E-Paper
Advertisement

వావ్.. స్మార్ట్‌వాచ్‌లో ఇలాంటి ఫీచర్లు కూడా ఉంటాయా? 51 రోజుల బ్యాకప్‌తో Amazfit T-Rex Dual Solar!

వావ్.. స్మార్ట్‌వాచ్‌లో ఇలాంటి ఫీచర్లు కూడా ఉంటాయా? 51 రోజుల బ్యాకప్‌తో Amazfit T-Rex Dual Solar!
Advertisement

Amazfit T-Rex Dual Solar: బయట ఎక్కువ సమయం గడిపేవారికి, ట్రెక్కింగ్ లేదా లాంగ్ రైడ్స్‌కు వెళ్లేవారికి స్మార్ట్‌ వాచ్ బ్యాటరీ త్వరగా అయిపోవడం పెద్ద సమస్య. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అమాజ్‌ఫిట్ కొత్త T-Rex Dual Solar స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. ముందు, వెనుక రెండు వైపులా సోలార్ ఛార్జింగ్ ప్యానెల్స్ ఉండటం దీని ప్రత్యేకత. బలమైన బాడీ, బ్రైట్ స్క్రీన్, అడ్వెంచర్‌లకు ఉపయోగపడే నావిగేషన్ ఫీచర్లతో ఇది అందుబాటులోకి వచ్చింది.

ధర ఎంతంటే?

అమాజ్‌ఫిట్ T-Rex Dual Solar ధర అమెరికాలో 649.99 డాలర్లు. అంటే.. సుమారు రూ.62,300గా ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ వాచ్‌ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ ఇంకా వివరాలు ప్రకటించలేదు. భారత మార్కెట్‌లో ధర, లభ్యతపై స్పష్టత రావాల్సి ఉంది.

డిస్‌ప్లే, బాడీ..

Advertisement

ఈ వాచ్‌లో 1.32 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. 466 x 466 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు, గరిష్ఠంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఎండలో కూడా స్క్రీన్‌పై సమాచారం చదవడం సులభంగా ఉంటుంది. రక్షణ కోసం సఫైర్ గ్లాస్ ఇచ్చారు. గ్రేడ్ 5 టైటానియం బెజెల్, బటన్లు, వెనుక భాగంలో గ్లాస్-సిరామిక్ ప్యానెల్ ఉన్నాయి. తెలుపు, ఎరుపు వెలుతురు ఇచ్చే ఫ్లాష్‌లైట్ కూడా ఉంది. బ్లూటూత్ కాల్స్ కోసం మైక్రోఫోన్, స్పీకర్ అందించారు.

Also Read: రూ.2.99 లక్షల iPhone Duo.. బ్యాటరీ విషయంలో యాపిల్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే!

సోలార్ బ్యాటరీ..

Advertisement

660mAh బ్యాటరీతో వచ్చిన ఈ వాచ్ సాధారణ వాడకంలో 25 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. రోజూ మూడు గంటల పాటు ముందు భాగంపై సూర్యరశ్మి పడితే బ్యాటరీ లైఫ్ 34 రోజుల వరకు పెరగవచ్చు. వెనుక వైపు సోలార్ ఛార్జింగ్‌తో కొన్ని పరిస్థితుల్లో 51 రోజుల వరకు బ్యాకప్ వస్తుందని అమాజ్‌ఫిట్ పేర్కొంది. GPS Accuracy Modeలో 41 గంటల వరకు పనిచేస్తుందని తెలిపింది. Outdoor Extreme, Expedition, Solar Priority మోడ్‌లు కూడా ఉన్నాయి.

నావిగేషన్, ఆరోగ్య ఫీచర్లు..

డ్యూయల్-బ్యాండ్ GPS, ఆరు శాటిలైట్ సిస్టమ్‌ల సపోర్ట్‌తో పాటు కలర్ మ్యాప్స్, రూట్ ప్లానింగ్, టర్న్-బై-టర్న్ దిశలు ఉన్నాయి. 180కి పైగా వర్కౌట్ మోడ్‌లు, Zepp Coach ట్రైనింగ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్, ఒత్తిడి, నిద్ర, చర్మ ఉష్ణోగ్రత వంటి వివరాలను ట్రాక్ చేస్తుంది.

మహిళలకు బెస్ట్ వాచ్:

10 ATM వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు 50 మీటర్ల వరకు వినోద డైవింగ్‌కు సపోర్ట్ ఉంది. Android 7, iOS 14 తర్వాతి వెర్షన్లతో పనిచేస్తుంది. Bluetooth 5.3, 2.4GHz Wi-Fi, Zepp Flow, పోడ్‌కాస్ట్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. Strava, TrainingPeaks, Runna, Google Fit యాప్స్‌తో డేటాను పంచుకోవచ్చు. మహిళల కోసం పీరియడ్ ట్రాకింగ్, శ్వాస వ్యాయామాలు, HRV, శ్వాస నాణ్యత వివరాలూ అందిస్తుంది.

Also Read: 12 జీబీ ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్‌తో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

Tags

Related News

iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!

రే-బాన్ మెటా గ్లాసెస్‌లో ఊహించని అప్డేట్.. ఇప్పుడిక దారి వెతకడం, మ్యూజిక్ వినడం సూపర్ ఈజీ!

బోస్ సౌండ్ స్పీకర్లు, 165Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్!

రూ.2.99 లక్షల iPhone Duo.. బ్యాటరీ విషయంలో యాపిల్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే!

12 జీబీ ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్‌తో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

యాపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. వచ్చే వారమే మార్కెట్లోకి 4 సరికొత్త గ్యాడ్జెట్స్!

క్రియేటర్లకు బంపరాఫర్.. 15 వీడియోలు పెట్టు, లక్షలు సొంతం చేసుకో! ‘ఎక్స్’ ఆఫర్ వెనుక..

Big Stories

Advertisement
×