E-Paper
Advertisement

ఈఎంఐలో ఫ్రిడ్జ్ కొంటున్నారా? ఈ స్మార్ట్ చిట్కాలు పాటిస్తే.. బోలెడంత డబ్బు ఆదా!

ఈఎంఐలో ఫ్రిడ్జ్ కొంటున్నారా? ఈ స్మార్ట్ చిట్కాలు పాటిస్తే.. బోలెడంత డబ్బు ఆదా!
Advertisement

Fridge EMI: ఇవాళ ప్రతీ ఇంట్లోనూ ఫ్రిడ్జ్ నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఫ్రిడ్జ్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే వేలకు వేలు ఖర్చు పెట్టి ఫ్రిడ్జ్ కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి సమయంలో ‘ఈఎంఐ’.. మధ్యతరగతి ప్రజలకు ఒక వరంగా మారింది. దీంతో ఖరీదైన ఫ్రిడ్జ్ లను సైతం ఎంతో అలవోకగా తీసుకుంటున్నారు. అదే సమయంలో అధిక వడ్డీల భారంతో నెలతిరిగే సరికి అధిక వడ్డీలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేబుకు చిల్లు పడకుండా.. ఈఎంఐలో ఫ్రిడ్జ్ ను తీసుకునే స్మార్ట్ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ముందుగా బడ్జెట్‌ పై క్లారిటీ

ఫ్రిడ్జ్ కొనడానికి మార్కెట్‌కు వెళ్లే ముందు సెల్ఫ్ అనాలసిస్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ముందుగా నెలవారీ ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకోవాలని హితవు పలుకుతున్నారు. అన్ని ఖర్చులు పోను ప్రతి నెల ఎంత మొత్తాన్ని సులభంగా ఈఎంఐ రూపంలో చెల్లించగలరో ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలని సూచిస్తున్నారు. ఆ ఖర్చును దాటే ఏ ప్లాన్ కూడా ఎంచుకోవద్దని హితవు పలుకుతున్నారు.

నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు

Advertisement

ప్రస్తుతం దాదాపు అన్ని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లు ‘నో-కాస్ట్ ఈఎంఐ’ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఎలాంటి వడ్డీ లేకుండా కొనే వస్తువు ధరను కొన్ని నెలలపాటు విభజించి.. కొంత మెుత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే నో-కాస్ట్ ఈఎంఐలలో కొన్నిసార్లు ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్‌టీ (GST) పడే ఛాన్స్ ఉంది. కాబట్టి కొనేముందు ఆ వివరాలను పూర్తిగా చదవండి.

డౌన్ పేమెంట్

కొన్ని ఈ కామర్స్ సంస్థలు ఎలాంటి డబ్బు చెల్లించకుండానే జీరో డౌన్ పేమెంట్ తో ఫ్రిడ్జ్ లను ఆఫర్ చేస్తుంటారు. అయితే మీ వద్ద కొంత డబ్బు ఉంటే ఆ మెుత్తాన్ని డౌన్ పేమెంట్ గా చెల్లిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మీరు తీసుకోవాల్సిన అప్పు మొత్తం తగ్గి నెలవారీ ఈఎంఐ భారం తగ్గుతుందని హితవు పలుకుతున్నారు. మరోవైపు ఈఎంఐ కాలపరిమితి మరీ ఎక్కువ పెట్టుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కాలపరిమితి ఎక్కువ పెట్టుకుంటే నెలవారీ వాయిదా తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ వడ్డీ కట్టాల్సి (వడ్డీ పడే ప్లాన్ అయితే) వస్తుంది.

బ్యాంక్ ఆఫర్ల చెకింగ్

Advertisement

బ్యాంకులు తరచూ పండుగల సీజన్లలో లేదా ప్రత్యేక రోజుల్లో క్రెడిట్/డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇస్తుంటాయి. లేదంటే అదనపు డిస్కౌంట్లు అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సమయాల్లో ఫ్రిడ్జ్ కొనే ప్లాన్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్టోర్ లేదా ఈ కామర్స్ సైటులో ఫ్రిడ్జ్ కొనేముందు కార్డు ఆఫర్లను ముందుగా చెక్ చేయాలని హితవు పలుకుతున్నారు. దీనివల్ల అసలు ధరపై మంచి తగ్గింపు లభిస్తుందని సూచిస్తున్నారు.

Also Read: సొంత బాబాయ్‌ని హతమార్చి.. ఆ నింద నాపై నెట్టారు.. సీఎం చంద్రబాబు

హిడెన్ ఛార్జీలతో జాగ్రత్త

ఈఎంఐలో వస్తువులు కొనుగోలు చేసేవారు చాలా మంది ‘జీరో డౌన్ పేమెంట్’, ‘జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్’ అనే ప్రకటనలు చూసి మోసపోతుంటారు. ఫైల్ చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ క్లోజర్ ఛార్జీలు ఇవేమి తెలుసుకోకుండానే ఈఎంఐల్లోకి దిగిపోతుంటారు. దీని వల్ల వారు అంచనా వేసుకున్న దానికంటే ఎక్కువ డబ్బును వస్తువుపై ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లేదా ఏ వస్తువునైనా కొనుగోలు చేసే ముందు ఈ హిడెన్ ఛార్జీల గురించి అడిగి క్లారిటీ తెచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఓరేయ్ పాపిష్టోడా.. ఇదేం పనిరా.. పిల్లనిచ్చిన అత్తను పెళ్లాడిన అల్లుడు!

Related News

రూ. 10 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీ.. సగం ధరకే అదిరిపోయే ఫీచర్లు!

రూ.10వేలలోపు హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్..బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్లు ఇవే!

రూ. 14,999 కే హైయర్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. మతిపోయే ఫీచర్లతో రచ్చ

రూ. 899 కే 50 గంటల బ్యాటరీ..ట్రెండ్ సెట్ చేస్తున్న ఇయర్‌బడ్స్!

బిగ్ టీవీలో 3D లోకం.. వీక్షకులకు సరికొత్త విజువల్ వండర్.. అసలేంటీ ఇమ్మర్సివ్ టెక్నాలజీ?

స్టైలిష్ లుక్, అదిరిపోయే బేస్..రూ. 999 కే కేక పుట్టించే ఫీచర్స్

పెద్ద కుటుంబాలకు పర్ఫెక్ట్.. ఈ 10 కేజీల లేటెస్ట్ వాషింగ్ మెషీన్లపై ఓ లుక్కేయండి

కన్వర్టిబుల్ ఫ్రిజ్ కొంటున్నారా? మీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉండేందుకు బెస్ట్ టిప్స్

Big Stories

Advertisement
×