E-Paper
Advertisement

జియోను నిలదీసిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకూ డెడ్ లైన్.. యూజర్లకు మాత్రం పండుగే!

జియోను నిలదీసిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకూ డెడ్ లైన్.. యూజర్లకు మాత్రం పండుగే!
Advertisement

TRAI Warning: టెలికాం రంగంలో పారదర్శకతకు సంబంధించి ట్రాయ్ (Telecom Regulatory Authority of India) రిలయన్స్ జియోకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్లను యూజర్లకు కనిపించకుండా దాచి ఉంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 14 లోపు అన్ని ప్లాన్లకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని జియోను ట్రాయ్ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

అసలేం జరిగింది?

ట్రాయ్ నిబంధనల ప్రకారం.. టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్స్ అన్నింటిని యూజర్లకు అందుబాటులో ఉంచాయి. అయితే జియో మాత్రం.. తన చౌకైన ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ను ఉద్దేశపూర్వకంగా దాచి ఉంచుతున్నట్లు ట్రాయ్ గుర్తించింది. ఉదాహరణకు రోజుకు 1GB డేటా ఇచ్చే కొన్ని ప్లాన్లను జియో తన వెబ్‌సైట్ లేదా యాప్‌లో చూపకుండా కేవలం రిటైల్ స్టోర్లలో లేదా కొన్ని నిర్దిష్ట యాప్‌లలో మాత్రమే అందుబాటులో ఉంచుతోంది. ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని ట్రాయ్ తాజాగా స్పష్టం చేసింది.

ఆ ప్లాన్స్ దాచిపెట్టిన జియో..!

Advertisement

జియో తన చౌకైన, ప్రజాధారణ పొందిన రిఛార్జ్ ప్లాన్స్ రూ.199. రూ.209, రూ.249ను వెబ్ సైట్, యాప్స్ లో కనిపించకుండా దాచిపెట్టినట్లు ట్రాయ్ విచారణ వెల్లడైంది. కొన్ని ప్లాన్లను కేవలం జియో ఫోన్ (JioPhone) లేదా జియో భారత్ (JioBharat) వాడేవారికి మాత్రమే పరిమితం చేయడంపై కూడా TRAI అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ ఫోన్ వాడినా సరే.. అన్ని ప్లాన్లు అందరికీ అందుబాటులో ఉంచాలని ట్రాయ్ ఆదేశించింది.

Also Read: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? అయితే డేంజర్లో పడ్డట్లే.. మీ పర్సనల్ డేటా గోవిందా?

ఏప్రిల్ 14 వరకూ డెడ్ లైన్..

Advertisement

ప్రస్తుతం హైడ్ చేసిన ప్లాన్స్ ను వారం రోజుల వ్యవధిలో అంటే ఏప్రిల్ 14 లోపు వెబ్ సైట్, యాప్ పరిధిలోకి తీసుకొని రావాలని జియోను ట్రాయ్ ఆదేశించింది. ఒకవేళ జియో ఈ పారదర్శక చర్యలు తీసుకోకపోతే.. ట్రాయ్ భారీ జరిమానా విధించే అవకాశముందని టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు. మెుత్తం మీద ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో.. కనిపించకుండా పోయిన చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ తిరిగి అందుబాటులో రానున్నాయి. కాబట్టి జియో యూజర్లకు ఇది పండుగేనని నిపుణులు అంటున్నారు.

Also Read: ఆఫ్రికన్ నమూనాతో.. దేశంలో ఎల్‌పీజీ సమస్యకు చెక్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×