E-Paper
Advertisement

Air Cooler Launch Feb 2026: సమ్మర్ స్పెషల్.. కొత్తగా రిలీజైన టాప్ కంపెనీల కూలర్స్.. ఏసీలు కూడా తలవంచాల్సిందే!

Air Cooler Launch Feb 2026: సమ్మర్ స్పెషల్.. కొత్తగా రిలీజైన టాప్ కంపెనీల కూలర్స్.. ఏసీలు కూడా తలవంచాల్సిందే!
Advertisement

Air Cooler Launch Feb 2026: తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు చలితో అల్లాడిన ప్రజలు.. ఇప్పుడు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఏసీల వైపు దృష్టి సారిస్తుంటే.. మరికొందరు కూలర్లను ఆశ్రయిస్తున్నారు. మార్కెట్ లో ఆధునాతన ఫీచర్లు కలిగిన ఎయిర్ కూలర్స్ ఏమున్నాయా? అని సెర్చ్ చేస్తున్నారు. అటువంటి వారి కోసం కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన పలు టాప్ కంపెనీలకు చెందిన కూలర్స్ ను ఇక్కడ అందించడం జరుగుతోంది. వాటి ధరలు, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Crompton Ozone 55 Litres

క్రాంప్టన్ కంపెనీకి చెందిన ఈ 55 లీటర్ల ఎయిర్ కూలర్.. వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులోని కూలింగ్ ప్యాడ్స్.. బెటర్ కూలింగ్ ను అందిస్తాయి. దాదాపు 490 చదరపు అడుగుల వరకూ ఉన్న గదిని ఈ కూల్ చేయగలదు. నాలుగు దిశల్లో గాలి ప్రసారం అయ్యేలా సర్దుబాటు చేసుకునేందుకు వీలుంది. అమెజాన్ రూ. 9,599కు ఈ కూలర్ సేల్ అవుతోంది.

MoonAir 200 Litre Cooler

Advertisement

200 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కూలర్ పెద్ద గదులు ఉన్న ఇళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇందులోని కూలింగ్ ప్యాడ్స్ నీళ్లను ఎక్కువ సేపు రిటైన్ చేసి.. లాంగ్ – లాస్టింగ్ కూలింగ్ అందిస్తాయి. 180 అడుగుల దూరం వరకూ ఈ కూలర్ నుంచి వచ్చే గాలి చేరగలదు. ఇందులోని ఎయిర్ డెలివరీ ఫ్యాన్స్.. నాలుగు దిశల్లో సమానంగా గాలిని పంపిస్తుంది. తక్కువ శబ్దాన్ని కలిగి ఉండటం ఈ కూలర్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. మార్కెట్ లో ఈ కూలర్ ధర రూ.17,500గా ఉంది.

Bajaj Shield Series Arteon 55L

బజాజ్ కంపెనీకి చెందిన ఈ ఎయిర్ కూలర్ కూడా వినియోగదారులను ఆకట్టుకుంటోది. ఈ కూలర్ ఐస్ ఛాంబర్ ను కలిగి ఉంది. 60 అడుగుల దూరం వరకూ గాలిని ప్రసారం చేయగలదు. యాంటి బ్యాక్టీరియల్ హెక్సాకూల్ మాస్టర్, పవర్ ఫుల్ ఎయిర్ థ్రో వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది. ఈ కూలర్ అమెజాన్ లో రూ.10,299కి అందుబాటులో ఉంది

Advertisement

Also Read: GoBoult Smartwatches: గోబౌల్ట్ ముస్తాంగ్ సిరీస్‌లో.. స్టాలియన్, రేసర్, మసిల్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర, ఫీచర్లు ఇవే!

HAVAI Thunder 17+ Desert Cooler

కూలర్ నుంచి పవర్ ఫుల్ చల్లని గాలిని కోరుకునేవారు దీనిని పరిశీలించవచ్చు. ఇది 100 లీటర్ల నీటి ట్యాంక్ ను కలిగి ఉంది. అల్యూమినియంతో రూపొందిన ఫ్యాన్ బ్లేడ్స్, ఆటో ఆఫ్, తేలికగా షిఫ్టింగ్ చేసేందుకు అడుగు భాగంలో వీల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో రూ.9,290 ఈ కూలర్ సేల్ అవుతోంది.

Also Read: AP Telangana Water Dispute: కేంద్ర జలశక్తి మంత్రితో చంద్రబాబు భేటి.. టెన్షన్‌లో తెలంగాణ నేతలు!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×