BigTV English

Redmi 13C 5g @ Rs 373: రెడ్ మీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 5G ఫోన్ రూ. 373కే.. నమ్మట్లేదా.. అయితే ఒకసారి మీరే చెక్ చేయండి!

Redmi 13C 5g @ Rs 373: రెడ్ మీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 5G ఫోన్ రూ. 373కే.. నమ్మట్లేదా.. అయితే ఒకసారి మీరే చెక్ చేయండి!

Redmi 13C 5g Mobile @ Rs 373: రెడ్ మీ మొబైల్స్‌కు దేశీయ టెక్ మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. స్మార్ట్‌ ఫోన్ మార్కెట్‌లో రెడ్ మీ ఎంట్రీ ఇచ్చాకే చాలా వరకు ఫోన్ల ధరలు తగ్గాయనే చెప్పాలి. కంపెనీ ఎప్పుడు కూడా మిడ్ రేంజ్ బడ్జెట్ సెగ్మెంట్‌‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. ఈ మొబైల్స్‌కు సపరేట్‌గా ఫ్యాన్స్ బేస్ ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రెడ్ మీ మొబైల్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. మీరు రెడ్ ‌మీ మొబైల్ కొనాలని చూస్తుంటే ఇదే మీకు కరెక్ట్ టైమ్.


రెడ్ మీ బ్రాండెడ్ స్మార్ట్ ‌ఫోన్ 13C 5G పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ లేదా రెడ్ మీ అధికారికి వెబ్‌సూట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఫోన్ అసలు ధర రూ.11,999కాగా.. అమెజాన్‌లో దీనిపై 36 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీని ప్రకారం ఫోన్‌ను రూ. 7,699కే దక్కించుకోవచ్చు. అంతేకాకుండా EMI ఆఫ్షన్ ద్వారా నెలకు రూ.373 చెల్లించి పొందవచ్చు.

Also Read: వివో నుంచి 3D కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్.. ధర ఎంతంటే?


ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటు ఉంది. 4GBRAM+128GB, 6GBRAM+128GB, 8GBRAM+256GB స్టోరేజ్ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టోరేజ్‌ను బట్టి ధరలు మారుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు అమెజాన్‌లో మంచి రేటింగ్ ఉంది. ఇప్పటికే 5000 మందికి పైగా కొనుగోలు చేశారు. ఇప్పటివరకూ కొనుగోలు చేసిన 3,141 మంది రివ్యూలు ఇచ్చారు.

ఈ మొబైల్‌‌లో 50MP AI ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 4-in-1 సూపర్ పిక్సెల్ కలిగి ఉంది. ఇందులో ఫొటోలను పోర్ట్రయిట్, నైట్, 50MP మోడ్, టైమ్ లాప్స్, క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్స్, ఫ్రేమ్, HDR, గూగుల్ లెన్స్ వంటి ఫీచర్లతో తీయొచ్చు. వీడియో కాలింగ్, సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Also Read: రూ.10వేల లోపే రియల్ మీ నుంచి 5G ఫోన్..!

రివ్యూల ఆధారంగా మొబైల్ క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, లుక్, పీచర్లు, పెర్ఫార్మెన్స్ పర్వాలేదు. బ్యాటరీ త్వరగా హీట్ అవుతోంది. కానీ ఆ ధరలో ఈ ఫోన్ తగినదిగా వినియోగదారులు చెబుతున్నారు. అలాగే సౌండ్ క్వాలిటీ అంత గొప్పగా ఏమి లేదని అంటున్నారు. ఈ మొబైల్‌తో మీకు హ్యాండ్‌సెట్, పవర్ అడాప్టర్, సిమ్ ట్రే ఎజెక్టర్, USB కేబుల్ బాక్సులో వస్తాయి.

Related News

OnePlus 24GB RAM Discount: వన్ ప్లస్ 24GB RAM ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ.33000 వరకు డిస్కౌంట్

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Big Stories

×