E-Paper
Advertisement

ఎయిర్‌టెల్ అపరిమిత ప్లాన్స్.. నెల రోజులు మీ ఇష్టం.. డేటా, ఓటీటీలు ఎంతైనా వాడొచ్చు!

ఎయిర్‌టెల్ అపరిమిత ప్లాన్స్.. నెల రోజులు మీ ఇష్టం.. డేటా, ఓటీటీలు ఎంతైనా వాడొచ్చు!
Advertisement

Airtel Unlimited Plans: దేశంలో నాణ్యమైన నెట్ వర్క్, అత్యధికమంది యూజర్లు ఉన్న టెలికాం కంపెనీల్లో భారతీ ఎయిర్ టెల్ ఒకటి. ఈ సంస్థ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన ప్లాన్స్ ను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎలాంటి డేటా పరిమితులు లేని ప్రీపెయిడ్ ప్లాన్స్ ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. నెల రోజుల కాలపరిమితితో ఎయిర్ టెల్ తీసుకొచ్చిన అన్‌లిమిటెడ్ ప్లాన్స్, వాటి ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ.399 రీఛార్జ్ ప్లాన్..

28 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ లో అపరిమిత లోకల్, STD కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అలాగే అపరిమితంగా 4G, 5G డేటాను యూజర్ వాడుకోవచ్చు. అలాగే జియో హాట్స్ స్టార్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ సైతం లభించనుంది. వీటితో పాటు 12 నెలల పాటు అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం, ఎయిర్ టెల్ స్పామ్ ప్రొటెక్షన్ సర్వీస్, ఉచిత హలోట్యూన్స్ ను యూజర్లు పొందవచ్చు.

రూ.449 రీఛార్జ్ ప్లాన్..

Advertisement

పైన పేర్కొన్న ప్లాన్ ను కాస్త అప్ గ్రేడ్ చేసి.. ఎయిర్ టెల్ దీనిని తీసుకొచ్చింది. అపరిమిత డేటా, కాల్స్, రోజుకు 100 SMSలు, జియో హాట్ స్టార్ యథావిధిగా ఈ ప్లాన్ లోనూ లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ లో మరిన్ని అదనపు ప్రయోజనాల కింద 6 నెలల యాపిస్ మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్, 30 GB వరకూ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్, 20 పైగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ను 28 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అలాగే ఏడాది కాలానికి అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం, స్పామ్ అలర్ట్స్, హలోట్యూన్స్ వంటివి యూజర్ పొందవచ్చు.

రూ.1099 రీఛార్జ్ ప్లాన్..

ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునేవారి కోసం ఎయిర్ టెల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్, డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. అలాగే ఫ్రీ హాలోట్యూన్స్ యూజర్ పొందవచ్చు. అయితే ప్రతీ 30 రోజులకు ఒకసారి ఫ్రీ ట్యూన్ ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: జియో సరికొత్త ప్లాన్.. రోజుకు 1.5 GB డేటా, ఫ్రీ సబ్‌స్క్రిప్షన్స్.. నెలంతా ధూమ్ ధామే!

రూ.4099 రీఛార్జ్ ప్లాన్స్

ఏడాది పాటు అపరిమిత 4G లేదా 5G కోరుకునే వారు ఈ ప్లాన్ ను ట్రై చేయవచ్చు. ఇది 365 రోజుల వ్యాలిటిడీతో వచ్చింది. అపరిమిత లోకల్, STD కాల్స్ తో పాటు రోజుకు 100 SMSలు పొందొచ్చు. ప్రతీ నెలా రీఛార్జ్ చేసుకోవాలన్న భయం లేకుండా ఏడాదిపాటు ఈ ప్లాన్ ను యూజర్ వినియోగించుకోవచ్చు.

ముఖ్యగమనిక: ఎయిర్ టెల్ తన రీఛార్జ్ ప్లాన్స్ లో రాష్ట్రం, ప్రాంతాన్ని బట్టి మార్పులు చేస్తుంటుంది. కాబట్టి ప్లాన్ రీఛార్జ్ చేసుకునేముందు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లేదా వెబ్ సైట్ లో ప్లాన్ ప్రయోజనాలను చెక్ చేసుకోగలరు.

Also Read: జియోను నిలదీసిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకూ డెడ్ లైన్.. యూజర్లకు మాత్రం పండుగే!

Related News

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

Big Stories

Advertisement
×