E-Paper
Advertisement

OTT సబ్‌స్క్రిప్షన్లు, అన్ లిమిటెడ్ డేటా.. రూ.వెయ్యి బడ్జెట్‌లో టాప్ ప్లాన్‌లు!

OTT సబ్‌స్క్రిప్షన్లు, అన్ లిమిటెడ్ డేటా.. రూ.వెయ్యి బడ్జెట్‌లో టాప్ ప్లాన్‌లు!
Advertisement

Airtel Vs jio prepaid plans: నేటి డిజిటల్ యుగంలో మొబైల్ రీఛార్జ్ అంటే కేవలం కాలింగ్, డేటా మాత్రమే కాదు. ఇప్పుడు టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్ తమ ప్లాన్‌లతో పాటు OTT సబ్‌స్క్రిప్షన్లు, క్లౌడ్ స్టోరేజ్, లేటెస్ట్ ఏఐ టూల్స్‌ను కూడా ఫ్రీగా అందిస్తున్నాయి. మీ బడ్జెట్ రూ.వెయ్యిలోపు ఉంటే.. ఈ రెండు కంపెనీలలో ఏది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది? ఎక్కడ ఎక్కువ డేటా వస్తుంది? ఏ ప్లాన్ ఎంచుకుంటే లాభం? అనే విషయాలను వివరంగా ఇప్పుడు చూద్దాం.

ఎయిర్‌టెల్- జియో ప్లాన్లలో ఏది బెస్ట్?

Advertisement

ఎయిర్‌టెల్- డేటా, ఎంటర్‌టైన్‌మెంట్:

ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం రూ.1000లోపు బడ్జెట్‌లో రకరకాల ప్లాన్‌లను అందిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ డేటా, కోరుకునే వారికి ఎయిర్‌టెల్ మొదటి ప్రాధాన్యతనిస్తుంది.

Advertisement

లాంగ్ టర్మ్ ప్లాన్ (రూ. 979):
ఎయిర్‌టెల్ రూ. 979 ప్లాన్.. 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 2GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ 5G యాక్సెస్ లభిస్తుంది. అదనపు ప్రయోజనాల కింద సోనీ లివ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే , అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి సేవలు ఉచితంగా లభిస్తాయి.

హెవీ డేటా ప్లాన్ (రూ. 838):
మీకు రోజువారీ డేటా ఎక్కువగా కావాలంటే రూ. 838 ప్లాన్ సరైంది. ఇది 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3GB డేటాను అందిస్తుంది. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ , సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్లు కూడా ఉండటం విశేషం.

నెలవారీ ఆఫర్లు:
రూ. 429 , రూ. 379 ప్లాన్‌లు ఒక నెల వ్యాలిడిటీతో వస్తాయి. ఇందులో ఆపిల్ మ్యూజిక్ , గూగుల్ వన్ వంటి క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనాలు లభిస్తాయి.

జియో- OTT , AI ఫీచర్లు:
జియో తన ప్లాన్‌లలో కంటెంట్ , టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా ఏఐ టూల్స్ , క్లౌడ్ స్టోరేజ్ కోరుకునే వారికి జియో సరికొత్త ఆఫర్లను తెచ్చింది.

వాల్యూ ప్లాన్ (రూ. 949 & రూ. 859):
జియో యొక్క రూ. 949 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 2GB డేటా,అన్ లిమిటెడ్ 5G డేటాతో పాటు ‘జియో హాట్‌స్టార్’ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అంతేకాకుండా.. గూగుల్ జెమిని ప్రో, జియో AI క్లౌడ్ వంటి లేటెస్ట్ ఫీచర్లను జియో అందిస్తోంది.

మెగా కంటెంట్ ప్లాన్ (రూ. 500):
మూవీ లవర్స్ కోసం జియో తెచ్చిన ప్రత్యేక ప్లాన్ ఇది. కేవలం 28 రోజుల వ్యాలిడిటీ ఉన్నప్పటికీ.. ఇందులో ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ప్రీమియం, సోనీ లివ్, జీ5, డిస్కవరీ+ వంటి దాదాపు అన్ని ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ లభిస్తుంది.

స్పోర్ట్స్ , గేమింగ్:
రూ. 399 ప్లాన్ ద్వారా ఫ్యాన్‌కోడ్ , జియో గేమ్స్ వంటి గేమింగ్ ప్రయోజనాలను జియో అందిస్తోంది, ఇది యువతకు బాగా నచ్చే ఆప్షన్.

జియో Vs ఎయిర్‌టెల్: ఏది బెస్ట్?
ఈ రెండింటినీ పోల్చి చూస్తే.. యూజర్ల అవసరాలను బట్టి ప్లాన్స్ మారుతుంటాయి.

Also Read:  రాత్రంతా ఏసీ వేసినా కరెంట్ బిల్లు పెరగకూడదా? రిమోట్‌లో ఈ ‘సీక్రెట్’ బటన్ నొక్కండి చాలు !

ఎక్కువ వ్యాలిడిటీ , డేటా: మీకు 84 రోజుల పాటు నిరంతరంగా 2GB డేటా కావాలంటే ఎయిర్‌టెల్ రూ. 979 లేదా జియో రూ. 949 రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే సోనీ లివ్ కావాలనుకుంటే ఎయిర్‌టెల్, హాట్‌స్టార్ కావాలనుకుంటే జియో వైపు వెళ్లొచ్చు.

ఏఐ, క్లౌడ్ స్టోరేజ్: మీరు గూగుల్ జెమిని వంటి ఏఐ టూల్స్ లేదా ఎక్కువ క్లౌడ్ స్టోరేజ్ కోరుకుంటే.. జియో ప్లాన్‌ బెస్ట్.

హెవీ డేటా యూజర్లు: రోజుకు 3GB డేటా కావాలనుకునే వారికి ఎయిర్‌టెల్ రూ. 838 ప్లాన్ చాలా బెస్ట్ ఆప్షన్.

మీ ఛాయిస్ ఏది?
మీరు నెలకు ఎంత డేటా వాడుతున్నారు ? ఏ OTT యాప్స్ అవసరం అనే దానిపైనే ప్లాన్ ఆధారపడి ఉంటుంది. ఏఐ ఫీచర్లలో జియో ఒక అడుగు ముందుండగా.. డేటా స్పీడ్ , కొన్ని ప్రీమియం యాప్స్ విషయంలో ఎయిర్‌టెల్ గట్టి పోటీ ఇస్తోంది. రీఛార్జ్ చేసే ముందు మీ ఏరియాలో 5G నెట్‌వర్క్ సిగ్నల్ ఎలా ఉందో కూడా ఒక్కసారి చెక్ చేసుకోవడం మర్చిపోకండి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×