E-Paper
Advertisement

ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Advertisement

Kissik Talks Ramu Rathod:తెలంగాణ జానపద పాటల గాయకుడిగా, జానపద కళలకు ప్రాధాన్యతనిస్తూ.. వాటిని ట్రెండ్ కి తగ్గట్టుగా కృషి చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ఫోక్ సింగర్ రాము రాథోడ్ (Ram Rathod). తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించుకుని యూట్యూబ్ ద్వారా మరింత పాపులారిటీ అందుకున్న ఈయన బంజారా లంబాడి గిరిజన జానపద గాయకుడిగా మరింత పేరు సొంతం చేసుకున్నారు. ఒకవైపు గాయకుడిగా, నటుడిగా ,డాన్సర్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న రాము రాథోడ్ గత ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొని అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

రాము రాథోడ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే?

అలాంటి రాము రాథోడ్ తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశాడు. ఇక ఇందులో పాల్గొన్న రాము రాథోడ్ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇకపోతే తాజాగా ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా.. అందులో తనకు ఇష్టమైన హీరోయిన్ గురించి చెప్పి అబ్బురపరిచాడు. ఇంటర్వ్యూలో భాగంగా మీకు కాబోయే భార్య ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అని హోస్ట్ వర్ష (Varsha) ప్రశ్నించగా “నాకు ఐశ్వర్యరాయ్ గారంటే చాలా ఇష్టం” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే తనకు ప్రముఖ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు రాము రాథోడ్. ఇకపోతే ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి మీకు భార్యగా కావాలా? అని మళ్లీ వర్ష ప్రశ్నించగా అలా అని నేను అడగలేదు అండి అంటూ కామెంట్ చేశారు మొత్తానికైతే తనకు ఇష్టమైన హీరోయిన్ గురించి చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు రాము రాథోడ్.

గొడవ పడకపోతే రోజు ముగియదు..

Advertisement

ఇక ఇదే ఇంటర్వ్యూలో తన గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా రివీల్ చేశారు. తనకి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని, అయితే తమది నాన్న బుజ్జి కన్నా అని పిలుచుకునే ప్రేమ కాదు అని, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు గొడవలతోనే తమ రోజు ముగుస్తుందని చెప్పుకొచ్చారు. ఇకపోతే గొడవ పడిన 10 నిమిషాలకే తాను తిన్నాడో లేదో అని ఆమె.. తను తిన్నదో లేదో అని తాను ఇద్దరం అనుకుంటామని.. ముఖ్యంగా ఒక్కరోజు గొడవపడకపోయినా.. అసలు ఎందుకు ఈరోజు ఇంత సైలెంట్ గా ఉంది అని తాను అనుకుంటానని తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చారు రాము రాథోడ్.

also read:సినీ ఇండస్ట్రీలో విషాదం.. 24 ఏళ్లకే నటి మృతి..!

రాము రాథోడ్ పెళ్లెప్పుడు?

Advertisement

మొత్తానికైతే తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన ఈయన తన గురించి ఆమె ఎంత కేర్ తీసుకుంటుందో కూడా చెప్పుకొచ్చారు. తాను టెన్షన్ లో ఉన్న విషయాన్ని కూడా తన గర్ల్ ఫ్రెండ్ తనకు చెబుతుంది అని ఆమె తనను అంతలా అర్థం చేసుకుంది అంటూ కూడా తెలిపారు. ఇకపోతే పెళ్లెప్పుడు చేసుకుంటారు అనే విషయంపై మాత్రం రాము రాథోడ్ క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి అయితే రాము రాథోడ్ అటు తనకు ఇష్టమైన హీరోయిన్ గురించి ప్రస్తుతం తన జీవితంలోకి రాబోయే భాగస్వామి తన గర్ల్ ఫ్రెండ్ గురించి పలు వ్యాఖ్యలు చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

Related News

ప్రేమలో విఫలమైతే చచ్చిపోవాలా.. రాము రాథోడ్ సంచలన కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో విషాదం.. 24 ఏళ్లకే నటి మృతి..!

Intinti Ramayanam: కమల్ కు కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..?

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. ధీరజ్ పరిస్థితి దారుణం.. షాకిచ్చిన సేటు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై అనుమానం.. రోహిణి ఇరుక్కుంటుందా..?చివర్లో షాకింగ్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి విడాకులు ఇస్తున్న కమల్.. శ్రీకర్ కు టెన్షన్.. అవని సూపర్ ప్లాన్..

Brahmamudi Serial Today Episode October 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రేఖ ప్లాన్ అట్టర్ ప్లాప్ – సుభాష్ సేఫ్

Big Stories

Advertisement
×