E-Paper
Advertisement

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!
Advertisement

Age Gap Marriage: వయసు అనేది సంఖ్య మాత్రమేనని, ప్రేమకు దానితో అస్సలు పనే లేదని తరుచూ వింటూనే ఉంటాం. అయితే దీనిని యూపీలోని ఓ జంట నిజం చేసింది. 75 ఏళ్ల వయసున్న వృద్దుడ్ని 30 ఏళ్ల యువతి ప్రేమించడమే కాకుండా.. అతడితో ఏకంగా పెళ్లికే రెడీ అయ్యింది. నవరాత్రి తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జంట నిశ్చితార్థం ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో అందరూ షాకవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాకు చెందిన రీనా అనే 30 ఏళ్ల యువతి సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తోంది. ఈమెకు ఇటీవల 75 ఏళ్ల రామ్ సాగర్ అనే వృద్ధుడితో నిశ్చితార్థం జరిగింది. సుమారు ఆరు రోజుల క్రితం అత్యంత వేడుకగా జరిగిన వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న 45 ఏళ్ల వయసు వ్యత్యాసాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వయసుపై యువతి ఏమన్నదంటే?

Advertisement

సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్న ట్రోల్స్, కామెంట్లపై రీనా స్పష్టత ఇచ్చారు. రామ్ సాగర్‌ను వివాహం చేసుకోవాలనే నిర్ణయంలో తనకు ఎలాంటి సందేహాలు లేవని, వయసు వ్యత్యాసం తమ బంధానికి ఎంతమాత్రం అడ్డంకి కాదని ఆమె పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఇతరులు ఏమనుకున్నా పట్టించుకోనని వెల్లడించారు.

Also Read: కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

ఏడాది కిందట మొదలైన పరిచయం

Advertisement

ఇదిలా ఉంటే.. 75 ఏళ్ల వృద్ధుడితో యువతికి ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం సైతం చేసుకున్నారు. దేవి నవరాత్రుల అనంతరం వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ఈ జంట భావిస్తున్నట్లు సమాచారం. అయితే పెళ్లికి సంబంధించిన తేదీని మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.

Also Read: శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Tags

Related News

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

సీజేపీ నిరసనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వ్యాపారుల పిటిషన్ కొట్టివేత.. పోలీసులకు కీలక ఆదేశాలు!

చెన్నైలో డేంజర్ బెల్స్.. భారీగా పడిపోయిన తాగు నీటి నిల్వలు!

జంతర్ మంతర్‌ వ్యవహారం.. కేంద్రానికి-ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

భార్యపై భర్త పైశాచికత్వం.. నచ్చిన కూర వండలేదని.. శరీరంపై పలుమార్లు కొరికి, బండరాయితో దాడి!

Big Stories

Advertisement
×