E-Paper
Advertisement

వాహనదారులకు బిగ్ రిలీఫ్.. బాచుపల్లి ఫ్లైఓవర్‌ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

వాహనదారులకు బిగ్ రిలీఫ్.. బాచుపల్లి ఫ్లైఓవర్‌ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!
Advertisement

CM Revanth Reddy: హైదరాబాద్ నగరంలో వాహనాదారులకు ఇక కష్టాలు తీరాయి. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతంలోని బాచుపల్లి చౌరస్తాలో హెచ్ఎండీఎ ఆద్వర్యంలో రూ.65.53 కొట్లతో నిర్మించిన భారీ ఫ్లైఓవర్‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో నాలుగేల్లుగా పనులు సాగుతూ వస్తున్న ఈ భారీ ఫ్లైఓర్ నేడు మోదలవడంతో అక్కడి పరిసర ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాచుపల్లి క్రాస్ రోడ్స్..

హైదరాబాద్ పట్టనంలో అతి ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతం ఓకటి. ఐటీ పరిసర ప్రాంతాల్లో ఒకటైన బాచుపల్లి జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎంతో కాలంగా స్థానికులు, వాహనదారులు, ఐటీ ఉద్యోగులు ఎదురుచూస్తున్న బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ఈరోజు అధికారికంగా సీఎం ప్రారంభించారు. బాచుపల్లి క్రాస్ రోడ్స్ వద్ద ఉదచయం మరియు సాయంత్రం సమయంలో వాహనాలు గంటల తరబడి నిలిచిపోతుండేవి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వ తీసుకున్న ఈ వ్యూహత్మక ఫ్లౌఓవర్‌తో ఇక ఆ కష్టాలకు చెక్ పడినట్టైంది.

Advertisement

Also read: తిరుమలలో మళ్లీ బయటపడ్డ భద్రతా వైఫల్యం.. మొబైల్ వీడియోతో భక్తుడి హల్‌చల్!

రూ. 1674.74 కోట్ల అభివృద్ధి పనులు..

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 1674.74 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.161 కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం. రూ.530 కోట్లతో మియాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణం పనులకు శంకుస్థాపన, రూ.308 కోట్లతో శేరిలింగంపల్లి ROB నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ.65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్, రూ.229 కోట్లతో ORRకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన నిర్మాణం, ORR నుండి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.110 కోట్లతో శంకర్ పల్లి రోడ్ MGIT నుంచి మణికొండ వరకు పైప్ లైన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

Advertisement

మియాపూర్ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కలకత్తా, చెన్నై, హైదరాబాద్ ఈ ఆరు నగరాలే దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తున్నాయని అన్నారు. కాలుష్యంతో ఢిల్లీ నగరంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబై నగరంలో వర్షాలు వస్తే కార్లలో కాదు పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని సీఎం రేవంత్ అన్నారు. ట్రాఫిక్ కష్టాలతో బెంగుళూరు, చెన్నై కలకత్తా నగరాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, హైదరాబాద్ మహా నగరం వేగంగా విస్తరిస్తోందన్నారు. ఒక పద్దతి ప్రకారం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికే మహా నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాంమన్నారు.

కేంద్రాన్ని ప్రశ్నించండి..?

విస్తరిస్తున్న నగరం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూడు కార్పొరేషన్లు చేశాం. పోలీస్, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం ఉండేలా సరిహద్దులు నిర్ణయించామని, జెండాలకు ఎజెండాలకు అతీతంగా మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం అని సీఎం రేవంత్ రోడ్డి అన్నారు. పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, చేవెళ్ల, మెదక్, మల్కాజ్ గిరి ఎంపీలు బీజేపీ వాళ్ళే ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని ఎందుకు నిధులు అడగడం లేదని సీఎం ప్రశ్నించారు.

Also read: జుట్టు పీచులా మారిపోయిందా? శనగపిండి హెయిర్ మాస్క్‌తో మెరిసిపోవడం గ్యారెంటీ!

Related News

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!

సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

జూరాల రైతులకు సర్కార్ బిగ్ షాక్.. సాగునీటి విడుదలపై నీలినీడలు!

‘మీ వీపు మీరు చూసుకోండి’.. రాహుల్ గాంధీకి డీకే అరుణ ఘాటు సెటైర్లు!

ఐఎస్ఎమ్ 2.0లో తెలంగాణకు చోటేది? కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు కీలక విజ్ఞప్తి!

కాంగ్రెస్ సర్కార్‌కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!

అప్పుడు ఎందుకు నోరు విప్పలేదు?.. బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్!

Big Stories

Advertisement
×