E-Paper
Advertisement

Chicken Vs Mutton: చికెన్ ప్రియులా లేదా మటన్ ప్రేమికులా? ఈ పోషక విలువల గురించి మీకు తెలుసా ?

Chicken Vs Mutton: చికెన్ ప్రియులా లేదా మటన్ ప్రేమికులా? ఈ పోషక విలువల గురించి మీకు తెలుసా ?
Advertisement

Chicken Vs Mutton: చికెన్, మటన్ మధ్య ఏది ఆరోగ్యకరమైనది అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ రెండిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా వీటి పోషక విలువలు, కొవ్వు శాతం, ఆరోగ్య ప్రయోజనాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. సైన్స్ , పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం వీటి మధ్య పోషకాల తేడాలి. ఏది తింటే ఆరోగ్యానికి మంచిదనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. ప్రోటీన్ కంటెంట్ :

ప్రోటీన్ విషయంలో చికెన్ , మటన్ రెండూ సమానంగానే ఉంటాయి. అయితే,.. చికెన్ బ్రెస్ట్ భాగంలో కేలరీలు తక్కువగా ఉండి, ప్రోటీన్ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. వంద గ్రాముల చికెన్‌లో సుమారు 27-31 గ్రాముల ప్రోటీన్ ఉంటే, అదే మొత్తంలో మటన్‌లో 25-28 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Advertisement

2. కొవ్వు, కేలరీలు:

చికెన్ “లీన్ మీట్” వర్గానికి చెందుతుంది. ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువ. ముఖ్యంగా స్కిన్ తీసేసిన చికెన్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.మటన్ “రెడ్ మీట్” వర్గానికి చెందుతుంది. చికెన్‌తో పోలిస్తే మటన్‌లో సంతృప్త కొవ్వులు, కేలరీలు ఎక్కువ. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది.

3. సూక్ష్మ పోషకాలు:

పోషకాల విషయానికి వస్తే మటన్‌ది పైచేయి అని చెప్పవచ్చు. మటన్.. ఇందులో ఐరన్ , జింక్ , విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి మటన్ చాలా మేలు చేస్తుంది. ఇందులోని ఐరన్ శరీరం సులభంగా గ్రహించేలా ఉంటుంది. చికెన్‌లో విటమిన్ బి6, నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శక్తి ఉత్పత్తికి తోడ్పడతాయి.

Also Read: చలికాలంలో ఈ కూరగాయలు తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?

ఆరోగ్య ప్రయోజనాలు:

చికెన్ సులభంగా జీర్ణమవుతుంది. కానీ మటన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీరు బలహీనంగా ఉండి, ఐరన్ లోపంతో బాధపడుతుంటే. వారానికి ఒకసారి మటన్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వయస్సు పైబడిన వారు.. 40 ఏళ్లు పైబడిన వారు రెడ్ మీట్ (మటన్) తగ్గించి, చికెన్ లేదా చేపలు తీసుకోవడం ఆరోగ్యకరం.

మొత్తం మీద.. రెగ్యులర్ డైట్ కోసం చికెన్ సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఎంపిక. అయితే.. మటన్‌ను నెలకు రెండు లేదా మూడు సార్లు మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు అందుతాయి. ఏ మాంసమైనా వండే పద్ధతిని బట్టి (తక్కువ నూనె, మసాలాలతో) దాని గుణాలు మారుతాయని గుర్తుంచుకోవాలి.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×