బెస్ట్ ఆప్షన్!

Related News

మీ ఇంటికి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇదే..మిజియా 6 ఫీచర్లు అదుర్స్!

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్..మీ ఇంటి అవసరాలకు ఏది బెస్ట్?

తక్కువ ధరలో ప్రీమియం మ్యూజిక్..బెస్ట్ 5 సోనీ హెడ్‌ఫోన్స్ ఇవే!

అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టార్టప్ విప్లవం..స్పేస్‌లో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు..!

ఈ ఫోన్ డిస్‌ప్లే రిపేర్ ఖర్చుతో iPhone 18 Pro కొనేయొచ్చు.. యాపిల్ కొత్త ఫోల్డబుల్ రేట్లు తెలుసా?

ఎండ తగలగానే కలర్ మారే లెన్స్.. నథింగ్ AI గ్లాసెస్ ఫీచర్లు చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది!

పండగ సేల్‌లో భారీ షాక్..కొనుగోళ్లకు దూరంగా ఉంటున్న జనాలు!

Big Stories

Advertisement
×