E-Paper
Advertisement

రూ.8,400 కోట్ల నగదు.. అందగత్తెను భార్యగా ఇవ్వండి.. ఉగాండా ఆర్మీ చీఫ్ వింత డిమాండ్!

రూ.8,400 కోట్ల నగదు.. అందగత్తెను భార్యగా ఇవ్వండి.. ఉగాండా ఆర్మీ చీఫ్ వింత డిమాండ్!
Advertisement

Uganda Army Chief: ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా టర్కీ దేశం ముందు ఉంచిన వింత డిమాండ్లు.. యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఉగాండా అధ్యక్షుడు యోవెరి ముసెవెని కుమారుడు అయిన ముహుజీ ఏప్రిల్ 11న (శనివారం) ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. టర్కీ (తుర్కియే) దేశం తమకు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,400 కోట్లు) చెల్లించాలని.. అలాగే ఆ దేశంలోని అత్యంత అందమైన మహిళను తనకు భార్యగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

సోమాలియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉగాండా సైన్యం చేసిన పోరాటం వల్ల టర్కీ ప్రయోజనం పొందిందని ఆర్మీ చీఫ్ ముహూజీ అన్నారు. అందుకు ప్రతిఫలంగా ఈ ‘సెక్యూరిటీ డివిడెండ్’ చెల్లించాలని ఆయన పట్టుబట్టారు. 30 రోజుల్లోగా ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే టర్కీతో దౌత్య సంబంధాలను తెంచుకుంటామని హెచ్చరించారు. కంపాలాలోని టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే టర్కీష్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాలు తమ గగనతలం ఉపయోగించుకోకుండా ఆంక్షలు విధిస్తామన్నారు. తాను చేసిన ప్రతిపాదన టర్కీకి ఎంతో సులభమైందని వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: Iran Warning: అమెరికాకు ఇరాన్ మరొక హెచ్చరిక.. ముప్పు వాటిల్లితే, ఏ పోర్టు సేఫ్‌గా ఉండదంటూ..

ఉగాండా ఆర్మీ చీఫ్.. ఈ తరహా వింత డిమాండ్లు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనే ఆయన తన వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2022లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని వివాహం చేసుకోవడానికి 100 ఆంకోల్ ఆవులను కట్నంగా ఇస్తానని ముహూజీ కైనెరుగాబా ప్రతిపాదన చేశారు. అలాగే పొరుగు దేశమైన కెన్యాపై దాడి చేసి రెండు వారాల్లో నైరోబీని ఆక్రమిస్తానని కూడా గతంలో ట్వీట్లు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు ముహూజీ తండ్రి, ఉగాండా అధ్యక్షుడైన యోవెరి ముసెవెని గతంలో క్షమాపణలు సైతం చెప్పాల్సి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అందమైన యువతిని పంపాలంటూ టర్కీకి చేసిన సూచనలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

Advertisement

Also Read: విజయ్ ర్యాలీలో బాంబు కలకలం.. సైకిల్ వదిలి నటుడు పరుగో పరుగు!

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×