E-Paper
Advertisement

విజయ్ ర్యాలీలో బాంబు కలకలం.. సైకిల్ వదిలి నటుడు పరుగో పరుగు!

విజయ్ ర్యాలీలో బాంబు కలకలం.. సైకిల్ వదిలి నటుడు పరుగో పరుగు!
Advertisement

Vijay Viral Video: తమిళ నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. కన్యాకుమారిలో జరిగిన ప్రచార సభలో.. విజయ్ ప్రచార రథం దిగి సైకిల్ తొక్కే ప్రయత్నం చేశారు. కిక్కిరిసిన అభిమానులు, పార్టీ కార్యకర్తల నడుమ ఆయన సైకిల్ పై కొద్దిదూరం ముందుకు సాగారు. ఈ క్రమంలో గుంపులో నుంచి దూసుకొచ్చిన ఓ వ్యక్తి ఒక్కసారిగా ఎరుపు రంగులో ఉన్న గుండ్రటి వస్తువును.. విజయ్ పైకి విసరడంతో ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి.

బాంబు అనుకొని కలవరం..!

గుర్తు తెలియని వ్యక్తి ఎర్రటి వస్తువు విసరగా.. విజయ్ ఒక్కసారిగా కంగారుపడుతూ సైకిల్ నుంచి దిగిపోవడం పరిస్థితులను ఒక్కసారిగా మార్చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం నెట్టింట వైరల్ గా మారాయి. తనపై బాంబు విసిరాడని భావించి విజయ్ కంగారు పడి సైకిల్ దిగిపోయారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అటు విజయ్ సెక్యూరిటీ సిబ్బంది సైతం.. ఆయన చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడి ఆయన్ను తిరిగి ప్రచార రథంలోకి తీసుకెళ్లడం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Advertisement

అది బాంబు కాదట?

అయితే గుంపు నుంచి వచ్చి విసిరిన వస్తువు బాంబు కాదని తెలుస్తోంది. అది కేవలం బంతి మాత్రమే అన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ ఘటన.. విజయ్ ర్యాలీలోని భద్రతా సవాళ్లను మరోమారు ఎత్తి చూపింది. ఇదిలా ఉంటే విజయ్ వర్గం వాదన మరోలా ఉంది. తమ అధినేత బాంబు భయంతో సైకిల్ ర్యాలీ నుంచి వెనుదిరగలేదని వారు పేర్కొంటున్నారు. వేలాది మంది జనం ఒక్కసారిగా సైకిల్‌ను చుట్టుముట్టడంతో విజయ్ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని.. జనం తాకిడికి ఎవరికైనా గాయాలవుతాయనే ఉద్దేశంతోనే విజయ్ సైకిల్ దిగి వెళ్లిపోయారని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Also Read: ఏసీ లేదని టెన్షనా? ఈ తేలికైన 7 టిప్స్‌తో.. ఇంటిని కాశ్మీర్‌లా మార్చేయచ్చు!

ప్రచారంలో విజయ్ దూకుడు

ఇదిలా ఉంటే తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్.. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. పార్టీ తరపున పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ప్రధాన ప్రత్యర్థి, అధికార డీఎంకే పార్టీపై ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా, ఏప్రిల్ 23న ఎన్నికలు జరిగితే మే 4న ఫలితాలను ప్రకటించనున్నారు. గెలుపుపై విజయ్ ధీమాగా ఉండటం గమనార్హం.

Also Read: ఎయిర్‌టెల్ క్రేజీ ప్లాన్.. అపరిమిత 5G డేటా, ఫ్రీ హాట్‌స్టార్.. ఎన్నో మరెన్నో బెన్‌ఫిట్స్!

Related News

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×