E-Paper
Advertisement

ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. ఊరిపితిత్తులు ఔట్!

ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. ఊరిపితిత్తులు ఔట్!
Advertisement

Air Purifier: నగరాల్లో కాలుష్యం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం చాలా మంది తమ ఇళ్లల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను వినియోగిస్తున్నారు. గాలిని శుభ్రపరిచే ఈ పరికరాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని ఊపిరితిత్తుల నిపుణులు (పల్మనాలజిస్ట్) సూచిస్తున్నారు. లేదంటే మీ ఊపిరితిత్తులకే ముప్పుగా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎయిర్ ప్యూరిఫైయర్ వాడేటప్పుడు చాలామంది చేసే 5 సాధారణ పొరపాట్లు వాటి వల్ల కలిగే నష్టాలేంటో ఈ కథనంలో చూద్దాం.

ఫిల్టర్లను మార్చకపోవడం

ఎయిర్ ప్యూరిఫైయర్‌లో ఉండే ఫిల్టర్లు గాల్లోని దుమ్ము – ధూళి, బ్యాక్టీరియాను పీల్చుకుంటాయి. కాబట్టి వీటిని క్లీన్ చేయడం లేదా మార్చడం తప్పనిసరి. అయితే చాలా మంది ఈ విషయంలో అశ్రద్ద చేస్తుంటారు. దీనివల్ల ఫిల్టర్ పూర్తిగా డస్ట్ తో నిండిపోయి గాలిని శుద్ధి చేయడం ఆపేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. పైగా ఫిల్టర్లలో పేరుకుపోయిన దుమ్ము, బూజు (mold) తిరిగి గాల్లోకి విడుదలవుతాయని హెచ్చరిస్తున్నారు. అవి ఊపిరితిత్తుల్లోకి చేరి ఆస్తమా, అలర్జీలను తీవ్రతరం చేస్తాయని పేర్కొంటున్నారు.

తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం

Advertisement

ఎయిర్ ప్యూరిఫైయర్ ఆన్ చేసి ఉన్నప్పుడు గది తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. బయట ఉన్న కాలుష్యకారక గాలి నిరంతరం గదిలోకి వస్తూనే ఉంటుంది. దీనివల్ల ప్యూరిఫైయర్‌పై అదనపు భారం పడి అది త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది. దీనికి తోడు రూమ్ సరిగ్గా క్లీన్ అవ్వదు. కాబట్టి ప్యూరిఫైయర్ ఆన్ చేసినప్పుడు గదిని వీలైనంత వరకు మూసి ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గది సైజ్ కు తగ్గట్లుగా..

గది సైజ్ కు తగ్గట్లు ప్యూరిఫైయర్ ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద హాల్‌లో చిన్న ప్యూరిఫైయర్ పెడితే గాలి మొత్తం శుద్ధి కాదని చెబుతున్నారు. దీనివల్ల గాలి శుభ్రంగా ఉందనే భ్రమలో కలుషిత గాలినే పీలుస్తూ ఉంటారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి గది సైజును బట్టి సరైన సామర్థ్యం ఉన్న పరికరాన్ని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. .

సరైన పొజిషన్ ముఖ్యం

Advertisement

చాలామంది ఎయిర్ ప్యూరిఫైయర్‌ను గది మూలల్లోనో, మంచం వెనుకో లేదా అల్మారాల పక్కనో పెడుతుంటారు. దీనివల్ల గాలి సరిగ్గా లోపలికి, బయటకు రాదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్యూరిఫైయర్ చుట్టూ కనీసం రెండు అడుగుల ఖాళీ స్థలం ఉండాలని సూచిస్తున్నారు. అప్పుడే అది గదిలోని గాలిని నలుమూలల నుండి పీల్చుకుని సరిగ్గా శుద్ధి చేయగలుగుతుందని పేర్కొంటున్నారు.

Also Read: Aero O2 Fan: సాధారణ ఫ్యాన్ కాదు బాబోయ్.. దీని ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

ఓజోన్ జనరేటర్లను వాడటం

మార్కెట్లో కొన్ని ఎయిర్ ప్యూరిఫైయర్లు కంపెనీలు.. తమ ప్రొడక్ట్ ‘ఓజోన్’ (Ozone) విడుదల చేయడం ద్వారా గాలిని శుద్ధి చేస్తాయని చెప్తుంటాయి. కానీ ఓజోన్ గ్యాస్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తే శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది దగ్గు, గొంతు నొప్పి, ఛాతిలో మంట వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. అందుకే ‘True HEPA’ ఫిల్టర్లు ఉన్న ప్యూరిఫైయర్లను మాత్రమే ఎంచుకోవాలని.. ఓజోన్ ఆధారిత వాటికి దూరంగా ఉండాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read:ఈఎంఐలో ఫ్రిడ్జ్ కొంటున్నారా? ఈ స్మార్ట్ చిట్కాలు పాటిస్తే.. బోలెడంత డబ్బు ఆదా!

Related News

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, లైవ్ టీవీ ఫ్రీ.. ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్‌తో ఇన్ని లాభాలా ?

రూ.55 వేలలో అత్యుత్తమ టీవీలు.. ఫీచర్లు చూస్తే.. అంత పెట్టినా పర్లేదంటారు!

Big Stories

Advertisement
×