Best microwave oven: మారుతున్న లైఫ్ స్టైల్లో వంటగదిలో మైక్రోవేవ్ ఓవెన్ అనేది ప్రతి ఇంటికి ఒక నిత్యావసర వస్తువుగా మారి పోయింది. కేవలం వంటలను వేడి చేయడమే కాకుండా.. బేకింగ్, గ్రిల్లింగ్ , వంటను ఈజీ చేసుకోవడానికి ఇది ఎంతో సహాయ పడుతుంది. మార్కెట్లో రకరకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. తక్కువ బడ్జెట్లో ఎక్కువ కాలం పాడవకుండా ఉండే.. బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్‌ను ఎంచుకోవడం ఎలా? మహిళలకు ఎంతో అనుకూలంగా ఉండే బడ్జెట్ ఓవెన్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
చిన్న కుటుంబాలకు లేదా కేవలం రీహీటింగ్ (వేడి చేయడం), సాధారణ వంట అవసరాలు ఉన్న వారికి ఇది నంబర్ వన్ ఛాయిస్. పానాసోనిక్ బ్రాండ్ క్వాలిటీకి ఎప్పుడూ పేరు గాంచింది. దీని కాంపాక్ట్ డిజైన్ చిన్న కిచెన్లలో.. కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఆటో-కుక్ మెనూలు, చైల్డ్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. తక్కువ కరెంట్ ఖర్చుతో.. పని చేసే ఈ ఓవెన్ బడ్జెట్ బైర్స్కు అద్భుతమైన ఆప్షన్.
అత్యంత తక్కువ బడ్జెట్లో.. మైక్రో వేవ్ కోరుకునే.. స్టూడెంట్స్ లేదా బ్యాచిలర్స్ కోసం.. బజాజ్ 17ఎల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. అంతే కాకుండా.. దీనిని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ. నాన్-వెజ్ వంటకాలు, పాలు వేడి చేయడం, టీ లేదా కాఫీ తయారీ వంటి రోజూవారీ పనులకు ఇది ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువగా ఉండటంతో అందరికీ అందుబాటులో ఉంటుంది.
మీకు కేవలం వేడి చేయడమే కాకుండా.. కేకులు బేక్ చేయడం, పిజ్జా చేయడం, తందూరి డిషెస్ , గ్రిల్లింగ్ వంటి అన్ని రకాల పనులు కావాలంటే.. కొంచెం బడ్జెట్ పెంచి ఎల్జీ 28ఎల్ కన్వెన్షనల్ ఓవెన్‌ను ఎంచుకోవచ్చు. ఇది ఇంటిలోని అందరి అవసరాలను తీర్చ గల ఆల్-రౌండర్ ఓవెన్. ఇంటెల్లావేవ్ టెక్నాలజీ ఉండటం వల్ల ఆహారం అన్ని వైపులా సమానంగా వేడెక్కుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ కేవిటీ కారణంగా శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ.
Also Read: పండగ సేల్‌లో భారీ షాక్..కొనుగోళ్లకు దూరంగా ఉంటున్న జనాలు!
శాంసంగ్ బ్రాండ్ కిచెన్ అప్లయన్సెస్ డిజైన్, లుకింగ్ పరంగా ఎప్పుడూ ముందే ఉంటాయి. దీని సెరామిక్ ఎనామెల్ కేవిటీ గీతలు పడకుండా కాపాడుతుంది. అంతే కాకుండా బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు. ఇందులో.. ఉండే ప్రత్యేకమైన కర్డ్ మేకింగ్ ఫంక్షన్ ఇండియన్ కుటుంబాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ కరెంట్ బిల్లుతో ఎక్కువ లైఫ్ ఇస్తుంది.
ఇండియన్ వంటకాలకు.. ఐఎఫ్బీ ప్రొడక్ట్స ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉన్నాయి. ఈ 20 లీటర్ల ఓవెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు వంటగది అవసరాలను అద్భుతంగా తీరుస్తుంది. ఆటో డ్రాస్ట్, పవర్ లెవెల్ కంట్రోల్.. వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐఎఫ్బీ అందించే కస్టమర్ సర్వీస్ నెట్వర్క్ కూడా దేశ వ్యాప్తంగా బలంగా ఉండటం దీనికి మరో ప్లస్ పాయింట్.
మీ ఇంటి అవసరాలు కేవలం ఆహారాన్ని వేడి చేయడం, సాధారణ వంట అయితే బడ్జెట్ ధరలో.. లభించే పానాసోనిక్ లేదా బజాజ్ సోలో ఓవెన్స్ బెస్ట్. అలా కాకుండా బేకింగ్, గ్రిల్లింగ్ అన్నీ ఒకే దాంట్లో కావాలంటే .. ఎల్జీ లేదా శాంసంగ్ కన్వెన్షనల్ ఓవెన్స్ ఎంచుకోవడం బెస్ట్. మీ బడ్జెట్, అవసరాన్ని బట్టి సరైన ఓవెన్‌ను ఎంచుకోండి!