Big Stories

With out Ticket Journey in Train: టిక్కెట్టు లేకుండానే మహిళ రైలు ప్రయాణం.. పైగా తోటి ప్రయాణికులతో గొడవ

Women Travelling With out Ticket in Train: టిక్కెట్ లేని ప్రయాణం నేరం అని ప్రతీ ప్రజా రవాణా వాహనాలపై రాసి ఉంటుంది. టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేస్తే 500 జరినామా 6 నెలలు జైలు శిక్ష అని కూడా ఉంటుంది. అయితే ఇలా రాసినా ఏం లాభం. చాలా మంది అదే పని చేస్తుంటారు. బస్సుల్లో, రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణించి ఒకవేళ అడిగినా తిరిగి వారినే దబాయిస్తుంటారు. తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది.

- Advertisement -

ఓ మహిళ టిక్కెట్ లేకుండానే రైలులో ప్రయాణించింది. అది కూడా టిక్కెట్ లేకుండా ఓ సీట్లో దర్జాగా కూర్చుని మరి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ టిక్కెట్ లేకుండానే రైలు ఎక్కింది. ఓ ఖాళీ సీటు కనిపించడంతో వెళ్లి కూర్చుంది. ఇంతలోనే ఆ సీటుకు టిక్కెట్ తీసుకున్న వ్యక్తి వచ్చి అది తన సీటు అని చెప్పడంతో మహిళ లేవకుండా అక్కడే కూర్చుంది. దీంతో తోటి ప్రయాణికులకు, మహిళకు మధ్య వాగ్వాదం మొదలైంది.

- Advertisement -

తానొక రైల్వే ఉద్యోగిని అని చెబుతూ సీటు నుంచి కదలకుండా కూర్చుంది. దీంతో ప్రయాణికులకు, మహిళకు మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రైల్వే సేవ కూడా స్పందించింది. ప్రయాణానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు మెసేజ్ రూపంలో తమకు సమాచారం ఇవ్వాలని లేదా 139కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొంది.

Also Read: Viral Wedding Card: సీఎస్కే పేరుతో పెళ్లి కార్డు.. ఓ పెళ్లి జంట వినూత్న ఐడియా..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News