Washing Machine Deals: ఇంట్లో బట్టలు ఉతకాలంటేనే చాలా మందికి పెద్ద టాస్క్ లా అనిపిస్తుంది. ముఖ్యంగా నలుగురు లేదా ఐదుగురు సభ్యులున్న మిడిల్ క్లాస్ కుటుంబాల్లో రోజూ బట్టలు ఉతకడం అంటే కష్టమైన పనే. అందుకే మార్కెట్లో సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లకు డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మీ బడ్జెట్ లోనే సరి పోయేలా, అదిరి పోయే ఫీచర్లతో కూడిన బెస్ట్ సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను కొనడానికి ఈ సేల్ అద్భుతమైన వేదిక అని చెప్పొచ్చు. ఈ సేల్‌లో ప్రముఖ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో.. వాటి ధరల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1.LG 7 Kg Semi-Automatic Washing Machine:
మిడిల్ క్లాస్ ఎల్జీ బ్రాండ్ ఎప్పుడూ మొదటి ఆప్షన్‌గా ఉంటుంది. ఈ సేల్‌లో.. ఎల్జీ 7 కేజీ సెమీ-ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ.16,090 నుంచి భారీగా తగ్గి కేవలం రూ.10,990 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.ఇది చిన్న , మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. తక్కువ నీరు, తక్కువ కరెంట్ ఖర్చుతో పాటు బట్టలను అత్యంత శుభ్రంగా ఉతకడంలో.. ఇది బెస్ట్. అలాగే దీని మోటార్ పై కంపెనీ ప్రత్యేక వారంటీని కూడా అందిస్తోంది.
తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారి కోసం హైయర్ బ్రాండ్ అద్భుతమైన ఆప్షన్‌ను ఇస్తోంది. ఈ సేల్ సమయంలో.. హైయర్ వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. దీని ఒరిజినల్ ధర రూ.15,500 ఉండగా..సేల్ ప్రత్యేక ఆఫర్ కింద ఇది కేవలం రూ. 9,490 ధరకే లభిస్తోంది. దీని ప్రత్యేక టెక్నాలజీ.. బట్టల క్వాలిటీ దెబ్బ తీయకుండా మురికిని ఈజీగా వదిలిస్తుంది. పవర్ ఫుల్ మోటార్ , ఫాస్ట్ డ్రైయింగ్ సిస్టమ్ దీని ప్రత్యేకత.
సామ్‌సంగ్ అంటేనే నమ్మకానికి మరో పేరు. ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో సామ్‌సంగ్ సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీని మార్కెట్ ధర రూ. 17,800 ఉండగా..డిస్కౌంట్లు పోను కేవలం రూ.11,990 ధరకే అందుబాటులో ఉంది.ఎయిర్ టర్బో డ్రై సిస్టమ్, రస్ట్-ప్రూఫ్ బాడీ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఆఫర్లను ఉపయోగిస్తే.. ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
విర్ల్‌పూల్ ఏస్ సిరీస్ సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇవి చాలా బాగా పని చేస్తాయ. అంతే కాకుండా ఎంతటి మొండి మరకలనైనా ఈజీగా వదిలిస్తాయి. ఈ మోడల్ అసలు ధర రూ. 18,900 కాగా.. అమెజాన్ సేల్‌లో భారీ తగ్గింపుతో కేవలం రూ. 12,490 ధరకే లభిస్తోంది. అదనపు కూపన్ డిస్కౌంట్లు మరియు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండడంతో సామాన్యులకు ఇది చక్కటి అవకాశం.
Also Read: కొత్త ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ సేల్‌లో ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లపై భారీ తగ్గింపు
లిస్ట్‌లో చివరిగా గోద్రెజ్ బ్రాండ్ కు.. చెందిన సెమీ-ఆటోమేటిక్ మెషీన్ కూడా అద్భుతమైన డీల్‌తో వస్తోంది. దీని సాధారణ ధర రూ. 16,500 ఉండగా..ఫెస్టివల్ సేల్ సందర్భంగా దీనిని కేవలం రూ.10,290 ధరకే కొనొచ్చు. ఇది తక్కువ కరెంట్ ఖర్చుతో పాటు పవర్ ఫుల్ వాషింగ్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీ పాత వాషింగ్ మెషీన్‌ను మార్చుకుంటే మరింత డిస్కౌంట్ కూడా పొందొచ్చు.
ఈ సేల్‌లో కేవలం ప్రైస్ కట్ మాత్రమే కాకుండా.. ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ , డెబిట్ కార్డ్‌లను వాడితే.. అదనపు ఇన్స్టెంట్ డిస్కౌంట్లు లభిస్తాయి. ఇంట్లో వాషింగ్ మెషీన్ మార్చాలని చూస్తున్నట్లయితే..ఈ మోడల్ అందించే ఈ ఎర్లీ డీల్స్ అస్సలు మిస్ చేసుకోకండి!