Amazon Sale 2026 refrigerators: ఇంట్లో పాత ఫ్రిజ్ మార్చాలన్నా లేదా కొత్త కాపురం పెట్టాలన్నా ముందుగా గుర్తుకొచ్చేది రిఫ్రిజిరేటర్. ముఖ్యంగా ఈ ఏడాది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ప్రముఖ బ్రాండ్లయిన శామ్‌సంగ్ , ఎల్జీ , గోద్రెజ్, హైయర్ ఫ్రిజ్‌లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అయితే.. ఫ్రిజ్ కొనేటప్పుడు చాలా మంది ఎదుర్కొనే పెద్ద సందేహం.. 3-స్టార్ ఫ్రిజ్ కొనాలా లేక 5-స్టార్ ఫ్రిజ్ తీసుకోవాలా అనేది. దీని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.
బీఈఈ సంస్థ ఈ స్టార్ రేటింగ్‌లను కేటాయిస్తుంది. ఫ్రిజ్ ఎంత తక్కువ కరెంట్ వాడి ఎక్కువ కూలింగ్ ఇస్తుందనే దాని ఆధారంగా ఈ స్టార్స్ ఇస్తారు. ఎన్ని ఎక్కువ స్టార్స్ ఉంటే, అంత తక్కువ కరెంట్ బిల్లు వస్తుంది. అయితే దీనికి తగినట్లుగా ఫ్రిజ్ ధర కూడా మారుతుంది.
3-స్టార్ రిఫ్రిజిరేటర్లు: సాధారణంగా డబుల్ డోర్ లేదా కన్వర్టబుల్ మోడల్స్‌లో 3-స్టార్ ఫ్రిజ్‌లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. సేల్ సమయంలో శామ్‌సంగ్ లేదా ఎల్జీ 256 లీటర్ల 3-స్టార్ డబుల్ డోర్ ఫ్రిజ్ సుమారు రూ. 28,000 నుంచి రూ.35,000 ధరల వరకు లభిస్తున్నాయి. అలాగే పెద్ద సైజ్ సైడ్-బై-సైడ్ 3-స్టార్ ఫ్రిజ్‌లు రూ. 72,000 నుంచి రూ. 85,000 మధ్య వస్తున్నాయి.
5-స్టార్ రెఫ్రిజిరేటర్లు: ఇవి మరింత అడ్వాన్స్‌డ్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తాయి. సింగిల్ డోర్ లేదా సెలెక్టెడ్ డబుల్ డోర్ మోడల్స్‌లో 5-స్టార్ ఫ్రిజ్‌లు లభిస్తాయి. వీటి ప్రారంభ ధర సాధారణంగా 3-స్టార్ మోడల్స్ కంటే రూ. 4,000 నుంచి రూ. 8,000 వరకు ఎక్కువగా ఉంటుంది. సేల్స్‌లో ఎస్‌బీఐ క్రెడిట్/డెబిట్ కార్డులపై అదనంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది.
5-స్టార్ ఫ్రిజ్: 3-స్టార్ ఫ్రిజ్‌తో పోలిస్తే.. 5-స్టార్ ఫ్రిజ్ దాదాపు 20% నుంచి 30% వరకు ఎక్కువ కరెంట్ ఆదా చేస్తుంది. మీ ఇంట్లో 24 గంటలూ ఫ్రిజ్ రన్ అవుతూ ఉంటే..ఏడాదికి కరెంట్ బిల్లులో సుమారు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
దీనికి కరెంట్ ఖర్చు కాస్త ఎక్కువే అయినప్పటికీ..ఫ్రిజ్ ప్రారంభ ధర తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ కుటుంబంలో.. వాడకం తక్కువగా ఉంటే, 5-స్టార్ ఫ్రిజ్ కోసం పెట్టే డబ్బులు రికవరీ కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు.
మీరు 3-స్టార్ ఎందుకు కొనాలి?: మీ బడ్జెట్ తక్కువగా ఉండి, ఇంట్లో సభ్యులు తక్కువైతే (2-3 మంది), అలాగే ఫ్రిజ్ వాడకం మీడియంగా ఉంటే.. 3-స్టార్ బెస్ట్ ఆప్షన్. సేల్స్‌లో 3-స్టార్ మోడల్స్‌పై ఎక్కువ ఆఫర్లు, లేటెస్ట్ ఫీచర్లు (కన్వర్టబుల్ ఆప్షన్స్) తక్కువ ధరకే దొరుకుతాయి.
Also Read: రూ.699కే అదిరిపోయే బేస్,లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో హెడ్‌ఫోన్స్
మీ ఇంట్లో తరచూ ఫ్రిజ్ డోర్లు తీయడం, ఎక్కువ వస్తువులు స్టోర్ చేయడం జరుగుతుంటే.. కరెంట్ బిల్లు ఎక్కువగా రాకూడదు అనుకుంటే కచ్చితంగా 5-స్టార్ రిఫ్రిజిరేటరే బస్ట్. ముఖ్యంగా లాంగ్ టర్మ్‌లో ఇది మంచి సేవింగ్స్ ఇస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026లో నో-కాస్ట్ ఈఎంఐ , ఎక్స్ఛేంజ్ ఆఫర్లు , బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్, వంటగది అవసరాలను బట్టి సరైన మోడల్‌ను ఎంచుకొని మీ పండగను ఆనందంగా గడపండి!