Xiaomi Mijia Smart Air Purifier 6: ఇంట్లో.. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం.. మన ఆరోగ్యానికి ఎంతైనా అవసరం. ముఖ్యంగా నగరాల్లో.. నివసించే వారికి ఎయిర్ ప్యూరిఫైర్స్ ఒక నిత్యావసర వస్తువుగా మారి పోయాయి. ఈ నేపథ్యంలో షియోమి తన పాపులర్ మిజియా సిరీస్‌లో భాగంగా ‘మిజియా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ 6’ను విడుదల చేసింది. తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు అందించడంలో పేరుగాంచిన షియోమి, ఈసారి ఈ డివైజ్‌లో ఎలాంటి మార్పులు తెచ్చింది? దీని పనితీరు ఎలా ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
షియోమి ప్రొడక్ట్స్ డిజైన్ ఎప్పుడూ మినిమలిస్టిక్‌గా , మోడర్న్‌గా ఉంటుంది. మిజియా ఎయిర్ ప్యూరిఫైర్ 6 కూడా అదే.. ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. తెల్లని రంగులో, సిలిండర్ ఆకారంలో.. ఉండే ఈ ప్యూరిఫైర్ ఏ గది లోనైనా చాలా అందంగా ఇమిడి పోతుంది. ముందు భాగంలో.. ఒక క్లియర్ అయిన ఓఎల్ఈడీ డిస్ప్లేను ఇచ్చారు. దీని ద్వారా గదిలోని గాలి నాణ్యత , టెంపరేచర్, హ్యుమిడిటీ వంటి వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు. దీనిని ఒక రూమ్ నుంచి మరో గదికి మార్చడం కూడా చాలా ఈజీ.
ఈ ఎయిర్ ప్యూరిఫైర్ మెయిన్ హైలైల్ దీని మల్టీ-లేయర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్. ఇది గాలిలోని చిన్న చిన్న కణాలు , పుప్పొడి రేణువులు, పెంపుడు జంతువుల వెండ్రుకలు, హాని కరమైన బాక్టీరియాను సమర్థవంతంగా ..తొలగిస్తుంది. హై-ఎఫిషియన్సీ ఫిల్టర్ కారణంగా చిన్న కణాలు కూడా గదిలో.. తిరగకుండా అడ్డుకుంటుంది. దీని CADR సామర్థ్యం చాలా బాగుంది. పెద్ద హాల్ లేదా బెడ్రూమ్ అయినా క్షణాల్లో గాలిని శుభ్ర పరుస్తుంది.
పేరుకు తగ్గట్టుగానే.. ఇది ఒక ‘స్మార్ట్’ ఎయిర్ ప్యూరిఫైర్. మిజియా యాప్ లేదా షియోమి హోమ్ యాప్ ద్వారా.. మీ స్మార్ట్ ఫోన్ నుంచే.. దీనిని కంట్రోల్ చేయెచ్చు. మీరు ఆఫీసులో ఉన్నప్పటికీ.. ఇంటిలోని గాలి క్వాలిటీ చెక్ చేసి, కావాలంటే ప్యూరిఫైర్‌ను ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు. అంతే కాదు, గూగుల్ అసిస్టెంట్ , అమెజాన్ అలెక్సా వాయిస్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఇందులో.. లభిస్తుంది. రాత్రి సమయంలో నిద్రకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి దీనిలో ప్రత్యేకమైన ‘స్లీప్ మోడ్’ ఇచ్చారు. ఇది చాలా తక్కువ శబ్దం చేస్తూ సైలెంట్‌గా పని చేస్తుంది.
Also Read: తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్..మీ ఇంటి అవసరాలకు ఏది బెస్ట్?
ఎయిర్ ప్యూరిఫైర్లు రోజంతా నడవాల్సి ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్లు గురించి అందరికీ టెన్షన్ ఉంటుంది. అయితే మిజియా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ 6 ఎనర్జీ ఎఫిషియంట్ మోటార్‌తో వస్తుంది. ఇది చాలా తక్కువ కరెంట్ ను ఖర్చు చేస్తుంది.
లేటెస్ట్ ఫీచర్లు, అద్భుతమైన స్మార్ట్ కంట్రోల్ , ఆకట్టుకునే డిజైన్‌తో వస్తున్న ‘మిజియా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ 6’ బడ్జెట్ ధరలో ఒక బెస్ట్ ఆప్షన్ ఎంపిక అని చెప్పొచ్చు. మీ ఇల్లు లేదా ఆఫీస్‌లో.. కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛమైన గాలిని అందించడానికి ఇది పర్ఫెక్ట్గా సరి పోతుంది. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కోసం ఈ స్మార్ట్ డివైజ్ ఖచ్చితంగా వర్త్ బయింగ్!