IRCTC Refund Rules: రైలు ప్రయాణానికి ముందుగా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అనుకోకుండా రైలు రద్దయితే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా టికెట్ కోసం పే చేసిన డబ్బులు తిరిగి వస్తాయా? వాటిని ఎలా పొందాలి? అనే డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి. అయితే, రైలును పూర్తిగా రద్దు చేస్తే, టికెట్ రకాన్ని బట్టి ప్రయాణికులు పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే, IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నవారికి, రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్ తీసుకున్నవారికి రీఫండ్ పొందే విధానం వేర్వేరుగా ఉంటుంది.
రైల్వే ఒక రైలును పూర్తిగా రద్దు చేస్తే ఇ-టికెట్ ప్రయాణికులకు టికెట్ ధర పూర్తి స్థాయిలో డబ్బులు తిరిగి చెల్లిస్తారు. సాధారణంగా ఈ ప్రాసెస్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. ప్రయాణికులు స్వయంగా టికెట్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే, రైలు పూర్తిగా రద్దయిన సందర్భంలో సాధారణంగా TDR కూడా ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు డబ్బు చెల్లించిన అకౌంట్ కు రీఫండ్ తిరిగి యాడ్ అవుతుంది. అయితే బ్యాంకు, చెల్లింపు సంస్థను బట్టి డబ్బులు ఖాతాలో జమ అయ్యే డబ్బు సమయం మారే అవకాశం ఉంటుంది.
రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్ తీసుకున్న వాళ్లు, రైలు క్యాన్సిల్ అయినప్పుడు సంబంధిత కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్ కు వెళ్లాలి. అక్కడ రీఫండ్ పొందేందుకు అనుసరించాల్సిన విధానం, అవసరమైన వివరాలను తెలుసుకోవచ్చు. టికెట్ రకం, చెల్లింపు విధానం, నిబంధనలను బట్టి ప్రాసెస్ పద్దతి మారే అవకాశం ఉంటుంది. సో, ముందుగానే అధికారిక సమాచారం తెలుసుకోవడం మంచిది.
ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నవారు తమ రీఫండ్ వివరాలను ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. ఇందుకోసం IRCTC ఇ-టికెటింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. టికెట్ క్యాన్సిల్ వివరాల కోసం My Account → My Transactions → Ticket Cancellation History సెగ్మెంట్ ను చూడాలి. రీఫండ్ వివరాల కోసం My Account → My Transactions → Ticket Refund Historyలోకి వెళ్లి చెక్ చేయాలి. ఇందులో ఉన్న సమాచారం ఆధారంగా టికెట్ క్యాన్సిల్, రీఫండ్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
ప్రయాణానికి బయలుదేరే ముందు రైలు నడుస్తుందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఇందుకోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) వెబ్‌సైట్ లేదంటే యాప్‌ను ఉపయోగించవచ్చు. అలాగే ఇండియన్ రైల్వే హెల్ప్ లైన్ 139 ద్వారా కూడా డీటైల్స్ పొందే అవకాశం ఉంటుంది. రైలు క్యాన్సిల్ అయినప్పుడు టికెట్ డబ్బుల గురించి టెన్షన్ పడకుండా, ముందుగా క్యాన్సిల్ స్టేటస్ ను కన్ఫార్మ్ చేసుకొని, టికెట్ కు సంబంధించి రీఫండ్ రూల్స్ ఫాలో కావడం మంచిది.
Read Also: 6 రాష్ట్రాల మీదుగా 4,188 కి.మీ ప్రయాణం.. దేశంలో లాంగెస్ట్ ట్రైన్ జర్నీ ఇదే!