E-Paper
Advertisement

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!
Advertisement

Amazon Great Indian Festival 2026: దసరా, దీపావళి పండుగలకు కొత్త గ్యాడ్జెట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు నచ్చే ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం వచ్చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో యాపిల్, శాంసంగ్, గార్మిన్, అమేజ్‌ఫిట్ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌వాచ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. స్టైలిష్ లుక్‌తో పాటు హార్ట్‌రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, ఫిట్‌నెస్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు అందించే ఈ వాచ్‌లను ఇప్పుడు మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. మరి ఏయే మోడళ్లపై ఎంత తగ్గింపు ఉంది? ఏ వాచ్ ధర ఎంతకు తగ్గింది? టాప్-5 స్మార్ట్‌వాచ్‌ల ఆఫర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..

అద్భుతమైన ఫీచర్లు..

ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లలో కస్టమర్లను ఆకట్టుకునే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యంత స్పష్టంగా కనిపించే అమోలెడ్ డిస్‌ప్లేలు, గుండె వేగం, నిద్ర నాణ్యతను కొలిచే అక్యురేట్ సెన్సార్లు వీటి సొంతం. అమేజ్‌ఫిట్ వాచ్‌లలో ఆఫ్‌లైన్ మ్యాప్స్ సదుపాయం ఉండగా.. శాంసంగ్ మోడల్స్‌లో బీపీ మానిటరింగ్ వంటి ఆధునిక ఫీచర్లు లభిస్తున్నాయి. రోజువారీ వాడకంతో పాటు ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టే వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. పండుగకు బంధువులకు లేదా స్నేహితులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్.

Advertisement

Also Read: ఈ ఫోన్ డిస్‌ప్లే రిపేర్ ఖర్చుతో iPhone 18 Pro కొనేయొచ్చు.. యాపిల్ కొత్త ఫోల్డబుల్ రేట్లు తెలుసా?

యాపిల్, శాంసంగ్ డీల్స్..

యాపిల్ వాచ్ సిరీస్ 11 అసలు ధర రూ.49,900 కాగా, ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు కలిపి కేవలం రూ.34,499కే లభిస్తోంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ వాచ్ 8 అసలు ధర రూ.45,999 ఉంటే.. రూ.3,000 బ్యాంక్ ఆఫర్లతో పాటు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ ద్వారా రూ.20,249 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇఎంఐపై కొనుగోలు చేసే వారికి అదనపు తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి.

గార్మిన్, అమేజ్‌ఫిట్ ఆఫర్లు..

Advertisement

గార్మిన్ వివోయాక్టివ్ 5 వాచ్ అసలు ధర రూ.34,990 కాగా సేల్‌లో రూ.15,499కే అందుబాటులో ఉంది. అలాగే స్పోర్ట్స్ లవర్స్ మెచ్చే గార్మిన్ ఫొర్‌రన్నర్ 265 మ్యూజిక్ మోడల్ రూ.52,990 నుండి తగ్గి రూ.27,990కే లభిస్తుంది. కాస్త తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ కోరుకునే వారికి అమేజ్‌ఫిట్ యాక్టివ్ మాక్స్ వాచ్ రూ.17,999కి బదులుగా రూ.12,249కే లభిస్తోంది.

షాపింగ్ చేసుకునే సమయం..

మీ బడ్జెట్, పర్సనల్ నీడ్స్‌కి తగ్గట్టుగా వీటిలో ఒక మంచి డివైజ్‌ని ఎంచుకోవచ్చు. పండుగ డిస్కౌంట్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు పరిమిత కాలం మాత్రమే ఉంటాయి కాబట్టి.. ఆఫర్ ముగిసేలోపే మీకిష్టమైన స్మార్ట్‌వాచ్‌ను అమెజాన్‌లో ఆర్డర్ చేసుకోండి.

Also Read: ఇకపై అనౌన్ కాల్స్ ఉండవు.. ఫోన్‌లో కాలర్ అసలు పేరు చూపే CNAP సేవలు ప్రారంభం!

Tags

Related News

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

ఆకట్టుకునే లుక్, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్స్‌తో Samsung Galaxy F70 5G వచ్చేస్తోంది!

ఒకే ఒక్క రీఛార్జ్.. ఏడాది పొడవునా ఫ్రీ కాల్స్, డేటా.. Airtel చౌకైన వార్షిక ప్లాన్స్ ఇవే!

ఆఫీస్,స్టడీస్ కోసం బెస్ట్ డెల్ ల్యాప్‌టాప్..120Hz డిస్‌ప్లేతో అదుర్స్!

రూ.937లకే పోర్టబుల్ స్పీకర్! డిస్కౌంట్‌లో కొనేయండి

ఈ సౌండ్ బార్ ఉంటే..ఇల్లు డిస్కో టెక్ అవడం గ్యారంటీ!

Big Stories

Advertisement
×