E-Paper
Advertisement

CM Revanth Reddy: పేదవాడి పళ్లెంలో సన్న బియ్యం.. దేశంలోనే తెలంగాణ ఆదర్శం

CM Revanth Reddy: పేదవాడి పళ్లెంలో సన్న బియ్యం.. దేశంలోనే తెలంగాణ ఆదర్శం

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ గడ్డకు ఉన్న పోరాట చరిత్రను, అమాయక గిరిజన బిడ్డల ఆత్మగౌరవాన్ని కొనియాడుతూనే, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సభలో సుమారు రూ. 1250 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఉపముఖ్యమంత్రి పాదయాత్ర స్ఫూర్తి..

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ఈ పిప్రి ప్రాంతం నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 1400 కిలోమీటర్ల మేర సాగిన ఆ యాత్రలో గూడెం గూడెం తిరిగి, ప్రజల కష్టాలను స్వయంగా చూశామని చెప్పారు. అందుకే తాము అధికారంలోకి రాగానే తమ ప్రత్యేక దృష్టిని ఆదిలాబాద్‌పై ఉంచామని తెలిపారు. కొమరం భీమ్, రాంజీ గోండు వంటి వీరులు పుట్టిన ఈ గడ్డపై నిరంకుశ పాలనకు తావులేదని, జల్-జమీన్-జంగిల్ నినాదంతో సాగిన పోరాట స్ఫూర్తితోనే తాము ప్రజాపాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.

కేవలం ఎన్నికల వరకే రాజ‌కీయాలు..

రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే ఉండాలని, ఎన్నికల తర్వాత అభివృద్ధిలో అందరూ కలిసి నడవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ వేదికపై ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించడం ద్వారా తాము సరికొత్త రాజకీయ సంస్కృతికి తెరలేపామని చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలను అరెస్టులు చేసేవారని, కానీ తమ పాలనలో అందరినీ పిలిచి మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. “నిర్మల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే లేకపోయినా, అక్కడి ప్రజలు మా బిడ్డలే.” అని పేర్కొంటూ నిర్మల్‌కు కూడా రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

సంక్షేమ పథకాలు.. సన్న బియ్యం విప్లవం..

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల గురించి సీఎం వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచిందని చెప్పారు. గతంలో పేదలకు దొడ్డు బియ్యం ఇచ్చేవారని, కానీ ఇప్పుడు తెలంగాణలోని 3 కోట్ల 15 లక్షల మందికి దేశంలోనే మొదటిసారిగా సన్న బియ్యం అందిస్తున్నామని గర్వంగా ప్రకటించారు. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున, ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల సాయం అందిస్తున్నామని, ఐటీడీఏ పరిధిలో అదనంగా 25 వేల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తా..

ఆదిలాబాద్‌లో 60 శాతం అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ, ఇక్కడ వ్యవసాయం, పరిశ్రమలు ఆశించిన స్థాయిలో విస్తరించలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని జలవనరులను ఉపయోగించుకుని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఆదిలాబాద్‌ను పాలమూరుతో సమానంగా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని గూడాల పటేళ్లకు ఇచ్చిన మాట ప్రకారం, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాలను మెరుగుపరుస్తామని చెప్పారు.

జిల్లాల సరిహద్దుల మార్పులపై స్పష్టత..

కొత్త మండలాలు లేదా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని సీఎం వివరించారు. 2027 మార్చి 31 వరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని కేంద్రం ఆదేశాలు ఉన్నాయని, అయినప్పటికీ నిబంధనలకు లోబడి ప్రజా అవసరాలను తీరుస్తామని తెలిపారు. తన ప్రభుత్వం అదానీ, అంబానీల కోసం కాదని, పేదవాడి ఆత్మగౌరవం కోసం పనిచేస్తుందని స్పష్టం చేస్తూ, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు.

Read Also: రేపు కర్రెగుట్టలకు డీజీపీ శివధర్ రెడ్డి.. గుత్తికొయ్యలతో ముఖాముఖి, కారణం అదేనా?

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×