E-Paper
Advertisement

Airtel Recharge: సూపర్ డూపర్ ప్లాన్.. 3 నెలల పాటు.. అపరిమిత 5G డేటా, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, కాల్స్!

Airtel Recharge: సూపర్ డూపర్ ప్లాన్.. 3 నెలల పాటు.. అపరిమిత 5G డేటా, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, కాల్స్!
Advertisement

Airtel Recharge: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ప్రవేశపెట్టిన ప్లాన్స్ లో రూ.1,798 రీఛార్జ్ ప్లాన్ బాగా పాపులర్ అయ్యింది. మోస్ట్ వాల్యూ ఫర్ మనీగా యూజర్ల దగ్గర గుర్తింపు సంపాదించింది. అధిక డేటా, ఫ్రీ ఓటీటీ, అపరిమిత కాల్స్, ఫ్రీ కాలర్ ట్యూన్స్ ఇలా అన్ని ప్రయోజనాలు కలగలిసిన కంప్లీజ్ ప్యాకేజీగా ఇది నిలించింది. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

రూ.1798 ప్లాన్ ఫీచర్లు

ఈ ప్లాన్ ను ఎయిర్ టెల్ 84 రోజుల (సుమారు 3 నెలలు) వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. రూ.1798 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజూ 3GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. మీ మెుబైల్ 5G స్మార్ట్ ఫోన్ అయ్యి ఉండి.. మీ ప్రాంతంలో ఎయిర్ టెల్ 5G నెట్ వర్క్ అందుబాటులో ఉంటే మీరు పరిమితి లేకుండా Unlimited 5G డేటాను వాడుకోవచ్చు. మరోవైపు ఈ ప్లాన్ కింద దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. ప్రతీ రోజూ 100 ఉచిత SMSలు పొందవచ్చు.

ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్

Advertisement

రూ.1798 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 84 రోజుల వ్యాలిడిటీతో నెట్ ఫ్లిక్స్ (Basic) సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. అలాగే అదనంగా అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, వింక్ మ్యూజిక్ (Wynk Music), ఉచిత హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ (Adobe Express) ప్రీమియం యాక్సెస్ లభించనుంది.

ఎవరికి ప్రయోజనకరం?

విడిగా నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ కోసం ఖర్చు చేయకుండా రీఛార్జ్‌తో పాటే దాన్ని పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. అదే విధంగా ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా వీడియో స్ట్రీమింగ్ చేసేవారికి రోజువారీ 3GB డేటా సరిగ్గా సరిపోతుంది. మరోవైపు ప్రతి నెలా రీఛార్జ్ చేసే సమస్య లేకుండా 3 నెలల పాటు నిశ్చింతగా ఉండాలనుకునే వారికి కూడా ఈ ప్లాన్ ఉత్తమమైనదిగా చెప్పవచ్చు.

Advertisement

Also Read: Croma Deals: ఇండక్షన్ స్టవ్స్‌పై.. అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇప్పుడు కాక‌ ఇంకెప్పుడు!

రీఛార్జ్ ఎలా చేసుకోవాలి?

రూ.1798 ప్లాన్ రీఛార్జ్ చేసుకునేందుకు ముందుగా మీ ఫోన్ లోని ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ (Airtel Thanks App) ఓపెన్ చేయాలి. అక్కడ రీఛార్జ్ సెక్షన్ లోకి వెళ్లి మీ మెుబైల్ నెంబర్ ఇవ్వాలి. అనంతరం రూ. 1,798 ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకోని రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్‌లో ‘Mobile Recharge’ ఆప్షన్ ద్వారా కూడా ప్లాన్ ఎంచుకోవచ్చు. ఇది కుదరని పక్షంలో నేరుగా ఎయిర్ టెల్ వెబ్ సైట్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

ముఖ్య గమనిక: రీఛార్జ్ చేసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆక్టివేట్ చేసుకోవడానికి మీరు Airtel Thanks App లోని ‘Rewards’ సెక్షన్‌లోకి వెళ్లి ‘Claim’ చేయాల్సి ఉంటుంది.

Also Read: Air Conditioner: ఏసీతో చల్లగాలికి బదులు.. వేడి గాలి వస్తుందా? అయితే ఏ క్షణమైనా..!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×