E-Paper
Advertisement

AI School Refund: డిగ్రీ పూర్తి చేసే సమయానికి మీ పిల్లాడి సంపాదన రూ.9.25 కోట్లు.. లేకుంటే ఫీజు రిఫండ్.. ఏఐ స్కూల్ హామీ

AI School Refund: డిగ్రీ పూర్తి చేసే సమయానికి మీ పిల్లాడి సంపాదన రూ.9.25 కోట్లు.. లేకుంటే ఫీజు రిఫండ్.. ఏఐ స్కూల్ హామీ
Advertisement

AI School Earnings| ప్రపంచవ్యాప్తంగా విద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చదువుకు భారీ మొత్తాలు ఖర్చు చేస్తున్నారు. అయితే అమెరికాలో ఒక కొత్త స్కూల్ తల్లిదండ్రులకు ఒక షాకింగ్ హామీ ఇస్తోంది. ఆ స్కూల్ పేరు ఆల్ఫా స్కూల్. ఇది AI ఆధారిత విద్యా విధానాన్ని అనుసరిస్తుంది. ఈ స్కూల్ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ (డిగ్రీ పూర్తి) నాటికి 1 మిలియన్ డాలర్లు (సుమారు 9.25 కోట్ల రూపాయలు) సంపాదిస్తారని హామీ ఇస్తోంది. ఈ లక్ష్యం సాధించకపోతే పూర్తి ఫీజు తిరిగి ఇస్తామని చెబుతోంది.

1 మిలియన్ డాలర్లు సంపాదించండి లేదంటే ఫీజు రిఫండ్

ఈ ప్రకటన X ప్లాట్‌ఫాంలో కామెరాన్ సోర్స్‌బీ అనే వ్యక్తి షేర్ చేశాడు. ఈ ప్రోగ్రామ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (వ్యాపార స్థాపన) ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం రూపొందించబడింది. స్కూల్ సమయంలోనే విద్యార్థులు నిజమైన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గ్రాడ్యుయేషన్ నాటికి 1 మిలియన్ డాలర్లు సంపాదించకపోతే పూర్తి ట్యూషన్ ఫీజు తిరిగి ఇస్తారు.

అడ్వాన్స్ విద్యా విధానం 

Advertisement

ఆల్ఫా స్కూల్ సాధారణంగా పాఠాలు, లెక్చర్లు చెప్పే బదులు AI టూల్స్‌ గురించి శిక్షణ ఇస్తుంది. విద్యార్థులు రోజుకు 2 గంటలు మాత్రమే అకడమిక్ సబ్జెక్టులు చదువుతారు. AI సిస్టమ్.. ప్రతి విద్యార్థి బలాలు, బలహీనతలు, నేర్చుకునే వేగాన్ని విశ్లేషిస్తుంది. వాటి ఆధారంగా పర్సనలైజ్డ్ లెర్నింగ్ ప్లాన్ తయారు చేస్తుంది. ChatGPT, Claude వంటి AI టూల్స్ ఈ లెర్నింగ్ ప్లాన్ రూపొందిస్తారు. దీంతో చదువు త్వరగా, సమర్థవంతంగా జరుగుతుంది. టీచర్ల పాత్ర తక్కువగా ఉంటుంది. వ్యాపార నైపుణ్యాల కోసం కోచ్‌లు మార్గదర్శకత్వం అందిస్తారు.

రియల్-వరల్డ్ స్కిల్స్‌పై ఫోకస్

సాధారణ పాఠ్య పుస్తకాల చదువులు ముగిసిన తర్వాత మిగిలిన సమయంలో విద్యార్థులు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకుంటారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్‌షిప్, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పిస్తారు. విద్యార్థులు తమ ప్యాషన్ ప్రాజెక్ట్‌లు లేదా చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తారు. కోచ్‌లు బిజినెస్ ప్లానింగ్, ఫైనాన్షియల్ డెసిషన్స్‌లో సహాయం చేస్తారు. ప్రాఫిట్-లాస్ రిపోర్టులు, మార్కెటింగ్ స్ట్రాటజీలు, కస్టమర్ కమ్యూనికేషన్ నేర్పిస్తారు. రియల్ బిజినెస్ సవాళ్లకు సిద్ధం చేస్తారు.

విద్యార్థుల పర్‌ఫామెన్స్ గురించి క్లెయిమ్స్

Advertisement

స్కూల్ ఫౌండర్ మాకెంజీ ప్రైస్ ప్రకారం విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకులు సాధిస్తున్నారు. ఈ విద్యార్థుల్లో చాలా మంది అమెరికాలో టాప్ 1-2 శాతంలో ఉన్నారు. 90 శాతం మంది విద్యార్థులు ప్రతిరోజూ స్కూలుకు వెళ్లడానికి ఇష్టపడతారు. AI ఆధారిత విద్యా విధానంపై ఆల్ఫ స్కూల్‌ యజమాన్యం పూర్తి నమ్మకం వ్యక్తం చేసింది.

ఫీజు, లొకేషన్

ఆల్ఫా స్కూల్ అమెరికాలో 20కి పైగా లెర్నింగ్ సెంటర్లు కలిగి ఉంది. అయితే ఈ హైస్కూల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో మాత్రమే ఉంది. వార్షిక ట్యూషన్ ఫీజు సుమారు 40,000 డాలర్లు (భారత కరెన్సీలో రూ.37 లక్షలు). అయితే 1 మిలియన్ డాలర్లు సంపాదించకపోతే పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

బిజినెస్ కోచ్‌ల నియామకం

స్కూల్ ఈ ప్రోగ్రామ్ కోసం బిజినెస్ కోచ్‌లను నియమిస్తోంది. విద్యార్థులకు రియల్ బిజినెస్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఈ బిజినెస్ కోచ్‌లు మార్గదర్శకత్వం అందిస్తారు. ట్రెడిషనల్ లెక్చర్లు, హోంవర్క్ లాంటివి ఉండవు. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, గ్రోత్ స్ట్రాటజీలు నేర్పిస్తారు. ఈ ఉద్యోగం లభిస్తే వార్షిక వేతనం సుమారు 1.5 లక్షల డాలర్లు (రూ.1.38 కోట్లు).

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×