E-Paper
Advertisement

బుల్లి స్మార్ట్ స్క్రీన్.. వార్తలు, వీడియో కాల్స్, ఓటీటీలు.. క్రేజీ బెన్‌ఫిట్స్ భయ్యా!

బుల్లి స్మార్ట్ స్క్రీన్.. వార్తలు, వీడియో కాల్స్, ఓటీటీలు.. క్రేజీ బెన్‌ఫిట్స్ భయ్యా!
Advertisement

Amazon Echo Show 5: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఎకో షో 5 (Amazon Echo Show 5) పేరుతో అధునాతన స్మార్ట్ డిస్ ప్లేను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది సాధారణ మెుబైల్ స్క్రీన్ తరహాలోనే ఉంటూ అధునాతన ఫీచర్లతో యూజర్లకు ఎన్నో రకాల ప్రయోజనాలను అందించనుంది. రూ.10,999 ధర కలిగిన ఈ స్మార్ట్ డిస్ ప్లే.. ఎలాంటి ఫీచర్లను కలిగి ఉంది? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? వంటి వివరాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.

5.5 అంగుళాల స్మార్ట్ డిస్‌ప్లే

ఎకో షో 5 లో 5.5 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఇది వార్తలు, వాతావరణ సమాచారం, క్యాలెండర్ రిమైండర్‌లు, స్మార్ట్ హోమ్ కెమెరా ఫీడ్‌లను చూడటానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

క్వాలిటీ మ్యూజిక్

Advertisement

గత మోడల్ (2nd Gen)తో పోలిస్తే ఈ 3వ తరం డివైజ్‌లో ఆడియో నాణ్యతను మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు. ఇందులోని 1.75 అంగుళాల స్పీకర్.. రెండు రెట్లు అధిక బాస్‌ను (2X Bass), క్వాలిటీ వాయిస్‌ను అందిస్తుంది. అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, జియోసావన్ వంటి యాప్‌ల ద్వారా మీకు ఇష్టమైన పాటలను అద్భుతమైన సౌండ్‌తో వినవచ్చు.

ఇన్‌బిల్ట్ కెమెరా, వీడియో కాలింగ్

ఇందులో 2 మెగాపిక్సెల్ కెమెరాను ఫిక్స్ చేశారు. దీని ద్వారా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంట్లో లేనప్పుడు అలెక్సా యాప్ ద్వారా మీ ఇంటిని రిమోట్‌గా పర్యవేక్షించడానికి ఈ కెమెరా ఉపయోగపడుతుంది.

శక్తివంతమైన ప్రాసెసర్

Advertisement

ఈ సరికొత్త ఎకో షో 5లో అమెజాన్ సొంతంగా తయారు చేసిన ‘AZ2 Neural Edge’ ప్రాసెసర్ ను అమర్చారు. ఫలితంగా అలెక్సా వాయిస్ కమాండ్లకు మునుపటి కంటే వేగంగా ఇది రియాక్ట్ అవుతుంది.

స్మార్ట్ హోమ్ కంట్రోల్

దీని సాయంతో ఇంట్లోని స్మార్ట్ లైట్లు, ఏసీలు, ఫ్యాన్లు, గీజర్లను వాయిస్ కమాండ్ల ద్వారా నియంత్రించవచ్చు. బెడ్ రూమ్, హాల్‌లో ఉండి కేవలం ‘అలెక్సా, టర్న్ ఆప్ ద లైట్స్’ అని చెప్పడం ద్వారా లైట్లను ఆపివేయవచ్చు.

వ్యక్తిగత గోప్యతకు భద్రత

యూజర్ల గోప్యత కోసం అమెజాన్ ఇందులో ప్రత్యేక బటన్లను అందించింది. మైక్రోఫోన్, కెమెరాను ఆపివేయడానికి ఫిజికల్ బటన్ ఫిక్స్ చేశారు. అంతేకాకుండా కెమెరాను మూసివేయడానికి ఇన్‌బిల్ట్ కెమెరా షట్టర్ కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల మీకు అవసరం లేనప్పుడు కెమెరాను పూర్తిగా క్లోజ్ చేసుకునేందుకు వీలు ఉంటుంది.

Also Read: రూ.8,400 కోట్ల నగదు.. అందగత్తెను భార్యగా ఇవ్వండి.. ఉగాండా ఆర్మీ చీఫ్ వింత డిమాండ్!

ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీట

ఈ డివైజ్‌లో పాటలు వినడం, వీడియో కాల్స్ చేసుకోవడమే కాకుండా ప్రైమ్ వీడియో (Prime Video), నెట్‌ఫ్లిక్స్ (Netflix) వంటి ఓటీటీలను సైతం వీక్షించవచ్చు. దీనిని డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌గా కూడా ఉపయోగించుకుని మీ అందమైన జ్ఞాపకాలను ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు చూపించవచ్చు.

Also Read: విజయ్ ర్యాలీలో బాంబు కలకలం.. సైకిల్ వదిలి నటుడు పరుగో పరుగు!

Related News

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

Big Stories

Advertisement
×