E-Paper
Advertisement

AC Repair Tips: ఏసీ నుంచి వచ్చే ఈ 5 శబ్దాలను నిర్లక్ష్యం చేస్తే.. కంప్రెషర్ పేలిపోతుంది జాగ్రత్త!

AC Repair Tips: ఏసీ నుంచి వచ్చే ఈ 5 శబ్దాలను నిర్లక్ష్యం చేస్తే.. కంప్రెషర్ పేలిపోతుంది జాగ్రత్త!
Advertisement

AC Repair Tips: సాధారణంగా సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే చాలు.. నిత్యం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రన్ అవుతూ ఉండాల్సిందే. అయితే కొన్నిసార్లు ఏసీ నుంచి సౌండ్స్ వస్తుంటాయి. ఆ సమయంలో లక్షల రూపాయలు పెట్టిన ఏసీ అప్పుడే పాడైపోయిందా అని చాలామంది తెగ కంగారు పడిపోతుంటారు. కానీ అలా శబ్దం వచ్చిందంటే.. ఏసీ పూర్తిగా పాడైపోయినట్టు కాదు. లోపల ఏదో భాగం త్వరలో పని చేయకుండా ఆగిపోతుందని చెప్పడానికి సంకేతాలు అన్నమాట. ఈ సౌండ్స్‌ని సకాలంలో గుర్తించి రిపేర్ చేయించకపోతే, అది పెద్ద ఖర్చుకు దారితీయవచ్చు.

ఒక్కో సౌండ్‌కి ఒక్కో కారణం:

ఏసీ నుంచి వచ్చే ఒక్కో శబ్దానికి ఒక్కో కారణం ఉంటుంది. గట్టిగా తట్టినట్టు శబ్దం వస్తుంటే కంప్రెషర్ లోపల ఏదైనా భాగం విరిగిపోయిందని అర్థం. అలాగే ఇనుము రాసుకుంటున్నట్టు శబ్దం వస్తే మోటార్ బేరింగ్స్ అరిగిపోయాయని గుర్తించాలి. ఇలాంటి సమయాల్లో ఏసీని వెంటనే ఆపేయడం ఉత్తమం.

Advertisement

Also Read: అది ఫేక్ స్టవా? ఇలాంటి స్టవ్ అసలు లేనే లేదా? మరి ఇంటర్నెట్‌లో చూపించేది?

సర్వీస్ చేయించాల్సిందే:

అవుట్‌డోర్ యూనిట్ నుంచి ఏదో వస్తువు కొట్టుకుంటున్నట్టు సౌండ్ వస్తుంటే, లోపల ఫ్యాన్ బ్లేడ్ విరిగి ఉండవచ్చు లేదా ఏదైనా కనెక్షన్ ఊడిపోయిండొచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఏసీని అలాగే వాడితే కంప్రెషర్ పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంది. వెంటనే టెక్నీషియన్‌ను పిలిపించి చెక్ చేయించడం ఉత్తమం.

శుభ్రం చేయకపోతే:

Advertisement

కొన్నిసార్లు ఏసీ ఆన్ చేసినప్పుడు రయ్యిమంటూ శబ్దం వచ్చినా యూనిట్ స్టార్ట్ అవ్వదు. ఇది సాధారణంగా ఎలక్ట్రికల్ ఫాల్ట్ వల్ల లేదా వైర్లు వదులవ్వడం వల్ల జరుగుతుంది. అలాగే, ఏసీ లోపల చిన్న చిన్న పురుగులు లేదా చెత్త చేరినప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు వస్తుంటాయి. ఇక డబ్బా కదులుతున్నట్టు వచ్చే గడగడ శబ్దాలు లోపల స్క్రూలు లూజ్ అవ్వడం వల్ల గానీ, బయటి గాలి ద్వారా వచ్చిన ఎండుటాకులు ఫ్యాన్‌లో ఇరుక్కోవడం వల్ల గానీ సంభవిస్తాయి.

త్వరలో పేలిపోద్దని అర్థం:

ఏసీ నుంచి ఈల వేసినట్టు శబ్దం వస్తుంటే, దానికి ప్రధాన కారణం ఎయిర్ ఫిల్టర్లు మురికిగా ఉండటమే. గాలి సరిగ్గా వెళ్లలేక సన్నని సందుల నుంచి ఫోర్స్‌గా బయటకు వచ్చినప్పుడు ఈ శబ్దం వస్తుంది. ఇక అత్యంత ప్రమాదకరమైనది బుసలు కొట్టినట్టు వచ్చే శబ్దం. ఇది రిఫ్రిజిరెంట్ గ్యాస్ లీక్ అవుతుందని చెప్పడానికి స్పష్టమైన సంకేతం. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉండటం కూడా సురక్షితం కాదు.

ఆలస్యం చేస్తే.. జేబుకు చిల్లే:

అందుకే.. ఏసీ నుంచి ఎలాంటి శబ్దం వచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. సొంత ప్రయోగాలు అస్సలే చేయకుండా నిపుణులైన మెకానిక్‌ను సంప్రదించి రిపేర్ చేయించుకోవడం మంచిది. దీనివల్ల ఏసీ లైఫ్ పెరగడమే కాకుండా, విద్యుత్ బిల్లు కూడా అదుపులో ఉంటుంది.

Also Read: బెస్ట్ ఇండక్షన్ అంటే ఏయే ఫీచర్లు ఉండాలి? ఎలాంటి పాత్రలు వాడాలి? పూర్తి వివరాలివే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×