E-Paper
Advertisement

Ind vs SA 2nd ODI: వ‌రుస‌గా 20 సార్లు టాస్ ఓడిన టీమిండియా,రుతురాజ్ కు మ‌రో ఛాన్స్‌..మార్పులు లేకుండానే

Ind vs SA 2nd ODI: వ‌రుస‌గా 20 సార్లు టాస్ ఓడిన టీమిండియా,రుతురాజ్ కు మ‌రో ఛాన్స్‌..మార్పులు లేకుండానే
Advertisement

Ind vs SA 2nd ODI: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd ODI ) మధ్య మరి కాసేపట్లో రెండో వన్డే ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి వన్డేలో విజయం సాధించిన టీమిండియా, రెండో మ్యాచ్ లో కూడా గెలుపొందాలన్న లక్ష్యంతో సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య మరికాసేపట్లో జరగాల్సిన రెండో వన్డే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. ఇక ఇవాళ కూడా టీమిండియా టాస్ ఓడిపోవ‌డంతో చెత్త రికార్డు న‌మోదు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 20 సార్లు వ‌రుస‌గా టాస్ ఓడింది టీమిండియా. 2023 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా అన్ని వ‌న్డేల్లోనూ టాస్ ఓడిపోతూ వ‌స్తోంది ఇండియా.

Also Read: Ravi Shastri: నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని, గంభీర్ లాగా చిల్ల‌ర వేశాలు వేసేవాడిని కాదు

రాయ్‌పూర్ వేదికగా రెండవ వన్డే

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ( India vs South Africa, 2nd ODI ) మరికాసేపట్లో ప్రారంభం కన్నున రెండవ వన్డే రాయ్‌పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక‌గా జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం కానుంది. రెండవ వన్డే జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ ప్రసారాలు వస్తున్నాయి.

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా బలాబలాలు

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య వన్డే మ్యాచ్ ల బలాబాలాలు ఒకసారి పరిశీలిస్తే, ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 94 వన్డేలు జరిగాయి. ఇందులో టీమిండియా మొత్తం 40 మ్యాచ్ ల‌లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 51 వన్డేలలో విజయం సాధించింది. అంటే టీం ఇండియా పైన పూర్తిగా దక్షిణాఫ్రికా ఆధిపత్యం చెలాయించిందన్నమాట. అయితే ఈ రెండు జట్ల మధ్య మొన్న రాంచీ వేదికగా మ్యాచ్ జరగగా, ఇందులో టీం ఇండియా విజయం సాధించింది. మొదటి వన్డేలో 17 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఇవాళ మరో మ్యాచ్ గెలిస్తే ఈ సిరీస్ టీమ్ ఇండియా వశం కానుంది.

దక్షిణాఫ్రికా VS  భారత్ జ‌ట్లు

Advertisement

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్‌రామ్, టెంబా బావుమా (కెప్టెన్‌), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎన్గిడి

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, KL రాహుల్ (w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ

Also Read: Afghanistan Star Gurbaz: అస‌లు మీరు మ‌నుషులేనా.. గంభీర్ దేవుడు లాంటోడు..టీమిండియా ప్లేయ‌ర్ల‌పై సీరియ‌స్‌

 

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×