Rent A Human Job| కంప్యూటర్లు, టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో మనుషుల ఉద్యోగాలు మెషీన్లు చేస్తున్నాయని.. ఈ ఆటోమేషన్ వల్ల మనుషులకు ఉద్యోగాలు లభించడం లేదని నిపుణలు అభిప్రాయపడేవారు. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్లాట్‌ఫాం ఈ భావనను మారుస్తోంది. RentAHuman.ai అనే ప్లాట్‌ఫాం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మనుషులకు పని ఇస్తోంది. AI ఏజెంట్లు నిజమైన ప్రపంచంలో మనుషులు మాత్రమే చేయగలిగే పనుల కోసం పేమెంట్ చేస్తోంది. డిజిటల్ సిస్టమ్స్ తాము చేయలేని మానవ ఆధారిత పనులు మాత్రమే ఆఫర్ చేస్తారు.
RentAHuman.ai సాధారణ ఫ్రీలాన్స్ లేదా గిగ్ ప్లాట్‌ఫాం కాదు. ఇది పూర్తిగా AI ఏజెంట్ల కోసం రూపొందించిన ప్లాట్‌ఫాం. AI వర్క్‌ఫ్లోలతో డైరెక్ట్‌గా ఇంటిగ్రేట్ అవుతుంది. AI ఏజెంట్‌కు ఫిజికల్ సపోర్ట్ అవసరమైతే ఈ మార్కెట్‌ప్లేస్ ద్వారా మనిషిని హైర్ చేస్తుంది. ఆబ్జెక్ట్ హ్యాండ్లింగ్, రియల్ ఈవెంట్‌లలో పాల్గొనడం వంటి పనులు చేయిస్తుంది.
మనుషులు ప్లాట్‌ఫాంలో ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. తమ లొకేషన్, స్కిల్స్, అందుబాటు సమయం, ఛార్జీలు షేర్ చేస్తారు. AI ఏజెంట్లు టాస్క్ అవసరాల ఆధారంగా ప్రొఫైల్స్ సెర్చ్ చేస్తాయి. సిస్టమ్ బెస్ట్ మ్యాచ్‌ను సెలెక్ట్ చేస్తుంది. AI స్పష్టమైన ఇన్‌స్ట్రక్షన్స్, టైమ్‌లైన్స్ ఇస్తుంది. టాస్క్ ఎస్టిమేటెడ్ టైమ్, ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ కూడా చెబుతుంది.
పని చేయకముందే పేమెంట్ కండీషన్ ఫిక్స్ అవుతుంది. టాస్క్ పూర్తయ్యాక డబ్బు డైరెక్ట్‌గా హ్యూమన్ వాలెట్‌కు వస్తుంది. చాలా వరకు క్రిప్టో లేదా స్టేబుల్‌కాయిన్ ద్వారా పేమెంట్ జరుగుతుంది. ఈ పద్ధతి వేగంగా, పారదర్శకంగా ఉంటుంది. మనుషులకు ఆలస్యం చేయకుండా వెంటనే పేమెంట్ వచ్చేస్తుంది.
ప్లాట్‌ఫాంలో అనేక రియల్ వరల్డ్ టాస్క్‌లు ఉన్నాయి. ఇన్-పర్సన్ మీటింగ్‌లకు హాజరు కావడం, ప్యాకేజీ పికప్ మరియు డెలివరీ, ఫిజికల్ వెరిఫికేషన్ జాబ్స్, ఈవెంట్ అటెండెన్స్, హార్డ్‌వేర్ టెస్టింగ్, రియల్ ఎస్టేట్ విజిట్స్, చిన్న ఎర్రండ్స్, ఫోటోగ్రఫీ – డాక్యుమెంటేషన్ వంటివి ఉన్నాయి.
ఈ ప్లాట్‌ఫాం మాడల్ కంటెక్స్ట్ ప్రొటోకాల్ (Model Context Protocol) సర్వర్లతో పనిచేస్తుంది. పాపులర్ AI ఏజెంట్ ఫ్రేమ్‌వర్క్‌లతో కనెక్ట్ అవుతుంది. డెవలపర్లు REST API ద్వారా సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు. టెస్టింగ్ కోసం మాక్ మోడ్ కూడా ఉంది. రియల్ పేమెంట్స్ లేకుండా టాస్క్‌లు టెస్ట్ చేయవచ్చు.
Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో
లాంచ్ అయిన 48 గంటల్లోనే వేలాది మంది సైన్ అప్ చేశారు. డెవలపర్ హై ట్రాఫిక్ గురించి నిర్ధారించారు. వివిధ ప్రొఫెషన్లకు చెందిన వారు, స్టూడెంట్స్, సైడ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నవారు ఇందులో జాయిన్ అయ్యారు. AI స్టార్టప్ టీమ్స్ కూడా ఈ విధానాన్ని అన్వేషిస్తున్నారు.
మనుషులకు ఉద్యోగాలిచ్చే ఈ ఏఐ మోడల్ కొత్త ఆదాయ అవకాశాలు సృష్టిస్తోంది. మరోవైపు AIకి రియల్ వరల్డ్ లిమిటేషన్స్ దాటే సామర్థ్యం ఇస్తోంది. మనుషులకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఆప్షన్స్ వస్తున్నాయి. AI సిస్టమ్స్ ఫిజికల్ ఎగ్జిక్యూషన్ సామర్థ్యం పొందుతున్నాయి. ఈ విధానం ఇరు వర్గాలకు లాభదాయకం. దీన్ని భవిష్యత్ వర్క్ స్ట్రక్చర్‌ను మార్చే కొత్త డిజిటల్ ఎకానమీ మోడల్‌గా పేర్కొనవచ్చు.