E-Paper
Advertisement

ఎయిర్ ఫ్రైయర్ క్లీనింగ్‌లో.. ఈ తప్పులు చేస్తున్నారా? అయితే కొంపకొల్లేరే!

ఎయిర్ ఫ్రైయర్ క్లీనింగ్‌లో.. ఈ తప్పులు చేస్తున్నారా? అయితే కొంపకొల్లేరే!
Advertisement

Air Fryer Cleaning Mistakes: వంటగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన కుకింగ్ పరికరాల్లో ఒకటిగా ఎయిర్ ఫ్రైయర్లు మారిపోయాయి. తక్కువ నూనెను ఉపయోగించి.. రుచికరమైన డీప్ ఫ్రైయింగ్ వంటకాలు చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ ఎయిర్ ఫ్రైయర్.. ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే క్లీనింగ్ తప్పనిసరి. తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. ఎయిర్ ఫ్రైయర్ శుభ్రం చేసేటప్పుడు జరిగే సాధారణ తప్పులు ఏవి? వాటిని ఏ విధంగా నివారించాలో ఈ కథనంలో పరిశీలిద్దాం.

స్టీల్ స్క్రబ్బర్లను వాడటం

ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్‌కు అంటుకున్న జిడ్డును వదిలించడానికి చాలా మంది స్టీల్ స్క్రబ్బర్లు లేదా గరుకుగా ఉండే పీచును వాడుతుంటారు. దీనివల్ల బాస్కెట్ పైన ఉండే నాన్ స్టిక్ కోటింగ్ దెబ్బతింటుంది. ఫలితంగా అది ఆహారంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ క్లీనింగ్ కు మెత్తని స్క్రబ్ వాడటం చాలా ముఖ్యం.

క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం

Advertisement

వంట చేసినా ప్రతీసారి ఎయిర్ ఫ్రైయర్ ను తప్పనిసరిగా క్లీన్ చేయాలి. ఈసారి తక్కువగానే వండాం కదా.. తర్వాత చూడొచ్చులే అని నిర్లక్ష్యం చేస్తే ఇది అనారోగ్యానికి దారితీయవచ్చు. ఎయిర్ ఫ్రైయర్ లోని నూనె, మిగిలిపోయిన ఆహార కణాల్లోకి బ్యాక్టీరియా చేరి.. తర్వాత వండే ఆహారంలో అవి కలిసిపోయే ప్రమాదముంది.

మెయిన్ నీటిలో ముంచడం

ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్, ట్రేలను విడివిడిగా కడిగే బదులు నేరుగా మిషన్ నే వాటర్ ట్యాప్ కింద పెడితే బాగుంటుంది కదా అని చాలా భావిస్తారు. ఇలా చేస్తే చాలా పెద్ద పొరపాటే అవుతుంది. మెయిన్ మిషన్ (Main Unit) ను ఎప్పుడూ నీటిలో ముంచకూడదు. అలా చేస్తే అందులోని ముఖ్యమైన ఎలక్ట్రికల్ భాగాలు దెబ్బతింటాయి. లోపలి ఉండిపోయిన తేమ వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మిషన్ పై భాగాన్ని తడి బట్టతో తుడిస్తే సరిపోతుంది.

వేడిగా ఉన్నప్పుడే కడగడం

Advertisement

కొందరు వంట పూర్తి అయిన వెంటనే ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ ను కడిగేందుకు రెడీ అయిపోతారు. అలా అస్సలు చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా వచ్చే మార్పు (Thermal Shock) వల్ల బాస్కెట్ వంగిపోవడం, కోటింగ్ పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి బాస్కెట్ పూర్తిగా చల్లబడే వరకూ ఆగి.. ఆ తర్వాత నీటితో కడిగే ప్రయత్నం చేయాలి.

Also Read: ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్.. డిటాచబుల్ స్పీకర్లతో వచ్చిన.. పవర్‌ఫుల్ ప్రొజెక్టర్!

క్లీనింగ్ కెమికల్స్ వాడటం

కొందరు మరింత శుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గాఢమైన కెమికల్స్ తో నిండిన లిక్విడ్స్ ను క్లీనింగ్ కోసం వాడతారు. ఇది సరైన పద్దతి కాదు. అలా చేస్తే ఎయిర్ ఫ్రైయర్ లోపలి భాగాలు దెబ్బతింటాయి. సాధారణ డిష్ వాష్ సోప్, గోరువెచ్చని నీరు ఎయిర్ ఫ్రైయర్ క్లీనింగ్ కు సరిపోతాయి. మొండి జిడ్డు ఉంటే బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమాన్ని వాడవచ్చు.

ముఖ్యగమనిక: నిపుణులు అందించిన సూచనలను ఈ కథనంలో యాథావిధిగా అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇందులోని కంటెంట్ కు బిగ్ టీవీకి సంబంధం లేదు.

Also Read: అయ్యబాబోయ్.. ఏసీ, టీవీ, మెుబైల్స్‌పై భారీ తగ్గింపు.. 60% తక్కువకే పట్టుకెళ్లొచ్చు..!

Related News

స్టైలిష్ సిల్వర్ స్ట్రాప్‌తో అద్భుతమైన గాడ్జెట్.. ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్ వాచ్ రివ్యూ!

యూత్ మైండ్ బ్లాక్ చేసే ఫీచర్లతో.. బోట్ స్మార్ట్ వాచ్, ధర ఎంతంటే ?

కొత్త టీవీని గోడకు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలు ముందే తెలుసుకోండి!

రూ. 27వేలకే ఏఐ వాషింగ్ మెషీన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు!

కేబుల్ కదిలిస్తేనే ఛార్జింగ్ ఎక్కుతుందా? మీ ఫోన్‌లో అసలు సమస్య ఇదే కావచ్చు!

ఈ MSI గేమింగ్ ల్యాప్‌టాప్‌లో అన్నీ అదుర్స్.. ఒక్క ధర విషయంలోనే పెద్ద ట్విస్ట్!

అమెజాన్‌లో హాట్ కేకులా.. అమ్ముడవుతున్న ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్‌లు!

శాంసంగ్ గెలాక్సీ ఫోన్ కొనే ఆలోచన ఉందా? 2026లో టాప్ 5G ఫోన్ల లిస్ట్ ఇదే!

Big Stories

Advertisement
×