E-Paper
Advertisement

Croma Deals: ఇండక్షన్ స్టవ్స్‌పై.. అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇప్పుడు కాక‌ ఇంకెప్పుడు!

Croma Deals: ఇండక్షన్ స్టవ్స్‌పై.. అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇప్పుడు కాక‌ ఇంకెప్పుడు!
Advertisement

Croma Deals: ప్రముఖ ఈ – కామర్స్ ఫ్లాట్ ఫామ్ క్రోమాలో సమ్మర్ సేల్స్ నడుస్తున్నాయి. ప్రముఖ కంపెనీల ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్ లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం గ్యాస్ కొరత నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు ఇండక్షన్ స్టవ్స్ కొనుగోలు చేస్తున్నారు. దీనిని గమనించిన క్రోమా.. ప్రముఖ కంపెనీల ఇండక్షన్ స్టవ్స్ పై రాయితీ ప్రకటించింది. భారీ రాయితీతో వాటిని అందిస్తోంది. ఇంతకీ ఆ ఆఫర్ లో లభిస్తున్న ఇండక్షన్ కుక్కర్లు ఏవి? వాటి ఫీచర్లు, ధర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

BAJAJ IRX 220F

బజాజ్ నుంచి వచ్చిన ఈ ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్.. 2200W సామర్థ్యంతో చాలా వేగంగా వంట చేయడానికి సహాయపడుతుంది. ఇది ఇన్‌ఫ్రారెడ్ సాంకేతికతతో పనిచేయడం వల్ల వంట చేసుకునేందుకు స్టీల్, అల్యూమినియం, సిరామిక్ వంటి అన్ని రకాల పాత్రలను వాడుకోవచ్చు. ఇందులో 3 ప్రీసెట్ మెనూలు.. వంట చేసే ప్రక్రియను మరింత సులభతరం చేస్తాయి. దీని అసలు ధర రూ.7,990 కాగా 55 శాతం డిస్కౌంట్ తో రూ.3,599కే క్రోమా దీనిని అందిస్తోంది.

USHA Cookjoy 2000W

Advertisement

ఉషా కుక్‌జాయ్ మోడల్ అధునాతన టచ్ కంట్రోల్ ప్యానెల్‌తో రూపొందింది. ఇది చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. 2000W పవర్‌తో పనిచేసే ఈ స్టవ్.. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి రక్షణ కల్పించే సర్జ్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇందులో పవర్ ఆదా చేసే ఫీచర్లు, టైమర్ సెట్టింగ్స్ ఉండటం వల్ల వంటపై పూర్తిగా వంట దగ్గరే ఉండాల్సిన అవసరం ఉండదు. క్రోమా దీనిని 26 డిస్కౌంట్ తో రూ.4,299కే అందిస్తోంది.

HAVELLS Evo Cook TC20 2000W

హావెల్స్ కంపెనీకి చెందిన ఈ ఇండక్షన్ స్టవ్ మల్టీ-ఫంక్షనాలిటీకి పాపులర్ అయ్యింది. ఇందులో 8 ప్రీసెట్ మోడ్స్ ఉన్నాయి. ఇవి ఇడ్లీ, దోశ, కూరలు, పాలు వేడి చేయడం వంటి పనులను ఒకే టచ్‌తో చేసేలా రూపొందించబడ్డాయి. 2000W సామర్థ్యం గల ఈ స్టవ్‌లో ఆటో-పాన్ డిటెక్షన్, ఆటో-ఆఫ్ ఫీచర్లు ఉన్నాయి. దీని అసలు ధర రూ.5,545 కాగా.. క్రోమా దీనిపై 28 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఫలితంగా రూ.3,999కే దీనిని సొంతం చేసుకోవచ్చు.

Prestige PIC 20 WIZ 1600W

Advertisement

ప్రెస్టీజ్ కంపెనీకి చెందిన ఈ ఇండక్షన్ స్టవ్.. మధ్యతరగతి కుటుంబాలకు సరిగ్గా సరిపోతుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 1600W శక్తితో పనిచేస్తుంది. ఇందులో 7 ప్రీసెట్ మెనూలు ఉన్నాయి. ఇవి భారతీయ వంటలకు అనుగుణంగా రూపొందించడం విశేషం. ఇందులోని ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్.. విద్యుత్ హెచ్చుతగ్గుల సమయంలోనూ స్టవ్ పాడవకుండా రక్షిస్తుంది. క్రోమాలో ఇది 27 శాతం రాయితీతో రూ.2,499 లభిస్తోంది.

Also Read: Air Conditioner: ఏసీతో చల్లగాలికి బదులు.. వేడి గాలి వస్తుందా? అయితే ఏ క్షణమైనా..!

Croma 1600W Single Induction Cooktop

క్రోమా బ్రాండ్ నుండి వచ్చిన ఈ 1600W ఇండక్షన్ స్టవ్.. తక్కువ బడ్జెట్ లో మరో బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. ఇందులో 8 ప్రీసెట్ మెనూలు ఉండటం వల్ల వివిధ రకాల వంటలను చకా చకా పూర్తి చేయవచ్చు. ఇది తక్కువ విద్యుత్తును వినియోగిస్తూ సమర్థవంతంగా పనిచేస్తుంది. పాలిష్ చేసిన బ్లాక్ గ్లాస్ ఫినిషింగ్‌ కారణంగా ఇది చూడటానికి ఎంతో స్టైలిష్ గా ఉంటాయి. బ్యాచిలర్స్ లేదా చిన్న కుటుంబాలకు ఈ ఇండక్షన్ స్టవ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ముఖ్య గమనిక: వార్త రాసే సమయానికి క్రోమాలో ఉన్న ఆఫర్లను మాత్రమే ఇక్కడ అందించడం జరిగింది. సాధారణంగా ఈ – కామర్స్ లో డిస్కౌంట్ పర్సంటేజీ మారుతూ ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసేముందుకు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే మంచింది.

Also Read: Air Cooler Tips: కేవలం రూ.500 ఖర్చుతో.. కూలర్‌ను ఏసీలా మార్చేయండి.. క్రేజీ టిప్స్ భయ్యా!

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×