E-Paper
Advertisement

నా రాజకీయ ఎదుగుదలకు ఆయనే పునాది.. నరేందర్ రెడ్డి మృతిపై ఎమ్మెల్యే కడియం ఆవేదన

నా రాజకీయ ఎదుగుదలకు ఆయనే పునాది.. నరేందర్ రెడ్డి మృతిపై ఎమ్మెల్యే కడియం ఆవేదన
Advertisement

Narender Reddy: స్వేచ్ఛ బ్యూరో: 40 ఏళ్లు తోడుగా నా రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన వ్యక్తి నరేందర్ రెడ్డి ఇక లేడని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవేదన చెందారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతకుంట్ల నరేందర్ రెడ్డి సంతాప సభ శుక్రవారం ‘ఎస్ కన్వెన్షన్’ లో జరిగింది. ఈ సందర్బంగా నరేందర్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నరేందర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..

Advertisement

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతకుంట్ల నరేందర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డారు. 1987లో లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాలలోకి అప్పుడు వచ్చిన మొదటగా నాకు అండగా నిలిచిన వ్యక్తి చింతకుంట్ల సురేందర్ రెడ్డి అన్నారు. దాదాపు 40 ఏళ్లుగా నాకు తోడుగా, అండగా చింతకుంట్ల కుటుంబం నిలిచిందని తెలిపారు. నా రాజకీయ ఎదుగుదలకు నరేందర్ రెడ్డి అహర్నిశలు కృషి చేశారని అయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి కోసం అనుక్షణం తాపత్రయపడ్డారని 100 పడకల ఆసుపత్రి రావాలని పట్టుబాట్టారని అంటే దానికి నరేందర్ రెడ్డి కారణం అన్నారు.

నరేందర్ రెడ్డి కుటుంబానికి అండగా ఎమ్మెల్యే

Advertisement

ఇంటిగ్రెటెడ్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, డిగ్రీ కళాశాల తేవాలని అడిగారని అన్నారు. మున్సిపాలిటీ చేయాలని, అడగాలా మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆరోగ్యం సహకరించకున్నా ఎంతగానో కృషి చేశారని వెల్లడించారు. కానీ స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో నరేందర్ రెడ్డి మన మధ్య లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నరేందర్ రెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు

నరేందర్ రెడ్డి ఆశయాలాకు, ఆలోచనలకు అనుగుణంగా మనందరం కలిసి కట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, స్టేషన్ ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రాజమ్మ, కౌన్సిలర్లు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఆశలు వదిలేసిన చోట అద్భుతం.. స్టేజ్-4 క్యాన్సర్ రోగిని కాపాడిన వైద్యులు

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×