Best jeans to wear with kurti| కుర్తీతో జీన్స్ వేసుకోవడం చాలామంది మహిళలకు ఇష్టమైన ఫ్యాషన్ స్టైల్. కాలేజీకి వెళ్లినా, ఆఫీసుకు వెళ్లినా, స్నేహితులతో బయటకు వెళ్లినా ఈ కాంబినేషన్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అయితే, అన్నీ కుర్తీలతో ఒకే రకమైన జీన్స్ వేసుకుంటే మీ లుక్ ఎప్పుడూ ఒకేలా కనిపించవచ్చు. కుర్తీ డిజైన్‌కు సరిపోయే జీన్స్ ఎంచుకుంటే మీ స్టైల్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. స్ట్రెయిట్ ఫిట్ నుంచి బూట్‌కట్ వరకు వివిధ రకాల జీన్స్‌తో మీకు నచ్చిన లుక్ సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు. మరి, ఏ కుర్తీతో ఎలాంటి జీన్స్ వేసుకుంటే బాగుంటుందో తెలుసుకుందాం.
స్ట్రెయిట్ ఫిట్ కుర్తీలు సింపుల్‌గా, అందంగా కనిపిస్తాయి. వీటికి కిందివైపు వెడల్పుగా ఉండే వైడ్ లెగ్ జీన్స్ మంచి ఎంపిక. ఈ కాంబినేషన్ ఆధునికంగా కనిపించడంతోపాటు రోజువారీ దుస్తులకు కూడా సరిపోతుంది. కాలేజీకి లేదా ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఈ స్టైల్ ట్రై చేయండి. ఫ్లాట్ సాండల్స్, ట్రెడిష్నల్ జుట్టీలు లేదా చిన్న హ్యాండ్‌బ్యాగ్‌తో మీ లుక్ కంప్లీట్ చేయండి.
పెప్లమ్ కుర్తీలు నడుము దగ్గర ఫిట్‌గా ఉండి, కిందివైపు కొద్దిగా వెడల్పుగా ఉంటాయి. వీటికి కిందివైపు స్వల్పంగా వెడల్పయ్యే బూట్‌కట్ జీన్స్ చక్కగా సరిపోతాయి. ఈ కాంబినేషన్ సాధారణ దుస్తులకు కొత్తదనాన్ని అందిస్తుంది. స్నేహితులతో బయటకు వెళ్లేటప్పుడు లేదా చిన్న వేడుకలకు హాజరయ్యేటప్పుడు ఈ స్టైల్ ఎంచుకోండి. జుంకాలు, సౌకర్యవంతమైన పాదరక్షలు మీ లుక్ మరింత అందంగా మారుస్తాయి.
కాఫ్తాన్ కుర్తీలు వదులుగా ఉండటంతో రోజంతా సౌకర్యంగా ఉంటాయి. వీటికి స్ట్రెయిట్ ఫిట్ జీన్స్ జతచేస్తే చక్కని క్యాజువల్ లుక్ వస్తుంది. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు, కాలేజీలో లేదా స్నేహితులను కలిసేటప్పుడు ఈ కాంబినేషన్‌ను ట్రై చేయండి.చిన్న చెవిపోగులు, సింపుల్ సాండల్స్, స్టైలిష్ బ్యాగ్‌తో మీ దుస్తులకు మరింత అందాన్ని తీసుకువస్తాయి.
అనార్కలి కుర్తీలు కిందివైపు ఎక్కువ గెదర్తో సంప్రదాయంగా కనిపిస్తాయి. వీటికి శరీరానికి దగ్గరగా ఫిట్ అయ్యే స్కిన్నీ జీన్స్ జతచేస్తే అందమైన కాంట్రాస్ట్ కనిపిస్తుంది. కుటుంబ వేడుకలు, చిన్నపాటి ఫంక్షన్లు లేదా సాధారణ పిక్నిక్ టైమ్‌లో ఈ కాంబినేషన్ ఎంచుకోవచ్చు. కుర్తీ కలర్‌కు సరిపోయే చెవిపోగులు, జుట్టీలు లేదా సింపుల్ సాండల్స్‌తో మీ లుక్ పూర్తి చేయండి.
Also Read: సన్‌స్క్రీన్ వాడుతున్నా చర్మం నల్లబడుతోందా? మీరు చేస్తున్న తప్పులు ఇవే
షార్ట్ కుర్తీలు ఆధునిక ఫ్యాషన్‌ను ఇష్టపడేవారికి మంచి ఎంపిక. వీటికి బూట్‌కట్ జీన్స్ జతచేస్తే స్టైలిష్‌గా, కొత్తగా కనిపిస్తారు. కాలేజీ, ఆఫీసు లేదా షాపింగ్‌కు వెళ్లేటప్పుడు ఈ కాంబినేషన్ ప్రయత్నించండి. స్పోర్టీ లుక్ కోసం స్నీకర్స్, సాధారణ లుక్ కోసం సాండల్స్ ఎంచుకోండి. చిన్న స్లింగ్ బ్యాగ్‌తో మీ స్టైల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోండి.
కుర్తీ పొడవు, డిజైన్, ఫిట్‌ను బట్టి జీన్స్‌ను ఎంచుకోవడం ముఖ్యం. మీకు సౌకర్యంగా ఉండే స్టైల్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. సరైన జీన్స్, పాదరక్షలు, చిన్నపాటి యాక్సెసరీలతో కొత్త దుస్తులు కొనకుండానే మీ పాత కుర్తీలతో కొత్త లుక్ పొందవచ్చు.
Also Read: రిలేషన్లో ప్రేమ, నమ్మకం పెరగాలంటే మీ భాగస్వామిని రోజూ ఈ 5 ప్రశ్నలు అడగండి