E-Paper
Advertisement

AI Smart Glasses: సరికొత్త AI కళ్లజోడును రిలీజ్ చేసిన అలిబాబా.. దిమ్మతిరిగే ఫీచర్స్, వర్త్ వర్మ వర్తు!

AI Smart Glasses: సరికొత్త AI కళ్లజోడును రిలీజ్ చేసిన అలిబాబా.. దిమ్మతిరిగే ఫీచర్స్, వర్త్ వర్మ వర్తు!
Advertisement

Alibaba’s AI Smart Glasses: చైనాలో అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ అయిన అలీబాబా.. అద్భుతమైన AI స్మార్ట్ గ్లాసెస్‌ విడుదల చేసింది. క్వార్క్ AI గ్లాసెస్ పేరుతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. చూడ్డానికి సాధారణ సన్ గ్లాసెస్ లా కనిపించినా, చాలా స్మార్ట్ గా ఉంటాయి. ఈ గ్లాసెస్ కళ్లకు ఉంటే ఫోన్ తో అసలు పనే ఉండదు. ఇంతకీ ఈ AI స్మార్ట్ గ్లాసెస్‌ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రెండు రకాల క్వార్క్ గ్లాసెస్

అలీ బాబా రెండు రకాల క్వార్క్ గ్లాసెస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

⦿ క్వార్క్ G1: ఇది కాస్త తక్కువ ధరకు లభిస్తుంది. దీని ధర సుమారు $265(రూ. 24 వేలు)గా నిర్ణయించింది. దీనిలో కెమెరా ఉంటుంది. కానీ, లెన్స్‌ ల లోపల స్క్రీన్ లేదు.

⦿ క్వార్క్ S1: ఇది ప్రీమియం క్వాలిటీ. దీని ధర సుమారు $530(రూ.48 వేలు)గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో కెమెరాతో పాటు లెన్స్ ల లోపల రెండు చిన్న స్క్రీన్లు ఉంటాయి. ఈ రెండు జస్ట్ 45 నుంచి 50 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటాయి.

క్వార్క్ గ్లాసెస్ ప్రత్యేకతలు ఏంటి?

Advertisement

ఈ స్మార్ట్ గ్లాసెస్ ముందు భాగంలో ఒక చిన్న కెమెరా ఉంటుంది. మీరు చూసే వాటి ఫోటోలు, వీడియోలను తీస్తుంది. లెన్స్‌  లోపల చిన్న గ్రీన్ స్క్రీన్లు ఉంటాయి. రెండు వైపుల రెండు చిన్న బ్యాటరీలు ఉంటాయి. ఇందులో రెండు పవర్ ఫుల్ క్వాల్ కామ్ చిప్ ఉంటుంది.

క్వార్క్ గ్లాసెస్ ఎలా ఉపయోగించాలి?

కడి చేతిని గ్లాసెస్ ను తాకగానే యాక్టివ్ అవుతాయి. హలో క్వెన్ అనగానే బ్లూలైట్ వస్తుంది. మీరు నోటితో ఇచ్చే కమాండ్స్ ను ఫాలో అవుతుంది. షాపింగ్ చేసే సమయంలో ఆయా వస్తువుల గురించి వివరాలు అందిస్తాయి. ఎక్కడ చౌకగా దొరుకుతుందో చెప్తుంది. ఒక భాషను మరొక భాషలోకి ట్రాన్స్ లేట్ చేస్తుంది. ఇంగ్లీష్ ను జపనీస్ లోకి, చైనీస్ ను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేస్తుంది.  కొత్త ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో దారి చూపించేందుకు సాయపడుతాయి. మీరు ఏదైనా మీటింగ్ లో పాల్గొంటే, దాన్ని రికార్డు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇయర్‌ ఫోన్స్ లేకుండానే QQ మ్యూజిక్, NetEase నుంచి పాటలు వినవచ్చు. హ్యాండ్స్ ఫ్రీ ఫోన్ కాల్స్ అవకాశం ఉంటుంది.

ఈ గ్లాసులతో పాటు రెండు చిన్న బ్యాటరీలు వస్తాయి. ఒక బ్యాటరీ అయిపోతే, మరొక బ్యాటరీ వేసుకోవాలి. రెండు బ్యాటరీలతో ఈ గ్లాసులను 24 గంటలూ ఉపయోగించవచ్చు.10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 50 శాతం ఛార్జింగ్ వస్తుంది. ఒక్కో బ్యాటరీ 8 గంటలు పని చేస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ గ్లాసెస్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2026లో  ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

Read Also:  ఆ స్మార్ట్ టీవీల్లో నెట్‌ ఫ్లిక్స్ సర్వీసులు బంద్, లిస్టులో మీ టీవీ ఉందేమో చెక్ చేసుకోండి!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×