E-Paper
Advertisement

YS Jagan: జగన్ ఫ్లెక్సీకి మేకపోతు బలి ఇచ్చారు.. అంతలోనే సీన్ కట్ చేస్తే.. నడిరోడ్డుపై?

YS Jagan: జగన్ ఫ్లెక్సీకి మేకపోతు బలి ఇచ్చారు.. అంతలోనే సీన్ కట్ చేస్తే.. నడిరోడ్డుపై?
Advertisement

YS Jagan:  తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ వద్ద మేకపోతును బలి ఇచ్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతంపై జిల్లా పోలీసులు కఠినంగా స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు..  జంతు హింసకు పాల్పడిన ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చోడవరంలో వైసీపీ శ్రేణులు జగన్ ఫ్లెక్సీకి రక్తంతో ‘అభిషేకం’ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఒక మేకపోతును ఫ్లెక్సీ ముందే బహిరంగంగా బలి ఇచ్చారు. అంతటితో ఆగకుండా..  ఆ మేకపోతు రక్తంతో ఫ్లెక్సీని తడిపారు. ఈ క్రమంలో “రప్పారప్పా” అంటూ రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ  ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో స్థానికంగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Advertisement

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బహిరంగంగా జంతు బలులు ఇవ్వడం, సమాజంలో భయోత్పాతం కలిగించేలా ప్రవర్తించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి ఏడుగురు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అని చాటిచెప్పేలా, అరెస్ట్ చేసిన వారిని పోలీసులు రోడ్డుపై నడిపిస్తూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ పరమైన అతి ఉత్సాహంతో మూగజీవాలను బలి ఇవ్వడం, ఆ రక్తంతో అభిషేకాలు చేయడం వంటి అనాగరిక చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

ALSO READ: Pemmmasani Chandrasekhar: ఇప్పుడు ఎందుకు వచ్చారు..? మంత్రి పెమ్మసానిని పట్టుకుని నిలదీస్తూ..!

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×