AI trading Profit| ఏఐ టెక్నాలజీ రోజు రోజుకీ ఎంతో అడ్వాన్స్ అవుతోంది. మనుషుల ఊహకందని పనులు స్వతహాగా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఒక AI ట్రేడింగ్ బాట్ గురించి ఆశ్చర్యకరమైన కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ట్రేడర్ X ప్లాట్‌ఫాం (ట్విట్టర్)లో ఒక ఆసక్తికర పోస్ట్ చేశాడు. అతను ఒకే రాత్రిలో రూ.11 లక్షల పెట్టుబడిని రూ.40 లక్షలుగా మార్చానని చెప్పాడు. ఆ పోస్ట్ చూసి చాలా మంది షాకింగ్ రియాక్షన్లు ఇచ్చారు. కొందరు అతను చెప్పింది నిజమేనా అని అనుమానం వ్యక్తం చేశారు.
ట్రేడర్ చెప్పినట్లు రాత్రి 3:47కి AI సిస్టమ్ అలర్ట్ ఇచ్చింది. $12,000 (భారత కరెన్సీలో రూ.10 లక్షలు) పెట్టుబడి పెట్టమని సూచించింది. ట్రేడర్ ఆమోదించి నిద్రపోయాడు. AI ఏజెంట్ “OpenCaw” ఆటోమేటిక్‌గా ట్రేడ్స్ చేసింది. ఉదయం అతను నిద్రలేచి చూసేసరికి ఆ మొత్తం కాస్త $43,800 (రూ.40 లక్షలు)కు పెరిగింది. ఈ ఏఐ ట్రేడింగ్ కథ ఫాస్ట్‌గా వైరల్ అయింది.
ఈ ట్రేడ్ ప్రెడిక్షన్ మార్కెట్లలో జరిగింది. Polymarket వంటి ప్లాట్‌ఫామ్‌లలో భవిష్యత్ ఈవెంట్స్ మీద బెట్టింగ్ చేస్తారు. ధరలు లేదా రియల్-వరల్డ్ ఫలితాలపై అంచనాలు వేస్తారు. గ్లోబల్ డేటా సోర్సెస్ నుంచి AI సిస్టమ్ సమాచారం సేకరిస్తుంది. మార్కెట్ ధరలు ఇంకా అప్‌డేట్ కాకముందే ఏఐ సరైన అవకాశాలను గుర్తిస్తుంది. అంటే మార్కెట్ ఆలస్యం కారణంగా ఏఐ త్వరగా లాభం వచ్చే స్టాక్స్ ముందే బుక్ చేస్తుంది.
గవర్నమెంట్ ఫీడ్స్, ఫైనాన్షియల్ న్యూస్, లైవ్ స్ట్రీమ్స్, ఫ్లైట్ డేటా, సెంట్రల్ బ్యాంక్ అనౌన్స్‌మెంట్స్ నుంచి AI సమాచారం తీసుకుంది. ఈ డేటాను మనుషుల కంటే వేగంగా అనలైజ్ చేసి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకుంది.
ఈ స్ట్రాటజీని టైమ్-జోన్ ఆర్బిట్రేజ్ అంటారు. ప్రపంచంలోని వివిధ రీజియన్లలో మార్కెట్ రియాక్షన్లు ఆలస్యంగా వస్తాయి. ఈవెంట్ ఒక చోట జరిగినా అన్ని మార్కెట్లు ఒకేసారి ధరలు మార్చవు. AI ముందుగా అర్థం చేసుకుని ట్రేడ్ చేసి, ధరలు అప్డేట్ కాకముందే లాభం తీసుకుంటుంది.
ఇప్పుడు 5 నిమిషాలు లేదా 15 నిమిషాలలో ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అని అంచనాలు వేసే మార్కెట్లు పెరిగాయి. ఈ ఫాస్ట్ మార్కెట్లలో ధరల మధ్య చిన్న చిన్న గ్యాప్స్ తరచూ వస్తాయి. AI బాట్లు ఈ గ్యాప్స్‌ను ఉపయోగించి వందలాది ట్రేడ్స్ చేస్తాయి. చిన్న చిన్న లాభాలు కలిసి పెద్ద మొత్తంగా మారతాయి.
AI ట్రేడింగ్ బాట్లు ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్. న్యూస్, సోషల్ మీడియా, ఫైనాన్షియల్ అప్‌డేట్స్ నుంచి డేటా రియల్-టైమ్‌లో అనలైజ్ చేస్తాయి. మార్కెట్ ధరలు రియల్ ఈవెంట్స్‌తో పోల్చి అవకాశాలను గుర్తిస్తాయి. మనుషుల జోక్యం చేసుకోకుండానే ట్రేడ్స్ చేస్తాయి.
ఈ కథ గురించి మార్కెట్ నిపుణులు, ట్రేడర్ల మధ్య చర్చ మొదలైంది. కొందరు AI ట్రేడింగ్ పవర్‌ఫుల్ అని భావిస్తున్నారు. మరికొందరు ఇలాంటి పోస్ట్ చేసే వారు ఆధారాలు చూపాలని, ఆధారాలు లేకుంటే మోసపూరిత పోస్ట్ కావచ్చని యూజర్లను హెచ్చరిస్తున్నారు.
AI ట్రేడింగ్ బాట్లు మానవుల కంటే వేగంగా డేటా అనలైజ్ చేసి చిన్న మార్కెట్ అవకాశాలను ఉపయోగించగలవు. కానీ ప్రతి సక్సెస్ స్టోరీ నిజమైనది కాదు. ఆటోమేటిక్ ట్రేడింగ్ సిస్టమ్స్‌పై ఆధారపడే ముందు అందులో ఉండే రిస్క్‌లను బాగా అర్థం చేసుకోవాలి.