E-Paper
Advertisement

Delhi Crime: ఆమె స్వాట్ కమాండో.. భర్తకు డిఫెన్స్‌లో ఉద్యోగం, ఆపై హత్యలు ఢిల్లీలో దారుణం

Delhi Crime: ఆమె స్వాట్ కమాండో.. భర్తకు డిఫెన్స్‌లో ఉద్యోగం, ఆపై హత్యలు ఢిల్లీలో దారుణం
Advertisement

Delhi Crime: ఢిల్లీలో ఓ మహిళా కమాండో గృహ హింసకు గురైంది. ఆమెని దారుణంగా భర్త కొట్టాడు. ఐదు రోజుల తర్వాత ఆమె మరణించింది. ఢిల్లీలోని ప్రత్యేక పోలీస్ విభాగంలో ఆమె కమాండోగా పని చేస్తున్న సమయంలో ఎందరో ఉగ్రవాదుల భరతం పట్టింది. కానీ తన సొంత ఇంట్లోనే ఓడిపోయింది. అసలు ఏం జరిగింది? ఈ కేసు లోతుల్లోకి వెళ్తే..

ఢిల్లీలో దారుణం.. డంబెల్స్‌తో కొట్టి భార్యని చంపాడు

Advertisement

పైన కనిపిస్తున్న ఆమె పేరు కాజల్. ఢిల్లీ పోలీస్ స్వాట్(స్పెషల్ టీమ్‌)లో కమాండోగా పని చేసింది. నాలుగేళ్ల కిందట ఆమె ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత అంటే మరుసటి ఏడాది 2023లో ఈమె, ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె భర్త అంకుర్‌.. ఢిల్లీ కంటోన్మెంట్‌లో రక్షణ రంగంలోని ఓ విభాగంలో గుమస్తాగా పని చేస్తున్నాడు.

ఈ జంట పశ్చిమ ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈ జంటకు ఏడాదిన్నర బాబు ఉన్నాడు. ప్రేమ పెళ్లి కావడంతో ఈ దంపతులు మొదట్లో బాగానే ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఆర్థిక విషయాలపై తరచుగా గొడవలు పడుతుండేవారని ప్రాథమిక సమాచారం. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది.

Advertisement

భార్య స్వాట్ కమాండో.. భర్తకు డిఫెన్స్‌లో ఉద్యోగం

జనవరి 22న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటలోనే కాజల్‌పై ఆమె భర్త డంబెల్స్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో కాజల్‌కి తీవ్రగాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ జనవరి 27న ఆమె మరణించింది. మొదట మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లు హత్యాయత్నం కేసుగా నమోదు చేశారు.

కాజల్ మరణం తర్వాత ఈ కేసుని హత్య కేసుగా మార్చారు. కాజల్ భర్త అంకుర్‌ని అరెస్టు చేసిన పోలీసులు, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కాజల్ బ్రదర్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడి పేరు నిఖిల్, ఈ ఘటనపై అతడు మాట్లాడాడు. కాజల్-అంకుర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారని తెలిపాడు.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్‌లో 9 మంది!

వివాహం తర్వాత అంకుర్ ఫ్యామిలీ కట్నం గురించి ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపించాడు. మొదట్లో కాజల్ తన అత్తమామలతో సోనిపట్‌లోని గనౌర్‌లో ఉండేది. తరచుగా వివాదాల కారణంగా ఆ జంట మోహన్ గార్డెన్‌ ఏరియాకు మారారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటివరకు వరకట్నానికి సంబంధించిన అభియోగాలు నమోదు చేయలేదని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపాడు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×